“In Trying to Play a Safe Game, It Was We Producers Who Made Mistakes with OTTs” – Dil Raju
సేఫ్ గేమ్ ఆడే క్రమంలో OTTల విషయంలో నిర్మాతలమే తప్పు చేసేశాం - దిల్ రాజు
As part of Thammudu promotions, producer Dil Raju shared several key insights in an interview with Idlebrain Jeevi. When the discussion turned to OTT platforms, he spoke candidly about their impact on the industry and the losses they are causing.
Dil Raju said that the system that began post-COVID has caused significant damage to the film industry. If not corrected, it could lead to dangerous consequences, he warned. That’s why he is now proceeding cautiously.
He explained that during the COVID gap, many people focused on writing stories, and that’s when ideas of making originals and web series for OTT platforms started taking shape, causing a major shift in the market. “We celebrated back then, but we’re paying the price now,” he remarked.
“With the arrival of OTTs, remunerations that were ₹10 crores shot up to ₹50 crores, then ₹60, and now even ₹100 crores. We became greedy. But theatrical revenues dropped. If a film doesn’t perform in theatres, it’s not considered successful anymore,” Dil Raju said. He emphasized that true cinematic enjoyment only comes from watching in theatres.
He warned that if movies continue to flop in theatres, producers may not even remain executive producers for OTTs in the future — they’ll be reduced to mere brokers. “We will all have to work as brokers,” he said with concern.
Dil Raju revealed that his doubts began in 2020 when he released his film V directly on OTT. “That’s when I realized that once people get used to watching movies at home, it could be a long-term danger to theatres,” he said. Later, when Vakeel Saab was getting ready for release, the second COVID wave hit, lockdowns returned, and theatres shut down again. He had to approach Amazon, asking them to offer whatever they could so at least the distributors wouldn’t suffer losses. “These were all mistakes I made,” he admitted.
He confessed that by conditioning audiences to watch films at home, producers are now suffering the consequences. “People aren’t coming to theatres anymore — and it’s our fault,” he stated bluntly.
“In trying to play a safe game back then, remuneration spiraled out of control. Now, they must come down. We need to cut costs and bring back audiences to theatres,” he said. He questioned, “Where are the days when movies like Ala Vaikunthapurramuloo ran for 50 days with housefuls?”
He praised Aamir Khan’s recent decision to release a film on YouTube instead of OTT, saying it sparked meaningful discussions across the industry. He stressed the need to release more films regularly — at least one every week — so that audiences develop the habit of going to theatres again.
“You can only truly enjoy a film in theatres,” he concluded. “Watching at home is just time-pass. Today, the entire lower-middle class has stopped going to theatres. Even 70–80% of the middle class has moved away from theatres.”
సేఫ్ గేమ్ ఆడే క్రమంలో OTTల విషయంలో నిర్మాతలమే తప్పు చేసేశాం - దిల్ రాజు
తమ్ముడు సినిమా ప్రమోషన్లో భాగంగా ఐడిల్ బ్రెయిన్ జీవితో జరిగిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు నిర్మాత దిల్ రాజు. మాటల్లో OTT సంబంధిత చర్చ ప్రస్తావన జరిగినప్పుడు ఇండస్ట్రీ పై OTT ప్రభావం ఎలా ఉండబోతుందో, ఎలాంటి నష్టాలకు కారణం కాబోతుందో అన్న విషయాలను నిర్మొహమాటంగా చెప్పేసారు దిల్ రాజు. కోవిడ్ తరువాత మొదలైన సిస్టం తోనే సినిమా పరిశ్రమకు చాలా డ్యామేజ్ జరిగిందన్నారు నిర్మాత దిల్ రాజు. సరిదిద్దుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కొనే పరిస్థితికి పరిశ్రమ వెళ్లే ప్రమాదముందన్నారు. ఆ క్రమంలోనే జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకువెళ్తున్నానన్నారు. కోవిడ్ సమయంలో వచ్చిన గ్యాప్ కారణంగా అందరూ కథలు రాసుకున్నారని, అప్పుడే OTT ల ద్వారా ఒరిజినల్ తీద్దామని, వెబ్ సిరీస్ తీద్దామనే ఆలోచన రావడంతో మొత్తం మార్కెట్ లో మార్పులొచ్చాయన్నారు. అప్పుడు పొంగిపోయినా దాని ప్రభావం ఇప్పుడు అనుభవిస్తున్నామన్నారు.
OTT వచ్చేసింది, పది కోట్ల రెమ్యునరేషన్ యాభై కోట్లు, యాభై కోట్లు అరవై కోట్లుగా, అరవై కోట్లున్న రెమ్యునరేషన్ వంద కోట్లు అయిందని సబరపడిపోయామని, కానీ ధియేటర్ ఆదాయం పడిపోయిందని, థియేటర్లో సినిమా ఆడకపతే ఆ సినిమా ఆడినట్టు కాదంటున్నారు దిల్ రాజు. థియేటర్లలోనే ప్రేక్షకుడు సినిమాను ఎంజాయ్ చేయగలడన్నారు . థియటర్లలో సినిమాలు ఆడకపోతే భవిష్యత్తులో నిర్మాతలు OTT లకు కనీసం ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు కాదు కదా బ్రోకర్లు అవుతారని, వాళ్లందరికీ బ్రోకర్ పనిచేయాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
2020 సంవత్సరంలో తన V సినిమాను OTT కు ఇచ్చేటప్పుడే తనకు అనుమానం మొదలైందన్నారు. సినిమాను తీసుకెళ్లి, ఇంట్లో కూర్చిని చూడటం అలవాటు చేయడం దగ్గరే భవిష్యత్తులో థియేటర్లకు ప్రమాదముందన్న భయం ఆనాడే కలిగిందన్నారు. తరువాత వకీల్ రిలీజ్ కొత్తలో మళ్ళీ కోవిడ్ రెండో వేవ్ రావడంతో, సెకండ్ లాక్ డౌన్ వచ్చేసిందని, థియేటర్లు క్లోజ్ అవ్వడంతో మళ్ళీ అమెజాన్ వాళ్ళతో మాట్లాడి, కనీసం డిస్ట్రిబ్యూటర్లకైనా ఉపయోగమవ్వాలని, నాకేమిస్తావో ఇచ్చేయమని అడగాల్సి వచ్చిందన్నారు. ఇవన్నీ తను చేసిన తప్పులే అంటున్నారు దిల్ రాజు.
ఆరోజు ప్రేక్షకులకు ఇంట్లో కూర్చొని సినిమా చూసే అలవాటు చేసేశామని, ఈరోజు థియేటర్లకు రావట్లేదని బాధపడిపోతున్నామని, తప్పంతా నిర్మాతలదే అని కుండబద్దలుకొట్టేశారు.
ఆరోజు సేఫ్ గేమ్ ఆడే క్రమంలో రెమ్యునరేషన్లు పెరిగిపోయాయని, అవి నేడు తగ్గాల్సిన అవసరముందన్నారు. ఆ రెమ్యునరేషన్లు తగ్గించుకుంటూ థియేటర్లకు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను పెంచాల్సిన అవసరముందన్నారు. ఆల వైకుంఠపురం లో లాంటి సినిమాలు యాభై రోజులు హౌస్ ఫుల్స్ తో ఆడాయని, అలాంటి రోజులు ఇప్పుడెక్కడ అని ప్రశ్నించారు. ఇటీవల అమీర్ ఖాన్ గారు OTT కు కాకుండా యూట్యూబ్ కు ఇవ్వాలన్న నిర్ణయంతో అందరూ ఆలోచించేలా చేశారన్నారు. ప్రేక్షకుడికి ప్రతి వారం సినిమా వచ్చే విధంగా, ఎక్కువ సినిమాలు ఇవ్వగలగాలని, తద్వారా ప్రేక్షకుడికి మళ్ళీ సినిమా అలవాటు చేయగలమన్నారు. థియేటర్లో వస్తే ఎంజాయ్ మెంట్ ఇంట్లో కూర్చొని చూస్తే రాదన్నారు. ఇంట్లో కేవలం టైం పాస్ మాత్రమే చేయగలమన్నారు. ఈరోజు లోవర్ మిడిల్ క్లాస్ మొత్తంగా ఆగిపోయారని, మిడిల్ క్లాస్ లో డెబ్భై ఎనభై శాతం దాటి థియేటర్లకు రావడమే మానేశారన్నారు.