Arka Mediaworks and Showing Business' Don't Trouble the Trouble Electrifying First Single "Cakeu Walku" Music Video ft. Fahadh Faasil, Kaala Bhairava, MC Hari is out now
ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ నుంచి ఫహాద్ ఫాజిల్, కాలభైరవ, ఎంసి.హరి కాంబోలో రూపొందిన ఫస్ట్ సింగిల్ ‘కేకు వాకు’ రిలీజ్
When the most versatile actor, Fahadh Faasil, meets the mighty industry-hit Baahubali makers and maverick director S.S. Rajamouli, a magical phenomenon like "Don't Trouble the Trouble" happens. Passionate producer SS Karthikeya, who tasted massive success with his debut distribution venture Premalu under the Showing Business banner, is now bringing this ambitious project in association with Arka Media Works, the renowned producers of India's pride and joy, the Baahubali franchise.
The film, titled "Don't Trouble the Trouble," is helmed by debutant Shashank Yeleti. Versatile actor Fahadh Faasil plays the lead role in this fantasy entertainer. Acclaimed producers Shobu Yarlagadda and Prasad Devineni have joined hands with SS Karthikeya to produce this exciting, content-rich film. After the entertaining and curiosity-raising teaser, the makers unveiled Cakeu Walku video song.
This song, composed by Kaala Bhairava, introduces the character of Suri and his madness in a unique setup. The makers have created a special music video featuring Kaala Bhairava, Fahadh Faasil, and Ssara. What begins as a cool song turns into full-on whacky mode when Kaala Bhairava kicks in with thumping beats. It’s an electrifying composition by the young music director, and his moves also impress.
Kaala Bhairava and MC Hari penned catchy lyrics for the song, highlighting Suri’s daredevil nature and how every task is a cakewalk for him. They also sing the song with great energy. Fahadh Faasil’s energy and vibe remind everyone of Ranga Chetta from Aavesham. His graceful moves, infectious smile, and charm make it an absolute eye feast. Even Ssara joins the fun music video and makes it even more special.
This is a chartbuster start to what promises to be one of the most exciting albums. Don't Trouble the Trouble" promises a fantasy entertainer and is gearing up for grand release on September 11th, 2026. The film's music will be composed by Kaala Bhairava.
Starring: Fahadh Faasil, Ssara, Saurabh Sachdeva and others
Technical Team:
Directed by: Shashank Yeleti.
Banners: Arka Mediaworks & Showing Business
Producers: Shobu Yarlagadda , Prasad Devineni, SS Karthikeya
Music: Kaala Bhairava
ఆర్కా మీడియా వర్క్స్, షోయింగ్ బిజినెస్ బ్యానర్స్ నిర్మాణంలో రూపొందుతోన్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ నుంచి ఫహాద్ ఫాజిల్, కాలభైరవ, ఎంసి.హరి కాంబోలో రూపొందిన ఫస్ట్ సింగిల్ ‘కేకు వాకు’ రిలీజ్
వైవిధ్యమైన పాత్రల్లో నటించి విలక్షణ నటుడిగా పేరు పొందిన స్టార్ యాక్టర్ ఫహాద్ ఫాజిల్, ఇండస్ట్రీ హిట్ బాహుబలి మూవీని నిర్మించిన మేకర్స్‌తో పాటు సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్.ఎస్.రాజమౌళి కలయికలో రూపొందుతోన్న చిత్రం ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’. షోయింగ్ బిజినెస్ బ్యానర్‌పై తన తొలిసారి డిస్ట్రిబ్యూట్ చేసిన ప్రేమలు చిత్రంతో భారీ విజయాన్ని అందుకున్న ప్యాషనేట్ ప్రొడ్యూసర్ ఎస్.ఎస్. కార్తికేయ..ఇప్పుడీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్‌ను ఇండియన్ సినిమాకు గర్వకారణంగా నిలిచిన బాహుబలి ఫ్రాంచైజీ నిర్మాతలైన ఆర్కా మీడియాతో కలిసి రూపొందిస్తున్నారు.
‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ చిత్రానికి కొత్త దర్శకుడు శశాంక్ యేలేటి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌లో వెర్సటైల్ యాక్టర్ ఫహాద్ ఫాసిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాతలు శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని, ఎస్.ఎస్. కార్తికేయ కలసి ఈ ఆసక్తికరమైన, కంటెంట్ రిచ్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇప్పటికే వినోదాన్ని పంచుతూ ఆసక్తిని రేకెత్తించిన టీజర్ తర్వాత మేకర్స్ ‘కేకు వాకు’ అనే వీడియో సాంగ్‌ను విడుదల చేశారు.
కాల భైరవ సంగీత సారథ్యంలో స్వరపరిచిన ఈ పాట సూరి అనే పాత్రను, అతని పిచ్చితనాన్ని ఓ ప్రత్యేకమైన సెటప్‌లో పరిచయం చేస్తుంది. కాల భైరవ, ఫహాద్ ఫాసిల్, స్సారా కలయికలో ఈ ప్రత్యేక మ్యూజిక్ వీడియోను మేకర్స్ రూపొందించారు. ముందు కూల్‌గా ప్రారంభమైన ఈ పాట..కాల భైరవ తన థంపింగ్ బీట్స్‌తో ఎంట్రీ ఇచ్చిన వెంటనే పూర్తి స్థాయి వాకీ మోడ్‌లోకి మారుతుంది. యువ సంగీత దర్శకుడు ఇచ్చిన ఈ ఎనర్జిటిక్ కంపోజిషన్ ఆకట్టుకునేలా ఉండటమే కాకుండా ఆయన స్టెప్స్ కూడా ఇంప్రెస్ చేస్తాయి.
కాల భైరవ, ఎంసీ హరి కలిసి ఈ పాటకు క్యాచీ లిరిక్స్ అందించారు. సూరి డేర్‌డెవిల్ స్వభావాన్ని, అతనికి ప్రతి పని ఎంత ఈజీగా ‘కేక్‌వాక్’లా ఉంటుందనే విషయాన్ని చక్కటి పదాలతో హైలైట్ చేశారు. వీరిద్దరూ పాటను ఎనర్జీతో పాడుతూ మరింత స్పెషల్ అనిపించేలా చేశారు. ఫహాద్ ఫాజిల్ ఎనర్జీ, వైబ్స్ చూస్తే ఆవేశం సినిమాలోని రంగ చేట్టా పాత్ర గుర్తుకు వస్తుంది. ఆయన గ్రేస్‌ఫుల్ మూవ్స్, ఆకట్టుకునే నవ్వు, చార్మ్ అన్నీ కలిసి ఈ పాటను చూడటానికి ఐ ఫీస్ట్‌లా మార్చాయి. స్సారా కూడా ఈ ఫన్ మ్యూజిక్ వీడియోలో జాయిన్ అయి మరింత ప్రత్యేకతను తీసుకొచ్చింది.
ఇది ఇప్పటికే ప్రమోషన్స్ పరంగా చార్ట్‌బస్టర్‌గా నిలిచింది.. ఇప్పుడీ పాట అత్యంత ఎక్సైటింగ్ ఆల్బమ్‌లలో ఒకటిగా నిలవబోతుందని తెలుస్తోంది. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ మూవీ ఫాంటసీ ఎంటర్‌టైనర్‌గా ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం సెప్టెంబర్ 11, 2026న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ అవుతోంది.