pizza

ENE Repeat Movie Press Meet
‘ఈఎన్‌ఈ రిపీట్‌’తో నా కెరీర్‌లో ఫస్ట్ టైమ్ ఇంత గొప్ప ఎక్స్‌పీరియన్స్ పొందాను: హీరో విశ్వక్ సేన్

You are at idlebrain.com > news today >

20 Novembar 2026
Hyderabad

తరుణ్ భాస్కర్ దాస్యం దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘ఈఎన్‌ఈ రిపీట్‌’. ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాకు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రంలో క్రేజీ గ్యాంగ్ విశ్వక్ సేన్, అభినవ్ గోమఠం, వెంకటేష్ కాకుమాను, శ్రీనాథ్ మాగంటి మరోసారి ప్రేక్షకులను అలరించారు. ఎస్ ఒరిజినల్స్, రూట్‌నోడ్ సినిమా బ్యానర్లపై సృజన్ యరబోలు, సందీప్ నాగిరెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. నవంబర్ 19న గ్రాండ్‌గా థియేటర్లలో రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన రెస్పాన్స్‌తో హౌస్‌ఫుల్ కలెక్షన్స్‌తో రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ ప్రెస్ మీట్ నిర్వహించారు.

ప్రెస్ మీట్‌లో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో, మన చుట్టుపక్కల ఏదైనా చేస్తున్నప్పుడు ఈజీగా జడ్జ్ చేస్తారు. వీళ్లు ఏం తీస్తారు? ఇలాంటి మాటలు చాలా విని వచ్చాం. కానీ ఒక బ్యాచ్ మాత్రం ఎప్పుడూ జడ్జ్ చేయరు. వారే మా ఆడియన్స్. వాళ్లే ఈరోజు మాకు ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చారు. నిజాయితీ ఉంటే సినిమాని మరో స్థాయికి తీసుకెళ్తారని ఈరోజు మరోసారి రుజువైంది. మేము థియేటర్లలోకి వెళ్తున్నప్పుడు ఆడియన్స్ సినిమాని థియేటర్లలో సెలబ్రేట్ చేసుకోవడం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఫిల్మ్ మేకర్‌గా నా జీవితం ఫుల్‌ఫిల్ అయిందని భావిస్తున్నాను. ఆడియన్స్‌ క్లాప్స్ విన్న తర్వాత ఇంకేం అడగాలని లేను. కలెక్షన్స్ మర్చిపోండి. నా డైరెక్షన్ టీమ్ ఎంత కష్టపడింది అనేవి కూడా ఇప్పుడు అనవసరం. థియేటర్ మళ్లీ రివైవ్ అవుతోంది. అక్కడ ఒక కమ్యూనిటీగా మీరందరూ సినిమాని ఎంజాయ్ చేస్తూ నవ్వుతూ బయటకు రావడం అనేది చాలా గొప్ప ఎక్స్‌పీరియన్స్. థియేటర్‌కి వెళ్లండి. మీకు కచ్చితంగా ఒక సెలబ్రేషన్‌లా ఉంటుంది. దాన్ని మీరు ఫ్రెండ్స్‌తో, ఫ్యామిలీతో ఎక్స్‌పీరియన్స్ చేయాలి. నవంబర్‌లో సినిమాలు ఆడుతాయా లేదా అనేది దీంతో బ్రేక్ అయిపోయింది. నవంబర్‌ని పండగ చేసుకుందాం. థియేటర్‌లో ఒక మ్యాజిక్ జరుగుతోంది. మీరు కచ్చితంగా వెళ్లి చూడాలి. సెలబ్రేట్ సినిమా.. సెలబ్రేట్ థియేటర్స్.

విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. నిన్న పొద్దున్న ప్రశాంతంగా శ్రీరాములు థియేటర్‌లో కూర్చుని ఆడియన్స్‌తో కలిసి సినిమా చూశాను. ప్రేక్షకులు ఇచ్చిన రెస్పాన్స్‌తో థియేటర్ దద్దరిల్లిపోవడం చూస్తుంటే ఎక్కడో తెలియని ఎనర్జీ వచ్చింది. నేను ఇండస్ట్రీకి వచ్చి తొమ్మిదేళ్లు అవుతున్నప్పటికీ ఫస్ట్ టైమ్ ఇలాంటి ఎక్స్‌పీరియన్స్ పొందాను. అలాంటి ఎక్స్‌పీరియన్స్ ఇచ్చిన డైరెక్టర్ తరుణ్‌కి థాంక్యూ. ఈ సినిమా సక్సెస్ టూర్ చేస్తున్నాము. ఆ టూర్‌లో ఇంకా మాట్లాడదాం. అన్ని సినిమాలు బాగుండాలి. థియేటర్లన్నీ కళకళలాడాలి.

అభినవ్ గోమఠం మాట్లాడుతూ.. మేము మొదటి నుంచి చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నాం. మా ఆడియన్స్ మా నమ్మకాన్ని నిజం చేశారు. తరుణ్ అద్భుతంగా రాసి తీశారు. మేము ఆంధ్రా టూర్ చేస్తున్నాము. అందరినీ కలుస్తాము. అందరూ ఈ సినిమాని థియేటర్లలో ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను.

శ్రీనాథ్ మాగంటి మాట్లాడుతూ.. సినిమాకి వచ్చిన రెస్పాన్స్ అదిరిపోయింది. సింగిల్ స్క్రీన్స్, మల్టీప్లెక్స్‌లు అన్ని చోట్లా ఆడియన్స్ ఒకేలా ఎంజాయ్ చేస్తున్నారు. మళ్లీ మళ్లీ చూడాల్సిన సినిమా ఇది. థియేటర్లలో కలుద్దాం.

వెంకటేష్ కాకుమాను మాట్లాడుతూ.. సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాం. ఆడియన్స్ దానికి కనెక్ట్ అయి థియేటర్లలో అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చారు. ఇది మాకు చాలా అద్భుతమైన ఫీలింగ్. పార్ట్ వన్ కంటే మీరు చూపిస్తున్న ప్రేమ మూడింతలు పెరిగింది. తరుణ్ అన్నకి థాంక్యూ. థియేటర్లలో ఇంకా చూడని వాళ్లు తప్పకుండా చూడండి. ఇంత అద్భుతమైన రెస్పాన్స్ ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.

అనిషా మాట్లాడుతూ.. ఈ సినిమాకి వచ్చిన అద్భుతమైన రెస్పాన్స్ మాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. అందరూ కూడా చాలా మంచి రివ్యూలు ఇచ్చారు. ఇంకా సినిమా చూడని వాళ్లు తప్పకుండా వెళ్లి సినిమా చూడండి.

శివాత్మిక మాట్లాడుతూ.. నాకు ఈ సినిమాలో ఇంత మంచి అవకాశం ఇచ్చిన డైరెక్టర్ తరుణ్ గారికి థాంక్యూ. సినిమాని ఆడియన్స్ అందరూ చాలా గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మా టీమ్ అందరికీ థాంక్యూ. సినిమా విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.

నిర్మాత సృజన్ మాట్లాడుతూ.. ఇది నా ఫస్ట్ కమర్షియల్ హిట్. ఈ మూమెంట్ కోసం పదేళ్లుగా ఎదురుచూస్తున్నాను. ప్రతి టికెట్ తెగుతున్న కొద్దీ చాలా ఎనర్జీ వస్తోంది. ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ఆడియన్స్‌కి థాంక్యూ. నిజానికి గురువారం సినిమా వేయరు. శిరీష్ గారు 50 షోస్ అయితే గొప్ప అన్నారు. కానీ 120 హౌస్‌ఫుల్స్ వచ్చాయి. అది ఈ ఏడాదికే రికార్డు అని చెప్తున్నారు. శ్రీరాములు థియేటర్‌లో ఐదు నిమిషాలకే మొత్తం షోస్ ఫుల్ అయిపోయాయి. అలాగే తొలిరోజు కూడా అద్భుతంగా ఫుల్ అవుతూ వెళ్లాయి. హౌస్‌ఫుల్ బోర్డ్స్ పడుతుంటే చాలా హ్యాపీగా ఉంది. రేపటి నుంచి ఆంధ్రాలో బ్లాక్‌బస్టర్ టూర్ చేస్తున్నాము. ఇది యూనివర్సల్ కామెడీ. కచ్చితంగా అన్ని చోట్లా అద్భుతంగా ఉంటుంది. ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు. చాలా రిపీట్ వాల్యూ ఉన్న సినిమా ఇది. కచ్చితంగా లాంగ్ రన్ ఉంటుంది.

నిర్మాత సందీప్ నాగిరెడ్డి మాట్లాడుతూ.. రెస్పాన్స్ చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. సినిమా చూసినందుకు అందరికీ చాలా ధన్యవాదాలు. తప్పకుండా ఈ సినిమాని అందరూ థియేటర్లలో ఆస్వాదిస్తారని కోరుకుంటున్నాను.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved