pizza

The Quest Song Gamyaanne From Mass Ka Das Vishwak Sen, Vidyadhar Kagita, Karthik Sabareesh, V Celluloid’s Gaami is out now
మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విద్యాధర్ కాగిత, కార్తీక్ శబరీష్, వి సెల్యులాయిడ్ 'గామి' నుంచి క్వెస్ట్ సాంగ్ 'గమ్యాన్నే' విడుదల

You are at idlebrain.com > news today >

24 February 2024
Hyderabad

As the release date is not far away, the promotional activities of Mass Ka Das Vishwak Sen’s most-awaited flick Gaami are in full swing. They have already released a first look, character posters, and also a small teaser. Now, it’s time for the musical journey. They have unleashed the film’s first single Gamyaanne.

Scored by Sweekar Agasthi, Gamyaanne is a quest song as Vishwak Sen who played the role of an Aghora is in the pursuit of finding a cure for his disease. He has a route map and it’s an adventurous journey to discover the cure. He has a rare disease that he cannot feel the human touch. The song actually shows the pain he goes through because of the disease, although the lyrics by Sanapati Bharadwaj Patrudu are motivating. The soulful singing of Sugunamma, Anurag Kulkarni, and Sweekar Agasthi adds more depth.

The song describes the journey so effectually and Vishwak Sen emoted the emotions flawlessly. The song has an haunting effect and the effect will be more when we watch it in theatres.

The very talented Chandini Chowdary is the female lead in the movie directed by Vidyadhar Kagita and produced by Karthik Sabareesh on Karthik Kult Kreations. This movie is funded by the crowd. V Celluloid presents it.

Harika Pedada, and Mohammad Samad are the other prominent cast of the movie which will have its trailer to be unleashed on February 29th. The movie has cinematography by Vishwanath Reddy and Rampy Nandigam, music by Naresh Kumaran and Sweekar Agasthi, and the screenplay was written by Vidyadhar Kagita and Pratyush Vatyam.

GAAMI will hit the screens on March 8th.

Cast:- Vishwak Sen, Chandini Chowdary, M G Abhinaya, Harika Pedada and Mohammad Samad
Technical Crew:-
Director:- Vidyadhar Kagita
Producer:- Karthik Sabareesh
Presents by:- V Celluloid
Screenplay:- Vidyadhar Kagita, Pratyush Vatyam
Production Design:- Pravalya Duddupudi
Editor:- Raghavendra Thirun
Music:- Naresh Kumaran, Sweekar Agasthi
DOP:- Vishwanath Reddy
Co-DOP:- Rampy Nandigam
VFX Supervisor:- Sunil Raju Chinta
Costume Design:- Anusha Punjala, Rekha Boggarapu
Colorist:- Vishnu Vardhan K
Sound design:- Sync Cinemas
Action Choreographer:- Wing Chun Anji
Songs:- Naresh Kumaran, Sweekar Agasthi
Lyrics:- Sanapati Bharadwaj Patrudu, Shree Mani
Marketing:- First Show

మాస్ కా దాస్ విశ్వక్ సేన్, విద్యాధర్ కాగిత, కార్తీక్ శబరీష్, వి సెల్యులాయిడ్ 'గామి' నుంచి క్వెస్ట్ సాంగ్ 'గమ్యాన్నే' విడుదల

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మోస్ట్ ఎవెయిటింగ్ మూవీ 'గామి' ప్రచార కార్యక్రమాలు జోరందుకున్నాయి. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌, క్యారెక్టర్‌ పోస్టర్స్‌తో పాటు చిన్న టీజర్‌ని కూడా విడుదల చేశారు. ఇప్పుడు, మ్యూజికల్ జర్నీ టైం. మేకర్స్ ఫస్ట్ సింగిల్ గమ్యాన్నే పాటని విడుదల చేశారు.

స్వీకర్ అగస్తీ స్కోర్ చేసిన 'గమ్యాన్నే' అఘోరా పాత్రలో నటించిన విశ్వక్ సేన్ తన వ్యాధికి మందు వెతకాలనే తపనతో కూడిన అన్వేషణకి సంబధించిన పాట. అతని వద్ద రూట్ మ్యాప్ ఉంది, నివారణను కనుగొనడానికి ఇది సాహసోపేతమైన ప్రయాణం. తనకి మానవ స్పర్శను అనుభవించలేని అరుదైన వ్యాధి వుంది. సనాపతి భరద్వాజ్ పాత్రుడు సాహిత్యం ఆకట్టుకుంది. ఈ పాట వాస్తవానికి వ్యాధి కారణంగా అతను పడే బాధను చూపుతుంది. సుగుణమ్మ, అనురాగ్ కులకర్ణి, స్వీకర్ అగస్తీల అద్భుత గానం మరింత ఆకర్షణీయంగా వుంది.

ఈ పాట ప్రయాణాన్ని చాలా ప్రభావవంతంగా వివరిస్తుంది, విశ్వక్ సేన్ భావోద్వేగాలను అద్భుతంగా పండించారు. హాంటింగ్ ఎఫెక్ట్ ఉన్న ఈ పాటను థియేటర్లలో చూసినప్పుడు మరింత ఎఫెక్టివ్ గా వుంటుంది.

విద్యాధర్ కాగిత దర్శకత్వంలో కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ నిర్మించిన ఈ చిత్రంలో వెరీ టాలెంటెడ్ చాందినీ చౌదరి కథానాయిక. ఈ సినిమాకు క్రౌడ్ ఫండ్ చేశారు. V సెల్యులాయిడ్ దానిని అందజేస్తుంది.

హారిక పెడదా, మరియు మహమ్మద్ సమద్ ఇతర ప్రముఖ తారాగణం. గామి ట్రైలర్ ఫిబ్రవరి 29 న విడుదల కానుంది. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం అందిస్తున్నారు. నరేష్ కుమారన్ మ్యూజిక్. విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు.

గామి మార్చి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తారాగణం:- విశ్వక్ సేన్, చాందిని చౌదరి, ఎంజీ అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్
సాంకేతిక విభాగం:-
దర్శకత్వం:- విద్యాధర్ కాగిత
నిర్మాత:- కార్తీక్ శబరీష్
సమర్పణ:- వి సెల్యులాయిడ్
స్క్రీన్ ప్లే:- విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం
ప్రొడక్షన్ డిజైన్:- ప్రవల్య దుడ్డుపూడి
ఎడిటర్:- రాఘవేంద్ర తిరున్
సంగీతం:- నరేష్ కుమారన్
డీవోపీ:- విశ్వనాథ్ రెడ్డి
కో-డిఓపి:- రాంపీ నందిగాం
Vfx సూపర్‌వైజర్:- సునీల్ రాజు చింత
కాస్ట్యూమ్ డిజైన్:- అనూష పుంజాల, రేఖ బొగ్గరపు
కలరిస్ట్:- విష్ణు వర్ధన్ కె
సౌండ్ డిజైన్: - సింక్ సినిమాస్
యాక్షన్ కొరియోగ్రాఫర్:- వింగ్ చున్ అంజి
పాటలు:- నరేష్ కుమారన్, స్వీకర్ అగస్తి
సాహిత్యం:- సనాపతి భరద్వాజ పాత్రుడు, శ్రీ మణి
మార్కెటింగ్:- ఫస్ట్ షోPrivacy Policy | Disclaimer | Copyright 1999 - 2024 Idlebrain.com. All rights reserved