Dada Dhamaka: Balakrishna & Nargis Fakhri Set The Dance Floor Ablaze In Thaman’s Electrifying First Single
దాదా ధమాకా: తమన్ అందించిన ఎనర్జిటిక్ ఫస్ట్ సింగిల్‌లో డ్యాన్స్ ఫ్లోర్‌పై అదరగొట్టిన నర్గీస్ ఫక్రీ, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ
God Of Masses Nandamuri Balakrishna’s much-awaited action entertainer Dada, directed by blockbuster filmmaker Gopichand Malineni and produced by Venkata Satish Kilaru under the Vriddhi Cinemas banner, is nearing completion with its shoot. The combination of Balakrishna and Gopichand Malineni, following their successful outing with Veera Simha Reddy, has generated considerable anticipation, whereas the first glimpse and posters have raised the bar. Meanwhile, Balakrishna turns up the musical heat with Dada Dhamaka. The makers have unveiled the film’s first song, offering a high-energy musical treat featuring Balakrishna and Bollywood beauty Nargis Fakhri in a vibrant pub backdrop.
Composer S Thaman, who shares a successful musical association with both Balakrishna and director Gopichand Malineni, delivers an energetic dance number packed with infectious beats and catchy rhythms. The composition perfectly captures the celebratory mood, with Nargis Fakhri adding glamour and Balakrishna bringing his trademark energy to the dance floor.
Penned by Ramajogayya Sastry, the lyrics add a playful touch to the song, with Nargis expressing her displeasure over Balakrishna remaining silent and encouraging him to join the celebrations through singing and dancing. Rajini Sri Poornima lends her captivating vocals, while Balakrishna makes the song even more special by singing a portion himself.
The visual presentation is equally impressive, with Sekhar VJ Master choreographing the number in an entertaining and stylish manner. Balakrishna appears in a flamboyant party avatar, sporting sunglasses and a cigar, while Nargis Fakhri dazzles with her glamorous screen presence. Their energetic dance moves and lively chemistry emerge as the major attractions.
Balakrishna's vocals, stylish moves and effortless screen presence give the song an additional mass appeal. Nargis, meanwhile, brings the glamour and grace needed to make this special number a visual treat. Dada Dhamaka lives up to its title with its infectious energy and promises to become a favourite among mass audiences.
Manoj Manchu and Kajal Aggarwal play prominent roles in the film. Arvind S Kashyap handles cinematography, AS Prakash oversees production design, and Navin Nooli takes care of editing. Sai Madhav Burra has penned the dialogues, while Ram Lakshman, Ravi Varma and Vvenkat choreograph the action sequences.
Carrying tremendous expectations, Dada is scheduled for a grand theatrical release on December 24. With Dada Dhamaka, the makers have kick-started the film's musical promotions on a high-energy note.
Technical Crew:
Writer, Director: Gopichand Malineni
Producer: Venkata Satish Kilaru
Banner: Vriddhi Cinemas
Music: S Thaman
DOP: Arvind S Kashyap ISC
Editor: Navin Nooli
Production Designer: AS Prakash
Dialogues: Sai Madhav Burra
Fights: Ram Lakshman, Ravi Varma and Venkat
దాదా ధమాకా: తమన్ అందించిన ఎనర్జిటిక్ ఫస్ట్ సింగిల్‌లో డ్యాన్స్ ఫ్లోర్‌పై అదరగొట్టిన నర్గీస్ ఫక్రీ, గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘దాదా’ షూటింగ్ దాదాపు పూర్తయింది. బ్లాక్‌బస్టర్ చిత్రాల దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ఈ సినిమాను వృద్ధి సినిమాస్ బ్యానర్‌పై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. గతంలో ‘వీరసింహారెడ్డి’తో మంచి విజయాన్ని అందుకున్న బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో ‘దాదా’పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, పోస్టర్లు ఆ అంచనాలను మరింత పెంచాయి.
ఇప్పుడు బాలకృష్ణ ‘దాదా ధమాకా’తో మ్యూజికల్ హీట్ పెంచారు. ఈ సినిమా నుంచి ఫస్ట్ సాంగ్‌ను మేకర్స్ విడుదల చేశారు. పబ్ బ్యాక్‌డ్రాప్‌లో బాలకృష్ణ, బాలీవుడ్ బ్యూటీ నర్గీస్ ఫక్రీ కలిసి కనిపించిన ఈ పాట ఫుల్ ఎనర్జీతో సాగుతూ ఆకట్టుకుంటోంది.
బాలకృష్ణ, దర్శకుడు గోపీచంద్ మలినేనితో మంచి మ్యూజికల్ జర్నీని కొనసాగిస్తున్న తమన్ ఈ పాటకు అదిరిపోయే మ్యూజిక్ అందించారు. ఇన్ఫెక్షియస్ బీట్స్, క్యాచీ రిథమ్స్‌తో పాటను ఫుల్ ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్‌గా రూపొందించారు. పాటలోని పార్టీ మూడ్‌కు తమన్ సంగీతం అద్భుతంగా కుదిరింది. నర్గీస్ ఫక్రీ గ్లామర్, బాలకృష్ణ తనదైన ఎనర్జీతో డ్యాన్స్ ఫ్లోర్‌పై సందడి చేశారు.
రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ పాటకు సరదా టచ్‌ను తీసుకొచ్చాయి. బాలకృష్ణ మౌనంగా ఉండటంపై నర్గీస్ తన అసంతృప్తిని వ్యక్తం చేస్తూ, పాట పాడుతూ డ్యాన్స్‌లో పాల్గొనాలని ఆయన్ని ప్రోత్సహించేలా సాహిత్యం సాగుతుంది. రజిని శ్రీ పూర్ణిమ తన వాయిస్‌తో పాటను మరింత ఆకట్టుకునేలా చేశారు. బాలకృష్ణ కూడా ఈ పాటలో కొంత భాగాన్ని స్వయంగా పాడటం మరో ప్రత్యేకత.
పాట విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. శేఖర్ వీజే మాస్టర్ ఈ పాటకు స్టైలిష్‌గా, ఎంటర్టైనింగ్గా కొరియోగ్రఫీ అందించారు. సన్‌గ్లాసెస్, సిగార్‌తో బాలకృష్ణ ఫుల్ పార్టీ అవతార్‌లో కనిపించగా, నర్గీస్ ఫక్రీ తన గ్లామరస్ స్క్రీన్ ప్రెజెన్స్‌తో ఆకట్టుకున్నారు. వీరిద్దరి ఎనర్జిటిక్ డ్యాన్స్ మూవ్స్, కెమిస్ట్రీ పాటకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
బాలకృష్ణ వాయిస్, స్టైలిష్ మూవ్స్, ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ ఈ పాటకు మరింత మాస్ అప్పీల్ తీసుకొచ్చాయి. మరోవైపు నర్గీస్ తన గ్లామర్, గ్రేస్‌తో పాటను విజువల్ ట్రీట్‌గా మార్చారు. టైటిల్‌కు తగ్గట్టుగానే ‘దాదా ధమాకా’ ఫుల్ ఎనర్జీతో సాగుతూ మాస్ ఆడియన్స్‌కు ఫేవరెట్ సాంగ్‌గా నిలిచేలా ఉంది.
ఈ సినిమాలో మంచు మనోజ్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అరవింద్ ఎస్ కశ్యప్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, ఏఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. నవీన్ నూలి ఎడిటర్. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ రాశారు. రామ్-లక్ష్మణ్, రవి వర్మ, వీవెంకట్ యాక్షన్ సీక్వెన్స్‌లను రూపొందిస్తున్నారు.
భారీ అంచనాల మధ్య ‘దాదా’ డిసెంబర్ 24న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది. ‘దాదా ధమాకా’ పాటతో మేకర్స్ సినిమా మ్యూజికల్ ప్రమోషన్స్‌ను ఫుల్ ఎనర్జీతో ప్రారంభించారు.
నటీనటులు: నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్, కాజల్ అగర్వాల్, నర్గీస్ ఫక్రీ