pizza

The lyrical song ‘Tella Pori’ from Harshith Reddy’s upcoming film Deewana has been released; Presented by Geetha Film Distributors, the movie is set for a grand worldwide theatrical release on June 19
హర్షిత్ రెడ్డి "దీవాన" మూవీ నుంచి 'తెల్లపోరి...' లిరికల్ సాంగ్ రిలీజ్, గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా

You are at idlebrain.com > news today >

26 May 2026
Hyderabad

Having delivered a successful film with Subham, young and talented actor Harshith Reddy now stars in Deewana, which is gearing up for its global release in theatres on June 19 through Geetha Film Distributors. The film promises to showcase the madness of a one-sided love story in an engaging and entertaining way. Deewana has already been making waves musically, with its first released song “Idhi Prema.. Idhi Prema..” becoming a chartbuster. Now, the makers have unveiled an energetic teasing track titled “Tella Pori”.

The song “Tella Pori” is composed and sung by music director Eshwar Chand himself, who has also written the lyrics. The track carries the bold tagline “The Cringe Song of the Year,” which perfectly reflects its playful and quirky tone. The lyrics are filled with fun and teasing expressions making it an amusing and catchy number with a humorous composition.

This one-sided love story has already been gaining attention through its promotional content, including songs and teaser. The teaser and songs of Deewana have received a superb response, building a strong buzz among the youth audience. The film is generating good craze and anticipation.

Deewana is being produced under the banners of Arha Media and We Studios by Vasudev Koppineni and Sridevi Karyampudi. The film introduces a beautiful love story featuring actress Smeha Manimegalai and marks the debut of director Srikanth Sangishetti.

Cast: Harshith Reddy, Smeha Manimegalai

Technical Team:
Costumes – Manasa
Production Designer – Jhansi Gojala
Editor – Hrishikesh Paspal
DOP – Vamsi Pachipulusu
Music – Eshwar Chand
Digital Marketing – Housefull Digital
Producers – Vasudev Koppineni, Sridevi Karyampudi
Script & Direction – Srikanth Sangishetti

హర్షిత్ రెడ్డి "దీవాన" మూవీ నుంచి 'తెల్లపోరి...' లిరికల్ సాంగ్ రిలీజ్, గీతా ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19న వరల్డ్ వైడ్ గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న సినిమా

శుభం సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న యంగ్ టాలెంటెడ్ యాక్టర్ హర్షిత్ రెడ్డి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "దీవాన" గీతా ఫిల్మ్ డిస్ట్రిబ్యూటర్స్ ద్వారా జూన్ 19 న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా వన్ సైడ్ లవ్ స్టోరీ లో ఉన్న మ్యాడ్ నెస్ ప్రేక్షకులకు ఆకట్టుకునేలా చూపించబోతోంది. "దీవాన" సినిమా ఇప్పటికే మ్యూజికల్ గా సక్సెస్ అవుతోంది. ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన 'ఇది ప్రేమా .. ఇది ప్రేమా..' ఛాట్ బస్టర్ కాగా..ఇప్పుడు ఎనర్జిటిక్ టీజింగ్ సాంగ్ 'తెల్లపోరి...' ని మేకర్స్ రిలీజ్ చేశారు.

'తెల్లపోరి...' పాటను సంగీత దర్శకుడు ఈశ్వర్ చంద్ స్వరపర్చి, సాహిత్యాన్ని అందించి పాడటం విశేషం. ఈ పాటకు ది క్రింజ్ సాంగ్ ఆఫ్ ది ఇయర్ అనే క్యాప్షన్ మంచి జస్టిఫికేషన్ ఇస్తోంది. ఈ పాట ఎలా ఉందో చూస్తే - 'తెల్లపోరి, నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది..తెల్లపోరి, నా తెల్లపోరి బల్లి కంటే తెల్లగుంటది., మెత్తమెత్త బుగ్గలు, పందిపిల్ల పెదవులు, గింతకంటే క్యూటు పిల్ల యాడ ఉంటది, బ్రష్ చేస్తున్నా, ఫ్లష్ చేస్తున్నా, గా పిల్ల మొఖమే తిరుగుతుంటది, నా బండి మీద స్టిక్కర్ ఆమె పేరు మీదే, పాస్ వర్డ్ నెంబర్ అంటే ఆమె బర్త్ డే..' అంటూ సరదా సాహిత్యంతో, టీజింగ్ కంపోజిషన్ తో ఆకట్టుకునేలా సాగుతుందీ పాట.

ఈ వన్ సైడ్ లవ్ స్టోరీ ఇప్పటికే సాంగ్, టీజర్ వంటి ప్రమోషనల్ కంటెంట్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. "దీవాన" సినిమా టీజర్, సాంగ్స్ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. యూత్ ఆడియెన్స్ లో "దీవాన" సినిమా పట్ల మంచి క్రేజ్ ఏర్పడుతోంది. ఈ చిత్రాన్ని అర్హ మీడియా, వీ స్టూడియోస్ బ్యానర్ పై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి నిర్మిస్తున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో హీరోయిన్ స్మేహ మణిమేగలై మరియు దర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి పరిచయం కానున్నారు.

నటీనటులు - హర్షిత్ రెడ్డి, స్మేహ మణిమేగలై

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్స్ - మానస
ప్రొడక్షన్ డిజైనర్ - ఝాన్సీ గోజల
ఎడిటర్ - హృషికేశ్ పాస్పల్
డీవోపీ - వంశీ పచ్చిపులుసు
మ్యూజిక్ - ఈశ్వర్ చంద్
డిజిటల్ మార్కెటింగ్ - హౌస్ ఫుల్
ప్రొడ్యూసర్స్ - వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి
స్క్రిప్ట్, డైరెక్షన్ - శ్రీకాంత్ సంగిశెట్టి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved