Devara, starring man of masses NTR, is directed by the masterful Koratala Siva. This movie promises to be a global spectacle. Devara is a highly anticipated film presented by Nandamuri Kalyan Ram while it is bankrolled under the banner of NTR Arts and Yuvasudha Arts. Mikkilineni Sudhakar and Hari Krishna K are the producers. Bollywood beauty Janhvi Kapoor is cast as the leading lady, while another Bollywood star, Saif Ali Khan, is set to entertain in a key role.
With the chartbusters "Fear Song" and "Chuttamalle," expectations for the album have soared to new heights. Composer Anirudh Ravichander is also raising the hype with his tweets. Today, the makers dropped the energetic and electrifying dance number titled "Daavudi." This third single video song from the album meets everyone’s expectations. Anirudh has scored groovy beats that will make everyone move. The song has become an instant chartbuster and raises expectations for the rest of the album.
Anirudh is truly a phenomenal composer when it comes to scoring catchy dance numbers with peppy beats. The lyrics have been penned by some of the most renowned lyricists: Saraswati Putra Ramajogayya Sastry in Telugu, Vignesh Shivn in Tamil, Kausar Munir in Hindi, Varadharaj Chikkballapura in Kannada and Mankombu Gopalakrishna in Malayalam, each bringing their own poetic flair to the track.
Adding to the song's charm is the incredible lineup of vocal talent. The Telugu, Hindi and Kannada versions features the energetic voices of Nakash Aziz and Akasa. In Tamil and Malayalam, Nakash Aziz and Ramya Behara bring their magic to the track, making this song a truly pan-Indian experience. NTR’s graceful dance moves are a treat to watch, and the "Daavudi" song beats deliver what fans expect, setting the stage on fire. Janhvi Kapoor looks stunning, and her beautiful expressions and energetic moves make this video song repeat-worthy. NTR and Janhvi Kapoor share electrifying chemistry, and Sekhar Master's choreography adds to the magic.
This high-octane action saga, being crafted as a two-part cinematic experience, has set the release date for its first installment, "Devara: Part 1," on September 27th in Telugu, Tamil, Hindi, Kannada and Malayalam. NTR plays the title role in "Devara," with Prakash Raj, Srikanth, Shine Tom Chacko, and Narain in key roles. Sreekar Prasad is handling the editing works, R. Rathnavelu is acting as the cinematographer, and Sabu Cyril is the production designer.
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ‘దేవర’ నుంచి మూడో పాటగా ‘దావుడి’ వీడియో సాంగ్ రిలీజ్
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం అనేక సంచలనాలను క్రియేట్ చేస్తోంది. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తోన్నఈ చిత్రంలో మరో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీలక పాత్రలో అలరించబోతున్నారు.
‘దేవర’ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ‘ఫియర్ సాంగ్..’, ‘చుట్టమల్లె..’ సాంగ్స్ ఎక్స్‌ట్రార్డినరీ రెస్పాన్స్‌ను రాబట్టుకోవటమే కాకుండా సినిమాపై ఉన్న అంచనాలను నెక్ట్స్ రేంజ్‌కు తీసుకెళ్లాయి. సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్ సైతం ట్వీట్స్‌తో అంచనాలను పెంచేస్తున్నారు. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ చిత్రం నుంచి ‘దావుడి..’ అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. ఎన్టీఆర్ డాన్స్ గురించి ఆడియెన్స్‌కు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మరోసారి ఈ పాటలో తారక్ డాన్స్ ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్‌తో అదరగొట్టేశారు. దీంతో ఈ పాట సినిమాపై అంచనాలను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళ్లింది. అనిరుద్ కంపోజ్ చేసిన ట్యూన్ ప్రతీ ఒక్కరినీ డాన్స్ చేసేలా చేస్తోది. ఇన్‌స్టెంట్ చార్ట్ బస్టర్‌గా నిలిచిన ఈ పాట మిగిలిన పాటలపై ఎక్స్‌పెక్టేషన్స్‌ను పెంచేసింది.
అనిరుద్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు. పెప్పీ బీట్స్‌కు ఆయనెలాంటి సంగీతాన్ని అందిస్తారో అందరికీ తెలిసిందే. దేవరలో దావుడి సాంగ్‌ను వావ్ అనిపించేలా కంపోజ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి తెలుగులో రాసిన ఈ పాటను తమిళంలో విఘ్నేష్ శివన్, హిందీలో కౌసర్ మునీర్, కన్నడలో వరదరాజ్ చిక్‌బల్లాపుర, మలయాళంలో మాన్‌కొంబు గోపాలకృష్ణ రాశారు
పాటను అద్భుతంగా పాడిన వారి విషయానికి వస్తే నకష్ అజీజ్, ఆకాశ తెలుగు, హిందీ, కన్నడ భాషల్లో ఆలపించారు. నకష్ అజీజ్, రమ్యా బెహ్రా తమిళ, మలయాళంలో పాటను పాడారు. మ్యూజిక్ ట్రాక్, పాటను తెరకెక్కించిన తీరు చూస్తుంటే పాన్ ఇండియా ఎక్స్‌పీరెయెన్స్ కలుగుతోంది. ఎన్టీఆర్ డాన్స్‌లో గ్రేస్ ఓ ట్రీట్‌లా ఉంది. ఎన్టీఆర్ డాన్స్ ఎలా ఉండాలని అభిమానులు, ప్రేక్షకులు కోరుకుంటారో దాన్ని మించేలా శేఖర్ మాస్టర్ సాంగ్‌కు కొరియోగ్రఫీ అందిచంఆరు. జాన్వీ లుక్ చాలా బావుంది. తారక్, జాన్వీ మధ్య కెమిస్ట్రీ చూడచక్కగా అనిపిస్తుంది.
అమేజింగ్ సినిమాటిక్ ఎక్స్ హై యాక్షన్ థ్రిల్లర్‌ను రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. మొదటి భాగం ‘దేవర: పార్ట్ 1’ను తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 27న విడుదల చేస్తున్నారు. ‘దేవర’గా టైటిల్ పాత్రలో మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ నటిస్తోన్న ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, శ్రీకాంత్, షైన్ టామ్ చాకో, నరైన్ కీలక పాత్రలను పోషించారు. నందమూరి కళ్యాణ్ రామ్ సమర్పణలో ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ పతాకాలపై మిక్కిలినేని సుధాకర్, హరికృష్ణ.కె ఈ సినిమాను నిర్మిస్తున్నారు. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్, ఆర్.రత్నవేలు సినిమాటోగ్రఫీ, సాబు శిరిల్ ప్రొడక్షన్ డిజైనింగ్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు.