pizza

Comrade Kalyan pre release press meet
‘కామ్రేడ్ కళ్యాణ్’ దసరా సీజన్‌లో అందరూ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఎంజాయ్ చేసే హిలేరియస్ ఫన్ ఎంటర్‌టైనర్: ప్రీరిలీజ్ ప్రెస్‌మీట్‌లో హీరో శ్రీ విష్ణు

You are at idlebrain.com > news today >

08 October 2026
Hyderabad

‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో అలరించబోతున్నారు. జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. మహిమా నంబియార్ హీరోయిన్. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్, టీజర్ పాటలతో సినిమాపై అంచనాలు పెరిగాయి. ‘కామ్రేడ్ కళ్యాణ్’ అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్‌మీట్‌లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. అక్టోబర్ 9న ‘కామ్రేడ్ కళ్యాణ్’ రిలీజ్. దసరా సీజన్‌లో అందరూ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఈ సినిమాకు వెళ్లి మనస్ఫూర్తిగా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలకు కూడా ఈ సినిమా చాలా బాగా నచ్చుతుంది. మేము రిలీజ్ చేసిన కంటెంట్ అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. మాకు ఉన్న సమయంలో చక్కగా ప్రమోషన్ చేసి సినిమాను తీసుకొస్తున్నాం. తప్పకుండా మీరు థియేటర్‌లో సినిమా చూసి ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను. ఇందులో ఈ క్యారెక్టర్ చేసినప్పుడు చాలా ఎక్సైట్ అయ్యాను. ఇందులో కొన్ని భారీ డైలాగులు కూడా చెప్పాను. అవి మీరు వింటున్నప్పుడు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు.,ఈ కథలో ఎంచుకున్న పాయింట్ కొంచెం సీరియస్‌గానే ఉంటుంది. ఈ పాయింట్‌ని ప్రపంచవ్యాప్తంగా ఏ భాషలో అయినా తీయొచ్చు. దానికి మేము నక్సల్ బ్యాక్‌డ్రాప్‌ని జోడించడం చాలా ఇంట్రెస్టింగ్‌గా అనిపించింది. అది కమర్షియల్ గా చాలా మంచి ఎంటర్టైనర్ గా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుంది.

కోన వెంకట్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. ఈరోజు మా ‘కామ్రేడ్ కళ్యాణ్’.. రేపట్నుంచి ‘కామెడీ కళ్యాణ్’ అవుతాడు. అందరి హీరోకి ఫ్యాన్స్ ఉంటారు. అందరి హీరోల ఫ్యాన్స్ కూడా శ్రీ విష్ణుని ఇష్టపడతారు. ‘అందరివాడు’ అనే టైటిల్‌ శ్రీ విష్ణు సరిపోతుంది. తను అందరి హీరోలతో, అందరి అభిమానులతో కూడా చాలా బాగుంటాడు. ప్రతి ఒక్కరూ మంచి కోరుకునే వ్యక్తి శ్రీ విష్ణు. ఈ సినిమాకి అన్నీ కలిసి వచ్చాయి. మేము రిలీజ్ చేసిన ప్రతి కంటెంట్‌కి చాలా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా రెండేళ్ల జర్నీ. ఈ సినిమా కోసం ఒరిస్సా, కర్ణాటక, తమిళనాడు ఇలా అన్ని రాష్ట్రాల్లో తిరిగి చేశాం. ఎవరూ ఎక్స్ ఫ్లోర్ చేయని కొత్త లొకేషన్స్‌లో ఈ సినిమాని చేశాము. నిర్మాత కృష్ణకి ఇది ఫస్ట్ సినిమా ఎక్స్‌పీరియన్స్. ఎక్కడా కూడా రాజీ పడకుండా ఈ సినిమాని నిర్మించాడు. ప్రేక్షకులు కృష్ణకి ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ బెస్ట్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. శ్రీ విష్ణు సినిమా సినిమాకి తన ఆడియన్స్‌ని పెంచుకుంటున్నాడు. తను అందరి ఇళ్లల్లో ఉన్నాడు. తన కామెడీ టైమింగ్‌కి ఫ్యాన్స్ ఉన్నారు. తను ప్రతి సినిమాని చాలా కేర్‌ఫుల్‌గా ప్లాన్ చేసుకుంటాడు. శ్రీ విష్ణుతో మా కాంబినేషన్‌లో వస్తున్న ఫస్ట్ సినిమా ఇది. మెమరబుల్ సినిమా కావాలని, తన కెరీర్‌లో మోస్ట్ హిలేరియస్ ఎంటర్‌టైనర్‌గా ఒక తీపి గుర్తులాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. హరీశ్ శంకర్, బాబీ, శివ నిర్వాణ ఇలా ఎంతోమంది డైరెక్టర్లను నాకున్న శక్తితో పరిచయం చేశాను. ఇప్పుడు జానకిరామ్ ను పరిచయం చేస్తున్నాను. ఒక సక్సెస్‌కి చాలా శక్తి ఉంటుంది. అలాంటి శక్తిని మీరు ఇవ్వాలని కోరుకుంటున్నాను. మా ‘కామ్రేడ్ కళ్యాణ్’ మీ అందర్నీ ఎంటర్‌టైన్ చేస్తాడు.

డైరెక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నా దేవుడు శ్రీ విష్ణు గారికి, నా మెంటార్ కోన వెంకట్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమా ఎంత అద్భుతంగా వచ్చి ప్రేక్షకుల ముందుకు వస్తుందంటే దానికి కారణం వారే. అలాగే మా నిర్మాత కిట్టు గారు కూడా ఎంతో పాజిటివ్‌గా ఈ సినిమాని చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూడా నవ్వుతూనే ఉంటారు. రేపట్నుంచి కలెక్షన్స్ రూపంలో ఆ నవ్వు కొనసాగుతూనే ఉంటుంది. అందరికీ థాంక్యూ సో మచ్.

నిర్మాత వెంకట కృష్ణ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నిర్మాతగా ఇది నా తొలి సినిమా. శ్రీ విష్ణు గారు, కోన గారు చాలా సపోర్ట్ చేశారు. మా దర్శకుడు సినిమాను చాలా అద్భుతంగా తీశాడు. మీరందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరూ అక్టోబర్ 9న ఈ సినిమాని థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved