pizza

Dil Raju clarifies Sirish's comments on Ram Charan..!
రామ్ చరణ్ పై శిరీష్ వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..! dilraju-clarifies-sirish-comments

You are at idlebrain.com > news today >

01 July 2025
Hyderabad

Producer Sirish’s recent comments about Ram Charan in an interview with a YouTube channel created quite a stir. In response, Dil Raju stepped in today to put the controversy to rest.

He explained that since it was Sirish’s first interview, he may have spoken emotionally, and that there are absolutely no differences between them and Ram Charan. Dil Raju emphasized that even during the Sankranti release clash of two films, both Chiranjeevi and Ram Charan extended their support.

He reiterated that he has maintained this stance from the beginning. Dil Raju also pointed out that when director Shankar was away working on Indian 2, Charan chose not to take up another film and waited specifically for Game Changer, which, according to Raju, shows Charan's commitment.

He stated that he has been closely associated with Game Changer, while Sirish was only involved with Sankranthiki Vastunnam. He added that Sirish is also very close to Ram Charan and that he only spoke from a distributor's perspective - there was no other intent behind his comments.

రామ్ చరణ్ పై శిరీష్ వ్యాఖ్యలకు క్లారిటీ ఇచ్చిన దిల్ రాజు..!

నిర్మాత శిరీష్ నిన్న ఒక యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్యూలో రామ్ చరణ్ పై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపాయి. దాంతో దిల్ రాజు ఆ దుమారానికి తెరదించే ప్రయత్నాలు చేశారు. ఈరోజు దానికి వివరణ ఇస్తూ శిరీష్ కు అది మొదటి ఇంటర్వ్యూ అవ్వడంతో, ఎమోషనల్ గా మాట్లాడే క్రమంలో అలా మాట్లాడేశారని, అంతే తప్ప తమకూ రామ్ చరణ్ కు మధ్య ఎటువంటి బేదాభిప్రాయాలు లేవని, సంక్రాంతికి రెండు సినిమాలు ఒకే రోజున రిలీజ్ అవ్వడంలో కూడా చిరంజీవి గారు మరియు చరణ్ ల సహకారం ఉందని చెప్పుకొచ్చారు. ఇదే విషయాన్ని మొదటి నుండీ చెప్పుకుంటూ వస్తున్నానన్నారు. ఇండియన్ 2 కోసం దర్శకుడు శంకర్ వెళ్లిన సమయంలో కూడా, గేమ్ ఛేంజర్ కోసమే మరొక సినిమా ఒప్పుకోకుండా చరణ్ ఉండిపోయారని, అందువలన చరణ్ అంటే తనకు కన్సర్న్ ఉందని చెప్పుకొచ్చారు దిల్ రాజు. గేమ్ ఛేంజర్ సినిమాతో తను ట్రావెల్ అయ్యానని, శిరీష్ 'సంక్రాంతికి వస్తున్నాం' తో మాత్రమే ట్రావెల్ అయ్యాడన్నారు . రామ్ చరణ్ తో శిరీష్ కూడా చాలా క్లోజ్ గా ఉంటాడన్నారు. శిరీష్ ఒక డిస్ట్రిబ్యూటర్ యాంగిల్ లో మాత్రమే మాట్లాడాడని, రామ్ చరణ్ పై వేరే ఉద్దేశ్యమే అతనికి లేదన్నారు.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved