pizza

Zayn Marie Khan’s Fierce First Look From Adivi Sesh’s Dacoit Unveiled, Aamir Khan Responds
అడివి శేష్ 'డెకాయిట్‌' నుంచి జైన్ మేరీ ఖాన్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్- అభినందనలు తెలియజేసిన ఆమిర్ ఖాన్

You are at idlebrain.com > news today >

21 March 2026
Hyderabad

Adivi Sesh, known for his consistency and box-office pull across the country, is getting ready to break his own mould with Dacoit. For the first time, the star steps into a gritty, unapologetically mass avatar, showcasing a rugged side never seen before. The promos already reveal an intriguing touch- Sesh flawlessly delivering dialogues in the distinct Madanapalle dialect. Joining him on this intense journey is Mrunal Thakur as the leading lady, while the film also marks the directorial debut of Shaniel Deo, who promises a refreshingly raw and stylish narrative. Bollywood actor Anurag Kashyap plays a prominent role in the movie that also features Bollywood star Aamir Khan’s niece Zayn Marie Khan making her debut in Telugu cinema.

Zayn Marie Khan’s first look as a fierce police officer has been unveiled on her birthday. Draped in a khaki uniform with red accents, shoulder epaulets bearing stars, and a holstered belt, gripping a pistol aimed forward with blood smeared on her face and a determined, intense expression. She's surrounded by fellow uniformed officers in the background. This poster shows the intense nature of Zayn.

The poster caught the attention of her uncle Aamir Khan who promptly shared his appreciation and extended warm wishes to the entire team. His message, though simple, has sparked fresh discussions online and given the film added traction, especially in the Hindi belt.

The promotional activities are already full swing for the movie, with stupendous response to the posters, to the glimpse, to the teaser, to the first single Rubaroo, all setting the bar high for the movie being crafted as a genuine bilingual, filmed simultaneously in Telugu and Hindi.

Backed by producer Supriya Yarlagadda, with Suniel Narang onboard as co-producer under the prestigious banner of Annapurna Studios, Dacoit brings together a strong technical team. Cinematographer Danush Bhaskar frames the film’s rugged visual tone, while Bheems Ceciroleo provides the soundtrack and Gyaani sets the emotional undercurrent with an evocative background score.

Set for release on April 10th, Dacoit promises more than just high-adrenaline action. The film dives deep into themes of love, separation, and the raw intensity that heartbreak can ignite- shaping a story that blends emotion with edge.

అడివి శేష్ 'డెకాయిట్‌' నుంచి జైన్ మేరీ ఖాన్ ఇంటెన్స్ ఫస్ట్ లుక్ రిలీజ్- అభినందనలు తెలియజేసిన ఆమిర్ ఖాన్

బ్యాక్ టు బ్యాక్ పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్లతో అలరిస్తున్న అడివి శేష్ ఇప్పుడు కొత్త అవతార్ లో డెకాయిట్‌'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ చిత్రంలో శేష్ తొలిసారిగా మాస్, రగ్గడ్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్‌గా మృణాల్ ఠాకూర్ నటిస్తున్నారు. అనురాగ్ కశ్యప్ కీలక పాత్ర పోషిస్తున్నారు. షానియల్ డియో ఈ సినిమాతో దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నారు. బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కజిన్ బ్రదర్ కుమార్తె జైన్ మేరీ ఖాన్ తెలుగు చిత్రసీమలో అరంగేట్రం చేస్తోంది.

జైన్ మారీ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆమె ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. ఖాకీ యూనిఫామ్‌లో భుజాలపై స్టార్ ఎపాలెట్స్, హోల్స్టర్ బెల్ట్‌తో తుపాకీ పట్టుకుని ముందుకు గురిపెట్టిన ఆమె లుక్ పవర్‌ఫుల్‌గా కనిపిస్తోంది. ఈ పోస్టర్‌లో జైన్ పాత్ర యొక్క ఇంటెన్సిటీ స్పష్టంగా కనిపిస్తోంది. వెనుక వైపు ఇతర పోలీస్ అధికారులు ఉండటం ఈ సన్నివేశానికి మరింత బలం చేకూర్చింది.

ఈ పోస్టర్‌ను చూసిన ఆమిర్ ఖాన్ వెంటనే స్పందించి అభినందనలు తెలుపుతూ మొత్తం టీమ్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన మెసేజ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. హిందీ ప్రేక్షకుల్లో సినిమాకు మరింత హైప్‌ను తెచ్చింది.

ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్‌లో కొనసాగుతున్నాయి. పోస్టర్లు, గ్లింప్స్, టీజర్, అలాగే మొదటి సాంగ్ ‘రుబారు’.. అన్నీ ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన పొందుతూ సినిమాపై భారీ అంచనాలు నెలకొల్పాయి. ఈ మూవీని ట్రూ బైలింగ్వల్ ప్రాజెక్ట్‌గా
తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి రూపొందిస్తున్నారు.

సుప్రియా యార్లగడ్డ నిర్మాణంలో, సునీల్ నారంగ్ సహనిర్మాతగా అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై రూపొందుతున్న ‘డెకాయిట్‌'’కి స్ట్రాంగ్ టెక్నికల్ టీమ్ పని చేస్తోంది. సినిమాటోగ్రాఫర్ దనుష్ భాస్కర్ రగ్డ్ విజువల్స్‌ను అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో బ్లాక్ బస్టర్ ఆల్బమ్ అందిస్తున్నారు. గ్యాని అందించే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాకు ఎమోషన్ మరింతగా పెంచనుంది.

ఏప్రిల్ 10న విడుదలకు సిద్ధమవుతున్న ‘డెకాయిట్‌'’ లవ్, హార్ట్‌బ్రేక్, అద్భుతమైన యాక్షన్ తో ఆడియన్స్ కి సీట్ ఎడ్జ్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వనుంది.




Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved