pizza

Anand Deverakonda & Vaishnavi Chaitanya’s EPIC – FIRST SEMESTER Unveils Soulful Third Single ‘Manasa Vacha’
ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘EPIC – FIRST SEMESTER’ నుంచి మధురమైన మూడో పాట విడుదల

You are at idlebrain.com > news today >

20 August 2026
Hyderabad

The makers of the much-awaited youthful romantic entertainer EPIC – FIRST SEMESTER have unveiled the film’s third single, ‘Manasa Vacha’, a soulful musical piece that beautifully captures the emotions of love and longing.

Composed by the immensely talented Hesham Abdul Wahab, ‘Manasa Vacha’ comes alive through the deeply soulful voices of legendary singers K. S. Chithra and S. P. Charan. Their expressive vocals, combined with Hesham’s evocative composition, make the song a truly memorable musical experience.

Penned by Sri Harsha Emani, the song beautifully conveys the emotions of the lead pair, portrayed by Anand Deverakonda and Vaishnavi Chaitanya. The visuals complement the music with an emotional and soulful journey, showcasing the depth of their relationship and the feelings that unfold along the way.

Directed by Aditya Haasan, EPIC – FIRST SEMESTER is produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under Sithara Entertainments and Fortune Four Cinemas, presented by Srikara Studios, with music by Hesham Abdul Wahab.

EPIC – FIRST SEMESTER is set to hit theatres worldwide on September 11, 2026.

‘EPIC – FIRST SEMESTER’ నుంచి హృదయాలను హత్తుకునే మూడో గీతం ‘మనసా వాచా’

ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య జంటగా నటిస్తున్న ‘EPIC – FIRST SEMESTER’ నుంచి మధురమైన మూడో పాట విడుదల

యువతను ఆకట్టుకునే యూత్‌ఫుల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ‘EPIC – FIRST SEMESTER’ నుంచి మూడో పాట ‘మనసా వాచా’ విడుదలైంది. ప్రేమ, విరహం, అనురాగం వంటి సున్నితమైన భావోద్వేగాలను హృదయాన్ని హత్తుకునేలా ఆవిష్కరించే ఈ గీతం శ్రోతలను విశేషంగా ఆకట్టుకుంటోంది.

ప్రముఖ సంగీత దర్శకుడు హేషమ్ అబ్దుల్ వహాబ్ స్వరపరిచిన ఈ పాటకు దిగ్గజ గాయనీమణి కె. ఎస్. చిత్ర, ప్రముఖ గాయకుడు ఎస్. పి. చరణ్ తన గాత్రంతో ప్రాణం పోశారు. హేషమ్ అబ్దుల్ వహాబ్ మధురమైన స్వరకల్పనకు చిత్ర, చరణ్‌ల భావోద్వేగభరితమైన గానం తోడవడంతో ‘మనసా వాచా’ ఓ అద్భుతమైన సంగీత అనుభూతిగా నిలిచింది.

శ్రీ హర్ష ఈమని సాహిత్యం అందించిన ఈ పాటలో కథానాయకులు ఆనంద్ దేవరకొండ, వైష్ణవి చైతన్య పోషించిన పాత్రల మధ్య ప్రేమ, అనుబంధం, వారి మనసుల్లో చోటుచేసుకునే భావోద్వేగాలను ఎంతో అందంగా ఆవిష్కరించారు. పాటకు అనుగుణంగా తెరకెక్కించిన విజువల్స్ కూడా ఆ భావోద్వేగాలకు మరింత బలాన్ని చేకూరుస్తూ, వారి ప్రేమ ప్రయాణంలోని సున్నితమైన కోణాలను ఆవిష్కరిస్తున్నాయి.

ఆదిత్య హాసన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి హేషమ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు.

ప్రేమ, యవ్వనం, స్నేహం, భావోద్వేగాల సమ్మేళనంగా రూపొందుతున్న ‘EPIC – FIRST SEMESTER’ చిత్రం సెప్టెంబర్ 11, 2026న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved