‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు పీరియడ్ ఎలిమెంట్స్, హ్యూమర్, రొమాన్స్, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా ‘కామ్రేడ్ కళ్యాణ్’ తో అలరించబోతున్నారు. జనకిరామ్ మారెళ్ల దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పిస్తున్నారు. స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా అక్టోబర్ 9న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఇప్పటికే గ్లింప్స్, పాటలతో ఆసక్తిని పెంచిన మేకర్స్.. తాజాగా సినిమా టీజర్‌ను విడుదల చేశారు.
1992లో ఆంధ్రా-ఒడిశా సరిహద్దు నేపథ్యంలో ‘కామ్రేడ్ కళ్యాణ్’ కథ సాగుతుంది. ఇందులో శ్రీ విష్ణు థియేటర్ ఓనర్‌గా కనిపించారు. విప్లవ చిత్రాల దర్శకుడు ఆర్. నారాయణమూర్తికి ఆయన వీరాభిమాని. ఆయన సినిమాలనే ఎక్కువగా థియేటర్‌లో ప్రదర్శిస్తుంటాడు. ఇలా సంతోషంగా, ఎలాంటి సమస్యలు లేకుండా సాగిపోతున్న అతని జీవితంలోకి ఓ ఒడియా అమ్మాయి వస్తుంది. ఆమెతో ప్రేమలో పడిన తర్వాత పరిస్థితులు అనూహ్యంగా మారుతాయి. చివరికి అతడిని నక్సలిజం వైపు నడిపించే పరిస్థితులు ఏర్పడతాయి.
సీరియస్ బ్యాక్‌డ్రాప్ ఉన్నప్పటికీ దర్శకుడు జనకిరామ్ మారెళ్ల ఈ కథను ప్రధానంగా హ్యూమర్ యాంగిల్‌లో తెరకెక్కించినట్లు టీజర్ చూస్తే అర్థమవుతోంది. నక్సలిజానికి సంబంధించిన కొన్ని సన్నివేశాలు మినహా.. టీజర్ అంతా లైట్‌హార్టెడ్, ఎంటర్‌టైనింగ్ టోన్‌లో సాగింది. సినిమాలో కామెడీ ప్రధాన బలంగా నిలుస్తోంది.
శ్రీ విష్ణు మరోసారి ‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ అనే పేరుకు తగ్గట్టుగా తన కామెడీ టైమింగ్, ఈజీ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. థియేటర్ ఓనర్‌గా, ఆర్. నారాయణమూర్తి అభిమానిగా ఆయన పాత్రలో మంచి హ్యూమర్ కనిపించింది. ముఖ్యంగా సత్య, సుదర్శన్‌లతో శ్రీ విష్ణు చేసే సన్నివేశాలు టీజర్‌లో ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ఒడియా అమ్మాయి పాత్రలో మహిమా నంబియార్ ఆకట్టుకున్నారు. రాధికా శరత్‌కుమార్ తన పాత్రలో మంచి కన్విక్షన్‌తో కనిపించారు. షైన్ టామ్ చాకో సీరియస్ అవతార్‌లో కనిపించగా, ఉపేంద్ర లిమాయే కీలక పాత్రలో కనిపించారు.
సినిమాటోగ్రాఫర్ సాయి శ్రీరామ్ ఆంధ్రా-ఒడిశా సరిహద్దు ప్రాంతంలోని గ్రామీణ అందాలను అద్భుతంగా చూపించారు. పచ్చని ప్రకృతి, సహజమైన పరిసరాలు సినిమాకు మంచి విజువల్ రిచ్‌నెస్‌ను తీసుకొచ్చాయి. విజయ్ బుల్గానిన్ సంగీతం సినిమాలోని కామెడీ మూడ్‌కు చక్కగా సరిపోవడంతో పాటు, నక్సలైట్ బ్యాక్‌డ్రాప్‌లో అడవుల్లో సాగే సన్నివేశాల్లో టెన్షన్‌ను కూడా క్రియేట్ చేసింది. ఛోటా కె. ప్రసాద్ ఎడిటింగ్. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి.
హ్యూమర్‌ను ఆసక్తికరమైన విప్లవ నేపథ్యంతో మేళవించిన టీజర్.. ముఖ్యంగా శ్రీ విష్ణు పాత్రలో వచ్చే మార్పుపై ఆసక్తిని పెంచింది. టీజర్ ఒక ఎంటర్‌టైనింగ్ రైడ్‌ను అందిస్తుందని హామీ ఇస్తూనే.. ఓ ఆసక్తికరమైన ప్రశ్నను కూడా ప్రేక్షకుల ముందు ఉంచింది. ఇంత సంతోషంగా, ఎలాంటి టెన్షన్ లేకుండా జీవించే కళ్యాణ్‌ను చివరకు విప్లవం వైపు నడిపించిన పరిస్థితులు ఏమిటి? అనే ఆసక్తిని పెంచింది.
టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో శ్రీ విష్ణు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. కామ్రేడ్ అంటే స్నేహితుడు. కళ్యాణ్ అంటే శుభం. ఎప్పుడూ పక్కవాళ్ల శుభం కోరుకునే స్నేహితుడు. సినిమా అంతా సరదా సరదాగా ఉంటుంది. ఇలాంటి మంచి కథ తీసుకొచ్చిన కోన గారికి థాంక్యూ. అలాగే భాను నందు చాలా అద్భుతంగా రాశారు. డైరెక్టర్ జానకిరామ్‌కి చాలా పెద్ద సూపర్ హిట్ రావాలని కోరుకుంటున్నాను. మనం మంచి సినిమా చేసినప్పుడు, అందులో విలువ ఉన్నప్పుడు ఆడియన్స్ మనకి విజయాన్ని ఇస్తారు. మా శివ గారికి, బాబీ గారికి అందరికీ థాంక్యూ. ఈ వేడుకకి నారాయణమూర్తి గారు, విజయేంద్ర ప్రసాద్ గారు రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ అంతా సినిమా చాలా సరదాగా ఉంటుంది. నెమ్మదిగా కథలోకి వెళ్లాక సత్య గారు వస్తారు. జానకిరామ్ సత్యని చాలా కొత్తగా చూపించాడు. చాలా వెరైటీ ఫన్ ఉంటుంది. మీ అందరికీ సినిమా ఖచ్చితంగా బాగా నచ్చుతుంది. అందరికీ థాంక్యూ సో మచ్.
రచయిత విజయేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ.. “కామ్రేడ్‌ని విడగొడితే కామ్ రెడీ. నిశ్శబ్దంగా ఉండే రాజు, మెల్లగా వచ్చ, హృదయాలను దోచే రాజు. శ్రీ విష్ణు గారి సినిమా బిగ్గెస్ట్ హిట్ కావాలని ఎవరు అన్నారు? నేను అనుకోలేదు. ఎందుకంటే ఎంత సాధించినా అది ‘బాహుబలి’ కంటే ఒక రెండు కోట్లు తక్కువే ఉండాలి. (నవ్వుతూ) శ్రీ విష్ణుకి ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఆర్. నారాయణమూర్తి గారికి, కోన వెంకట్ గారికి అందరికీ ధన్యవాదాలు.
ఆర్. నారాయణమూర్తి మాట్లాడుతూ..ముందుగా మాకు ఇంత ఘన స్వాగతం పలికిన చిత్ర బృందానికి అభినందనలు. కొత్త దర్శకులకు శ్రీ విష్ణు అవకాశాలు ఇవ్వడం నిజంగా చాలా గొప్ప విషయం. ఒక రైజింగ్‌లో ఉన్న హీరో కొత్త దర్శకులకు తన డోర్స్ తెరుస్తూ అవకాశాలు ఇవ్వడం ఎంతో మంది దర్శకులకు ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని ఇస్తుంది. ప్రజల కోసం జీవితాన్ని త్యాగం చేసే వారిని కామ్రేడ్స్ అంటారు. కాకపోతే సెన్సార్ వాళ్లు ‘కామ్రేడ్’ అనే పదంపై అభ్యంతరం తెలిపారని విన్నాను. సెన్సార్ ఇబ్బంది పెట్టడం ధర్మం కాదు. సినిమా అనేది చాలా మంది శ్రమతో కూడుకున్న పరిశ్రమ. దయచేసి ఆ పరిశ్రమని ఇబ్బంది పెట్టకండి. ఇది భావ ప్రకటన స్వేచ్ఛ. దాన్ని మీరు అడ్డుకోవద్దు. ఇది నా విజ్ఞప్తి. ఈ టీజర్ చూస్తే నాకు చాలా మంచి వినోదం, ప్రేమ కనిపిస్తున్నాయి. జానకిరామ్ చాలా అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.
డైరెక్టర్ బాబీ మాట్లాడుతూ.. కోన వెంకట్ గారు నాకు గాడ్‌ఫాదర్. ఆయన నుంచే పరిశ్రమలో ఎలా నడవాలో నేర్చుకున్నాను. ఈ కథ నేను విన్నాను. కచ్చితంగా చాలా పెద్ద హిట్ అవుతుంది. జానకిరామ్ చాలా కాన్ఫిడెంట్ డైరెక్టర్. కచ్చితంగా ఈ సినిమాకి డబ్బులు వస్తాయి. ఎందుకంటే కోన గారు అన్నీ చాలా జాగ్రత్తగా చూసుకొని చేస్తారు. శ్రీ విష్ణు గారు రవితేజ గారి లాగా కొత్త దర్శకులందరికీ అవకాశాలు ఇస్తుంటారు తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద బ్లాక్‌బస్టర్ కాబోతోంది.
డైరెక్టర్ శివ నిర్వాణ మాట్లాడుతూ.. కోనగారు ‘నిన్ను కోరి’తో నన్ను డైరెక్టర్‌ని చేశారు. కోన వెంకట్ గారి టేస్ట్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటుంది. శ్రీ విష్ణు గారితో నాకు ‘సోలో’ సినిమా నుంచి ట్రావెల్ ఉంది. నేను ఇంట్లో శ్రీ విష్ణు గారి సినిమాలే ఎక్కువ చూస్తుంటాను. ఈ సినిమాని కూడా ఆడియన్స్ రిపీట్‌గా చూస్తారని కోరుకుంటున్నాను.
నందిని రెడ్డి మాట్లాడుతూ.. “కోన అన్న ఫంక్షన్ అంటే సెలబ్రేషన్ లాగా ఉంటుంది. శ్రీ విష్ణు ఆన్ స్క్రీన్ కామెడీ టైమింగ్ కంటే ఆఫ్ స్క్రీన్ కామెడీ టైమింగ్ చాలా బాగుంటుంది. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
బీవీఎస్ రవి మాట్లాడుతూ.. “ఈ సినిమాలో నేను చిన్న క్యారెక్టర్ చేశాను. జానకిరామ్ చాలా కాన్ఫిడెంట్‌గా ఈ సినిమా తీశాడు. చాలా పెద్ద సినిమా అవుతుంది. శ్రీ విష్ణు గారి సినిమాలు మనమందరమూ చూస్తాము. తప్పకుండా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుతుంది.
డైరెక్టర్ వీఎన్ ఆదిత్య మాట్లాడుతూ.. కోన వెంకట్ గారు ఏది చేసినా ఒక సెలబ్రేషన్ లాగా చేస్తారు. ఈ వేడుకకి ఇంతమంది గెస్టులు రావడం చాలా హ్యాపీగా ఉంది. టీమ్ అందరికీ కంగ్రాట్యులేషన్స్. గత మూడు నెలలుగా సినిమాలు అద్భుతంగా ఆడుతున్నాయి. కాకపొతే సెన్సార్ నుంచి కొన్ని ఇబ్బందులు ఉంటున్నాయి. సినిమాని అనవసరంగా సెన్సార్ ఇబ్బందులు పెట్టకూడదని నా విజ్ఞప్తి.
డైరెక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. శ్రీ విష్ణు గారు నన్ను సపోర్ట్ చేశారు. నా తొలి సినిమాకి శ్రీ విష్ణు గారి లాంటి హీరో దొరకడం నా అదృష్టం. కోన వెంకట్ గారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. అలాగే కృష్ణ గారికి ధన్యవాదాలు. మా టీమ్ అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. అక్టోబర్ 9న అందరం థియేటర్‌లో కలుద్దాం”
నిర్మాత కోన వెంకట్ మాట్లాడుతూ.. “కామ్రేడ్ అంటే మన కష్టంలో, నష్టంలో మన చేయి వదలకుండా చివరి వరకు మనతో ఉండే వాళ్లని కామ్రేడ్స్ అంటారు. ఈ వేడుకకి వచ్చిన మీరందరూ కూడా నా కామ్రేడ్స్. శ్రీ విష్ణు ప్రతి సినిమాకి 10 మెట్లు పైకి ఎక్కుతున్నాడు. తన సక్సెస్ రేట్‌ని పెంచుకుంటూ వెళ్తున్నాడు. తన కెరీర్‌లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ సినిమా తీశాము. అది నేను గర్వంగా చెప్తున్నాను. నారాయణ మూర్తిగారు ఈ వేడుకకి పెర్ఫెక్ట్ గెస్ట్. విజయేంద్ర ప్రసాద్ నా గురువు. ఆయన ఈ వేడుకు రావడం చాలా ఆనందంగా ఉంది. మరో రెండేళ్లలో శ్రీ విష్ణుని చాలా పెద్ద స్థాయిలో తెలుగు ప్రేక్షకులు పెట్టబోతున్నారు. మరోసారి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
నిర్మాత వెంకట కృష్ణ మాట్లాడుతూ.. “ఇది నా తొలి సినిమా. ఈ సినిమాని చాలా భారీ బడ్జెట్ తో తీశాం. ప్రొడక్ట్ చాలా అద్భుతంగా వచ్చింది. మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటున్నాను. అతిథులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరూ కూడా ఈ సినిమాని ఆశీర్వదించి సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. ఈ వేడుకలో చిత్ర యూనిట్ అందరూ పాల్గొన్నారు.
తారాగణం: శ్రీ విష్ణు, మహిమా నంబియార్, రాధిక శరత్‌కుమార్, షైన్ టామ్ చాకో, ఉపేంద్ర లిమాయే
సాంకేతిక సిబ్బంది:
దర్శకత్వం: జానకిరామ్ మారెళ్ల
సమర్పణ: కోన వెంకట్
నిర్మాతలు: వెంకట కృష్ణ కర్నాటి & సీతా కర్నాటి
బ్యానర్: స్కంద వాహన మోషన్ పిక్చర్స్ LLP
సంగీతం: విజయ్ బుల్గానిన్
DOP: సాయి శ్రీరామ్
ఎడిటర్: ఛోటా కె ప్రసాద్
“కథలో బొక్క లేకపోతే, తెరపైన ఎన్ని బొక్కలున్నా చూస్తారు తెలుగు ప్రేక్షకులు”#ComradeKalyan teaser looks entertaining 1 quite contrary to what its title might suggest! The film also boasts a star cast packed with top-notch comedians. 👍