తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న కల్ట్ సీక్వెల్ ‘ENE Repeat' లో విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఎస్ ఒరిజినల్స్, రూట్నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో ప్రియదర్శిని రామ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. మురళీధర్గా ఆయన పాత్ర పరిచయం చేశారు. ఏం చెయ్యాలో, ఎలా ఉండాలో, అన్నీ ఈయనే చెప్పేలా ఉన్నాడు. అసలు ఎవరు ఈ మురళీధర్? #ENERepeat విమానంలో అతను ఏమి చేస్తున్నాడు? అంటూ మేకర్స్ రివిల్ చేసిన లుక్ ఆకట్టుకుంది.
2018లో విడుదలై కల్ట్ క్లాసిక్గా గుర్తింపు తెచ్చుకున్న ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రానికి సీక్వెల్గా ‘ENE Repeat’ రూపొందుతోంది.
ఈ సినిమాలో విశ్వక్ సేన్ వివేక్గా, అభినవ్ గోమఠం కౌశిక్గా, వెంకటేష్ కాకుమాను ఉప్పిగా, శ్రీనాథ్ మాగంటి కార్తీక్గా అలరించనున్నారు. తొలి పార్ట్ లో తమ స్నేహం, కామెడీతో యువ ప్రేక్షకులకు దగ్గరైన ఈ నలుగురి గ్యాంగ్ మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తోంది.
ఈ చిత్రానికి ఏజే ఆరోన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, వివేక్ సాగర్ సంగీతం సమకూరుస్తున్నారు.
ఈ సినిమా నవంబర్ 19, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది.