pizza

“We Wouldn’t Have Spent So Much Just for Nithiin!” – Dil Raju Opens Up on Thammudu
నితిన్ కోసమైతే తమ్ముడుకి ఇన్ని కోట్లు పెట్టేవాళ్ళం కాదు!

You are at idlebrain.com > news today >

26 June 2025
Hyderabad

After a long time, Thammudu is arriving with solid content, said producer Dil Raju. He emphasized that the film wasn’t made just for Nithiin, but that every decision was driven by the story. “In the current scenario, we wouldn’t have spent Rs. 75 crores on such a big film just for Nithiin alone. We made this investment purely based on the strength of the story,” he said.

He revealed that around Rs. 30 crores went into the making alone, and that the film includes thrilling action episodes. Dil Raju shared that he was highly impressed with director Venu Sriram’s concept on how to pull audiences to theatres.

The shoot lasted 150 days, with nearly 80% of it done in forest locations, which posed many challenges. Still, the director didn’t compromise anywhere, he noted. Venu Sriram made the film exactly the way he envisioned, and the second half is packed with 'wow' moments, especially the final 50 minutes, which Raju promised will give the audience a solid kick.

Interestingly, the entire story unfolds in a single night. Dil Raju predicted that in terms of scale and execution, this film will give the director more acclaim than his earlier films like MCA and Vakeel Saab. With a mix of drama, thrill, and emotion, the jungle backdrop adds a unique flavor to the story.

He also stressed that the director was meticulous during production—“Had we not taken such care, the budget would’ve shot up to Rs. 100 crores,” he said.

As for the trailer, Dil Raju stated clearly that he didn't spend money to buy views on Youtube. “If even 20% of those who watched the trailer come to the theatres, Thammudu will be a hit at the box office,” he concluded.

నితిన్ కోసమైతే తమ్ముడుకి ఇన్ని కోట్లు పెట్టేవాళ్ళం కాదు!

చాలా రోజుల తరువాత కంచి కంటెంట్ తో తమ్ముడు సినిమా రాబోతుందన్నారు దిల్ రాజు. నితిన్ కోసమన్నట్టు కాకుండా సినిమా కోసం ఏం చేయాలో అన్నీ ఈ సినిమా కోసం చేశామన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కేవలం నితిన్ కోసమైతే డెబ్భై అయిదు కోట్లు పెట్టి ఇంత భారీ సినిమా తీసేవాళ్ళం కాదన్నారు. కథను దృష్టిలో పెట్టుకునే ఇంత భారీగా ఖర్చు చేశామన్నారు. సుమారు ఈ సినిమా మేకింగ్ కోసమే ముప్పై కోట్ల ఖర్చు పెట్టామన్నారు. ఈ సినిమాలో యాక్షన్ ఎపిసోడ్స్ థ్రిల్లింగ్ గా ఉంటాయన్నారు. ప్రేక్షకుడిని థియేటర్ కు ఏ విధంగా రప్పించాలో అన్న విషయంలో దర్శకుడు వేణు శ్రీరామ్ చెప్పిన కాన్సెప్ట్ తనకు బాగా నచ్చిందన్నారు.

తమ్ముడు సినిమా షూటింగ్ 150 రోజుల పాటు జరిగిందని, సుమారు ఎనభై శాతం షూటింగ్ అడవిలోనే జరగడంతో చాలా సమస్యలు తలెత్తాయి అన్నారు. అయినా కూడా ఎక్కడా రాజీ పడకుండా దర్శకుడు ఈ సినిమాను నిర్మించాడన్నారు. వేణు శ్రీరామ్ తను అనుకున్నది అనుకున్నట్టుగానే ఈ సినిమాను తీసాడని, ఈ సినిమా సెకండాఫ్ లో వావ్ అనిపించే మూమెంట్స్ చాలా ఉన్నాయన్నారు. చివరి యాభై నిముషాల్లో వచ్చే సన్నివేశాలు ప్రేక్షకుడికి తప్పకుండా కిక్కునిస్తాయి అన్నారు. ఈ సినిమా మొత్తం ఒక్క నైట్ లోనే జరుగుతుందన్నారు. గతంలో తీసిన M.C.A, వకీల్ సాబ్ సినిమాల కంటే మేకింగ్ పరంగా ఈ సినిమాతో దర్శకుడికి మంచి పేరొస్తుందన్నారు. డ్రామా, థ్రిల్లింగ్, ఎమోషన్ లాంటి అంశాలతో కలిసి ఈ కథ అటవీ నేపథ్యంలో ఆసక్తికరంగా జరుగుతుందన్నారు. ఈ సినిమాలో నిర్మాణంలో దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకున్నాడన్నారు. లేదంటే వంద కోట్ల పెట్టుబడి అయ్యేదన్నారు. ఈ తమ్ముడు ట్రైలర్ వ్యూస్ విషయంలో ఎటువంటి ఫేక్ చేయలేదని, ట్రైలర్ చూసినవాళ్ళల్లో ఇరవై శాతం మంది ఈ సినిమా చూసినా మంచి కలెక్షన్లు వచ్చి తమ్ముడు సినిమా సక్సెస్ సాధించినట్టే అన్నారు దిల్ రాజు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved