బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ పాన్-ఇండియా యాక్షన్-రొమాంటిక్ థ్రిల్లర్ 'డెకాయిట్'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంతో షానియల్ డియో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. శేష్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో ఈ చిత్రాన్ని సుప్రియ యార్లగడ్డ నిర్మించగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా టీజర్, ట్రైలర్ ,పాటలు సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డెకాయిట్ ఏప్రిల్ 10న థియేటర్లలోకి రానుంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. విక్టరీ వెంకటేష్ ముఖ్య అతిధిగా హాజరైన ఈ వేడుక చాలా గ్రాండ్ గా జరిగింది.
ప్రీ రిలీజ్ ఈవెంట్ లో విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డెకాయిట్ ఈవెంట్ కు అందరూ నేను సుప్రియ కోసం వచ్చాను అనుకుంటున్నారు. కానీ నేను సురేంద్ర మావయ్య కోసం వచ్చాను. నా ఫేవరెట్ మావయ్య. ఎస్ ఎస్ క్రియేషన్స్ లో సుప్రియ ఇంత అద్భుతమైన సినిమా తీయడం చాలా ఆనందంగా ఉంది. కొన్ని సినిమాలు మొదలైనప్పుడే చాలా మంచి ఫీలింగ్ ఉంటుంది. సుప్రియ చాలా మంచి సినిమా తీస్తుందనే వైబ్ ఉండేది. ఎందుకంటే చాలా పాషన్ ఉన్న టీం తో చేశారు. అందరూ మంచి సినిమా తీయాలి, ప్రేక్షకుల ముందుకు రావాలి,పెద్ద హిట్ ఇవ్వాలి అనే ఉద్దేశంతో చేశారు. శేష్ ని పంజాలో చూశాను. అప్పుడే తను చాలా అద్భుతమైన నటుడు అవుతాడు అనిపించింది. తర్వాత ఆయన చేసిన సినిమాలన్నీ హిట్స్ అయ్యాయి. మరిన్ని బ్లాక్ బస్టర్ రావాలని కోరుకుంటున్నాను. డెకాయిట్ కూడా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. అందులో డౌట్ లేదు. ఇది మృణాల్ బెస్ట్ సినిమా అవుతుందని నమ్ముతున్నాను. ఈ సినిమాలో పని చేసిన అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. ట్రైలర్ చూడగానే ఇది కచ్చితంగా విజయవంతమైన సినిమా అవుతుందని అనిపించింది. ఒక లవ్ స్టోరీ లో ఇలాంటి యాక్షన్ ఉండటం చాలా కొత్తగా ఉంది. ఇంత కొత్త సబ్జెక్టుని సెలెక్ట్ చేసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. కచ్చితంగా ప్రేక్షకులు దీన్ని ఆదరిస్తారని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను. సుప్రియ ఇంత అద్భుతమైన సినిమాతో వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఎస్ ఎస్ క్రియేషన్స్ మరిన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలు తీయాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
హీరో అడివి శేష్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం డెకాయిట్ సినిమా ఎట్మాస్లో చూశాక చాలా నచ్చింది, ప్రాణం పెట్టి చేశాను. చాలా గ్రేట్ ఫుల్ గా అనిపించింది. మనం కోరుకున్న ఒక డ్రీమ్ ని నెరవేర్చాలని ఇంతమంది అహర్నిశలు కష్టపడ్డారు. మా డైరెక్టర్ శానిల్ ఇప్పటికీ ఆరు రాత్రులు పడుకోకుండా వర్క్ చేస్తూనే ఉన్నాడు. ఇంకో గంటలో ఓవర్సీస్ పంపించాలి. ఇద్దరం కలిసి కన్న ఒక డ్రీమ్ ని సెలబ్రేట్ చేసుకోవడానికి తను ఇక్కడ లేకుండా వర్క్ లో ఉన్నాడు. ఈ సినిమా సుప్రియ గారి సపోర్ట్ మీద నిలబడింది. ఐదు సినిమాలు చేస్తే చాలు అనుకునే నేను ఈరోజు ఇలా మీ ముందు ఉండడం.. ప్రేక్షకుల అభిమానం. వెంకటేష్ గారికి సిద్ధూ కి అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. పవన్ సింగ్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఈ సినిమా కోసం అందరూ ప్రేమతో పని చేశారు. నా నుంచి సక్సెస్ లు చూశారు అంతకుముందు ఫెయిల్యూర్ లు కూడా చూశారు. కానీ ఈ సినిమాలో మేము సినిమాని ఎంత ప్రేమించామో చూస్తారు. ఈ రెండేళ్ల జర్నీలో మాతో పాటు నడిచిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మృణాల్ క్యారెక్టర్ ఇంటర్వ్యూలో పిచ్చెక్కిస్తుంది. ఇంటర్వెల్ లో తనే హైలెట్. ఇంటర్వెల్ అలా రావడానికి కారణం సుజిత్. మేము ఒరిజినల్ గా ఒక ప్రేమ కథ అనుకున్నాం. కానీ ఈ రెండేళ్ల జర్నీలో అందరూ కూడా ఎంతో ప్రేమని అందించారు. ఏప్రిల్ 10 మీరందరూ కూడా ఒక హానెస్ట్ సినిమాను చూస్తారు. మా పాషన్ ని చూస్తారు. అందరికీ థాంక్యూ సో మచ్.
హీరో సిద్దు జొన్నలగడ్డ మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. సుప్రియ గారికి సుమంత్ అన్నకి థాంక్యూ సో మచ్. శానిల్ కృష్ణ అండ్ లీల షూట్ చేశాడు. తను మంచి డివోపి. ఈ సినిమాతో డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. తనకు ఆల్ ది వెరీ బెస్ట్. అనురాగ్ గారు మా అందరికీ ఎంతో ఇన్స్పిరేషన్. ఆయనకి స్పెషల్ థాంక్యూ. మృణాల్ గారి పర్ఫార్మెన్స్ లో చాలా నిజాయితీ ఉంటుంది. ఈ సినిమాలో తన పెర్ఫార్మెన్స్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. శేష్ ను ఒకే సారి జర్నీ స్టార్ట్ చేశాం. తన సినిమా అంటే మన గ్రూపులో ఒకరి సినిమా లానే అనిపిస్తుంది. తనకి నా సైడ్ నుంచి ఏ హెల్ప్ కావాలన్నా చేస్తాను. ఈ సినిమాతో స్టాండర్డ్ ని పెంచాడు. ఈ సినిమా అందరికి కూడా చాలా మంచి విజయాన్ని అందిస్తుందని కోరుకుంటున్నాను.
హీరోయిన్ మృణాల్ ఠాగూర్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. వెంకటేష్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా నేను చేయడానికి మొదటి కారణం డైరెక్టర్ శౌర్య గారు. ఆయనే మొదట ఈ సినిమా గురించి నాకు చెప్పారు. కథ విన్నాక చాలా నచ్చింది. సరస్వతి క్యారెక్టర్ నా కెరీర్ లో గుర్తుండిపోతుంది. శేష్ గారితో వర్క్ చేయడం వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్. సుప్రియ గారికి థాంక్యూ డైరెక్టర్ శానిల్ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేశారు. సరస్వతి క్యారెక్టర్ ని అద్భుతంగా చూపించారు. సుప్రియ గారు చాలా కేరింగ్ ప్రొడ్యూసర్ అందరినీ ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారు. వెంకటేష్ గారి ఎదురుగా నిలబడి మాట్లాడటం ఒక గౌరవంగా భావిస్తున్నాను. ఈ వేడుకకు విచ్చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. మా టీంలో పని చేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
హీరో సుమంత్ మాట్లాడుతూ.. సుప్రియ మనసు వెన్న. తను చాలా కష్టపడే తత్వం ఉన్న మనిషి. తన విషయంలో నాకు ఎప్పుడూ గర్వంగా ఉంటుంది. ఈ సినిమా కోసం ప్రతి ఒక్కరు ఎంత కష్టపడ్డారో నాకు తెలుసు. సుప్రియ చాలా ఫ్యాషన్ తో చేసిన సినిమా ఇది. ఈ సినిమా కోసం తన బెస్ట్ ఇచ్చింది. ఇండస్ట్రీ నుంచి వేడుకకి విచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు. సీతారామంలానే మృణాల్ కి ఇది మరో గుర్తుండిపోయే సినిమా అవుతుంది. శేష్ నాకు 15 ఏళ్ళుగా తెలుసు. నా బెస్ట్ ఫ్రెండ్. నేను తన ఫ్యాన్ ని. ఈ మాట జెన్యూన్ గా చెప్తున్నాను. తన సినిమా వస్తుందంటే అందరిలో ఒక నమ్మకం. ఆ సక్సెస్ ని ఈ సినిమా ద్వారా కంటిన్యూ చేస్తున్నాం. హార్డ్ వర్క్ చేసి ఎంత మంచి సినిమా ఇచ్చినా టీమ్ అందరికీ థాంక్యు. వెంకీ మామ కి స్పెషల్ థాంక్స్.
ప్రొడ్యూసర్ సుప్రియ యార్లగడ్డ మాట్లాడుతూ..అందరికి నమస్కారం. నాన్నగారి యస్ యస్ క్రియేషన్స్ అనే బ్యానర్ మరో మంచి సినిమా తీయాలని మనసులో ఉండేది. అందువల్లే డెకాయిట్ స్టార్ట్ చేశాను. ఈ లోగోలో మా తాత గారి పంచె, మా అమ్మమ్మ కుంకుమ, మా పరిగెత్తే పాప, ముందుకు నడిపించే తాత .. మా నాన్నగారు గాయం సినిమాకి చేయించిన మ్యూజిక్.. ఇవన్నీ కలగలిపి ఈ లోగోని డిజైన్ చేయడం జరిగింది. సినిమాకి ఎలా అయితే రెండు సంవత్సరాలు పట్టిందో ఈ లోగో కూడా నిన్న రాత్రి ఫైనల్ చేసాం. మా అన్నయ్య సుమంత్ ఈ సినిమాకి సైలెంట్ ప్రొడ్యూసర్.
మ్యూజిక్ డైరెక్టర్ భీమ్స్ మాట్లాడుతూ.. వెంకటేష్ మనందరి ఫేవరెట్ హీరో. వసంక్రాంతికి వస్తున్నాం చేసిన తర్వాత చిరంజీవి గారితో పని చేసే అవకాశం వచ్చింది. నా కెరియర్ లో గొప్ప మలుపులన్నీ అన్నపూర్ణ స్టూడియోస్ నుంచే మొదలయ్యాయి.శేష్ గారు ఈ సినిమాకి నేను ఉండాలని కోరుకున్నారు. జర్నీ మొదలైన తర్వాత చేసిన మొదటి పాట రుబ రూ.పాటలన్నీ అద్భుతంగా వచ్చాయి. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
ప్రొడ్యూసర్ రవిశంకర్ మాట్లాడుతూ.. శేష్ గారు సినిమా విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. అలాంటి క్వాలిటీ సినిమాని తీసుకొస్తున్నారు. ఇంత క్వాలిటీ సినిమా చేయాలంటే అన్ని రోజులు పడుతుంది. సుప్రియ గారు ఈ విషయాన్ని ప్రాక్టికల్ గా అర్థం చేసుకున్నందుకు చాలా థాంక్స్. (నవ్వుతూ) ఈ సినిమా చాలా మంచి సక్సెస్ అవుతుందని అందరం బలంగా నమ్ముతున్నాం. టీం గురించే కాకుండా ఇండస్ట్రీ కోసం కూడా ఆడాలి. అది జరుగుతుందని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ.. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. సుప్రియ గారు చాలా బ్యాలెన్స్ గా ఉండే పర్సన్, శేషు, మృణాల్ బ్యుతీఫుల్ గా కనిపిస్తున్నారు. తప్పకుండా ఈ సినిమా చాలా మంచి విజయం సాధించాలని కోరుకుంటున్నాను.
ప్రొడ్యూసర్ నాగ వంశీ మాట్లాడుతూ.. సుప్రియ గారు ఎప్పుడు కూడా సినిమాల్ని చాలా ఎక్కువ కాలం తీస్తున్నారని మమ్మల్ని క్లాస్ పీకుతుంటారు. డెకాయిట్ సినిమా దాదాపు రెండేళ్లు తీశారు. ఇప్పుడు మమ్మల్ని ఎవరినీ తిట్టే రైట్ తనకి లేదు. (నవ్వుతూ) సుప్రియ గారికి ప్రొడ్యూసర్ కష్టాలు శేష్ గారు చూపించినందుకు చాలా థాంక్స్. మా అందరికీ క్లాసులు పీకి ఫైనల్ గా అద్భుతమైన సినిమా తీసినందుకు సుప్రియ గారికి ఆల్ ది వెరీ బెస్ట్. తనకు మంచి హిట్ రావాలని కోరుకుంటున్నాను. త్వరలో బయట హీరోలతో సినిమాలు తీసి మాలాగే కష్టపడాలని కోరుకుంటున్నాను(నవ్వుతూ)
ప్రొడ్యూసర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. అందరికి నమస్కారం. అందరు కూడా సుప్రియ గురించి చాలా గొప్పగా మాట్లాడుతున్నారు. ఇది నాకు చాలా ఆనందాన్నిస్తోంది. తను అద్భుతమైన సినిమా తీసింది.శేష్, మృణాల్ చాల్ అద్భుతంగా కనిపిస్తున్నారు. ఆల్ ది వెరీ బెస్ట్
ప్రొడ్యూసర్ స్వప్న దత్ మాట్లాడుతూ.. ఇంతమంది ప్రొడ్యూసర్స్ మరో ప్రొడ్యూసర్ సినిమా ఈవెంట్ కి వెళ్ళడం చాలా అరుదు. మేమందరం కేవలం సుప్రియ గారి కోసం వచ్చాం. సుప్రియ కి ఆల్ ది వెరీ బెస్ట్.
డైరెక్టర్ రాహుల్ రవీంద్ర మాట్లాడుతూ.. ఈ సినిమా చూసి మాట్లాడుతున్నాను. సినిమా అదిరిపోయింది. ఎమోషన్ చాలా అద్భుతంగా వర్కౌట్ అయింది. శేషు మృణాల్ పెర్ఫార్మెన్స్ అదిరిపోయింది. సినిమా చూసేసాను. పక్క హిట్ అని నాకు తెలుసు. అందుకే కంగ్రాచ్యులేషన్స్.
డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని మాట్లాడుతూ.. శేష్ గారు ఏం చేసినా కొత్తగా ఉంటుంది. ఈసారి కూడా చాలా కొత్తగా కనిపిస్తున్నారు. డైరెక్టర్ శానిల్ తో నాకు చాలా మంచి జర్నీ ఉంది. సుప్రియ గారికి ఈ సినిమా చాలా మంచి విజయాన్ని ఇస్తుందని కోరుకుంటున్నాను
డైరెక్టర్ శౌర్యువ్ మాట్లాడుతూ.. ముందుగా సుప్రియ గారికి థాంక్యూ సో మచ్. సుప్రియ గారికి సినిమాల పట్ల పాషన్ అద్భుతం. శేష్ గారి వర్క్ ని నేను చాలా క్లోజ్ గా ఫాలో అవుతాను. స్క్రీన్ ప్లే లో ఆయన దిట్ట. హాయ్ నాన్న సినిమాకి ఆయన ఇచ్చిన కాంప్లిమెంటు నాకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మృణాల్ మా యష్ణ. తను మరిన్ని అద్భుతమైన తెలుగు సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. ఈ సినిమాలో సరస్వతి క్యారెక్టర్ లో కొత్తగా కనిపిస్తోంది. తప్పకుండా ఈ సినిమా తన కెరీర్ లో మరో పెద్ద హిట్ అవుతుంది. ట్రైలర్ అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది నమ్ముతున్నాను.
డైరెక్టర్ శశికిరణ్ తిక్క మాట్లాడుతూ.. ఇది ఇంట్లో ఫంక్షన్ లాగా అనిపిస్తుంది. నేను శేషు కలిసి చేసిన సినిమాలనే ఉంది. ఈ సినిమా టీజర్ ట్రైలర్ అని చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాయి. శేష్ గత సినిమాల కంటే అద్భుతంగా ఉంటుందని కోరుకుంటున్నాను. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.
డైరెక్టర్ సాయి మార్తాండ్ మాట్లాడుతూ.. శేష్ అన్న నాకు ఇన్స్పిరేషన్. ఆయన మరిన్ని ప్రేమ కథలు చేయాలని కోరుకుంటున్నాను. ఇది కచ్చితంగా హిట్ అవుతుంది. సుప్రియ గారికి కంగ్రాజులేషన్స్, అండ్ ఆల్ ద వెరీ బెస్ట్. గూడచారి2 తర్వాత నేను శేష్ గారు కొలాబరేట్ అవుతున్నాం.
నాగ సుశీల మాట్లాడుతూ.. . అందరికీ నమస్కారం. ఏప్రిల్ 10 నా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. సినిమా ట్రైలర్ టీజర్ పాటలు నాకు ఎంతగానో నచ్చాయి. ఈ సినిమా అద్భుతంగా ఆడుతుందని, శేష్ మిగతా సినిమాలు కంటే ఈ సినిమా బాగా ఆడాలని కోరుకుంటున్నాను. మృణాల్ సినిమాలన్నీ నేను చూశాను. తన సినిమాలన్నీ నాకు ఇష్టం. సుప్రియ ఈ సినిమా కోసం చాలా హార్డ్ వర్క్ చేసింది. ఈ సినిమా తనకి తప్పకుండా చాలా పెద్ద విజయాన్ని ఇస్తుందని నమ్ముతున్నాను. టీమ్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్.
రైటర్ అబ్బూరి రవి మాట్లాడుతూ.. ముందుగా సుప్రియ గారికి కృతజ్ఞతలు. ఈ సినిమాని ఎంతో చక్కగా తీర్చిదిద్దీలే ప్రతిక్షణం పనిచేశారు. డైరెక్టర్ శానిల్ సైలెంట్ కిల్లర్. అద్భుతమైన టెక్నీషియన్. మృణాల్ గారు సరస్వతి క్యారెక్టర్ ని అద్భుతంగా పెర్ఫాం చేశారు. శేష్ నన్ను గురువు అంటాడు. అది వాళ్ళ అమ్మానాన్న నేర్పిన సంస్కారం. కథకి టైం ఇస్తే జనం మన సినిమాకి టైం ఇస్తారు అని మేము మాట్లాడుకుంటాం. దానికోసం ఎంతైనా కష్టపడతాం. నిజంగా సినిమా బాగుకోసం ఎంత దూరమైనా వెళ్లే మనిషి తను. సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు.
డిఓపి ధనుష్ భాస్కర్ మాట్లాడుతూ.. ఈ సినిమా కోసం దాదాపు మూడేళ్లు పని చేసాం. సుప్రియ గారికి శేషు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మా డైరెక్టర్ సినిమా కోసం ఈ క్షణం వరకు ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు. అంతా పాషన్ తో ఈ సినిమాని తీర్చిదిద్దాము. చాలా నిజాయితీ ఉన్న సినిమా.ఈ సినిమా ఆడియన్స్ కి అందరికీ రీచ్ అవుతుందని బలంగా నమ్ముతున్నాను.