pizza

CULT shoot wrapped up
మాస్ కా దాస్ విశ్వక్సేన్ గ్లోబల్ స్లాషర్ ఫిలిమ్ #కల్ట్ షూటింగ్ పూర్తి- అక్టోబర్ 30న గ్రాండ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

03 October 2026
Hyderabad

విశ్వక్ సేన్ స్వీయ దర్శకత్వంలో, హీరోగా
భారతీయ చలన చిత్రాల్లో నే మొట్ట మొదటి స్లాశర్ గా రూపొందుతున్న కల్ట్ సినిమా భారీ బడ్జెట్ తో రూపొందుతోంది.

మధ్యే విడుదలైన CULT టీసర్ తో ఇటు పరిశ్రమ వర్గాల్లో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి,

KGF లాంటి పాన్ ఇండియా భారీ చిత్రాలకు మ్యూజిక్ అందించిన సేన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ రవి బసూర్ గారు అందించిన పాటలతో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మరో సంచలనం కాబోతుంది.

ఈ సినిమా షూటింగు పూర్తి చేసుకుంది. రామోజీ ఫిలిం సిటీ లో ఎంతో ప్రతిష్టాత్మకంగా వేసిన భారీ సెట్ లో వందలాది మోడల్స్ లతో 40 -50 రోజుల పాటు తెరకెక్కిన కీలక సన్నివేశాలు భారతీయ చలన చిత్రాలకు ధీటుగా రూపొందించబడ్డాయి.

ఇప్పుడున్న GenZ యూత్ లో ప్రత్యేక మైన కల్ట్ ఫాలోయింగ్ ఉన్న సన్సెషన్ తరుణ్ భాస్కర్ అందించిన మాటలు మరో హైలైట్.

తారక్ సినిమా బ్యానర్ పై సందీప్ కాకరాల ఖర్చుకు వెనకాడకుండా అత్యంత భారీగా టెక్నాలజీ తో నిర్మిస్తున్న ఈ కల్ట్ సినిమాలో సినీ దిగ్జలందరూ పాలు పంచుకుంటున్నారు,

ANIMAL లాంటి సినిమా లకు సౌండ్ డిజైన్ చేసిన సచిన్ అందిస్తున్న సౌండ్ డిజైన్ ఒక ప్రత్యేక స్థాయిలో నిలబెట్టింది,

భారతీయ భాషలతో పాటు, విదేశీ భాషలలో రూపొందుతున్న కల్ట్ సినిమాలో
విశ్వక్ సేన్, గాయత్రి భరద్వాజ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, పుష్ప ఫేమ్ తారక్ పొన్నప్ప, ప్రజ్ఞ, లాంటి ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

అక్టోబర్ 30 కి విడుదలకు సిద్ధం అవుతున్న ఈ కల్ట్ సినిమా ప్రేక్షకులకు నెవర్ బిఫోర్ ఎక్స్పీరియన్స్ అందించబోతోంది.

నటీనటులు: విశ్వక్ సేన్, గాయత్రి భరద్వాజ్, మురళీ శర్మ, శ్రీకాంత్ అయ్యంగార్, పుష్ప ఫేమ్ తారక్ పొన్నప్ప, ప్రజ్ఞ


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved