Garividi Lakshmi Success Meet
‘గరివిడి లక్ష్మి’ సినిమా ద్వారా నన్ను ప్రపంచానికి పరిచయం చేసిన నిర్మాత కృతి గారికి, డైరెక్టర్ గౌరికి ధన్యవాదాలు. ప్రేక్షకులు, నా అభిమానులు అందరూ ఈ సినిమాని చూడాలని కోరుకుంటున్నాను: జానపద గాయని గరివిడి లక్ష్మి
పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించిన లేటెస్ట్ సూపర్ హిట్ ‘గరివిడి లక్ష్మి’. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన లెజెండరీ జానపద గాయని గరివిడి లక్ష్మి కథని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు. గరివిడి లక్ష్మి పాత్రలో ఆనంది నటించారు. గౌరి నాయుడు జమ్ము ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. ఈ రోజు ప్రేక్షకులు ముందుకు వచ్చిన ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. ప్రేక్షకులు ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. సినిమా విజయవంతంగా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ వేడుకలో గాయని గరివిడి లక్ష్మికి మేకర్స్ సన్మానం చేశారు.
సక్సెస్ మీట్లో జానపద కళాకారిణి గరివిడి లక్ష్మి మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. నా కథ కోసం డైరెక్టర్ గౌరీ నాయుడు చాలా తిరిగాడు. తను పడిన శ్రమ చూసి నా కథ చెప్పాను. అలా చెప్పినందుకు ఈ రోజు నన్ను ప్రపంచానికి పరిచయం చేశాడు. నేను బుర్రకథ ఆడాను. బుర్రకథలో నాకు పేరు ఉంది. కానీ ఈ సినిమా ద్వారా ప్రపంచం మొత్తానికి తెలిసింది. నిర్మాత కృతి గారు చిన్న పాప. తనకు నా కథను ఎందుకు తీసుకోవాలనిపించిందో తెలియదు. నా కథను సినిమాగా చేసినందుకు, సినిమా చూసిన అందరికీ ధన్యవాదాలు. ఇంకా చూడని వాళ్లు కూడా సినిమాను చూడండి. ఈ సినిమాను చూసి మీరందరూ మమ్మల్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా డైరెక్టర్ గౌరీ నాయుడుకు కూడా మంచి మంచి అవకాశాలు రావాలని కోరుకుంటున్నాను. మా ఆర్టిస్టులందరూ కూడా సినిమా కోసం కష్టపడి పని చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. ఆనందికి ఇంకా మంచి పేరు రావాలి. ఈ సినిమా చూసిన వాళ్లందరూ కూడా నాలాగే చేసిందని చెబుతుంటే ఆనందంగా అనిపించింది.
నిర్మాత కృతి ప్రసాద్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సినిమాను అద్భుతంగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియాకు ధన్యవాదాలు. సినిమాపై ఎంతో ప్రేమను కురిపిస్తున్నారు. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్ రావడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది. చాలామంది ‘ఈ స్టోరీని నువ్వు ఎందుకు సెలెక్ట్ చేసుకున్నావు? ఇందులో ఏం స్పెషాలిటీ కనిపించింది?’ అని అడిగారు. నా తొలి సినిమా నిర్మించినప్పుడు కచ్చితంగా కొత్త కంటెంట్ ఉన్న సినిమా చేయాలనుకున్నాను. నిజానికి గరివిడి లక్ష్మి కథ విన్నప్పుడు బుర్రకథ అంటే ఏంటో, ఈ జనరేషన్‌కు ఆ కళారూపం గురించి తెలుసా అనే ఐడియా కూడా నాకు పెద్దగా లేదు. కాకపోతే, ఆ లెగసీని, కల్చర్‌ను ఈ జనరేషన్‌కు చూపించాలనుకున్నాను. ఇంత అద్భుతమైన స్క్రిప్ట్ రాసిన గౌరీ గారికి ధన్యవాదాలు. చాలా ప్యాషన్‌తో ఈ సినిమా చేశారు. తప్పకుండా ఆయనకు చాలా గొప్ప కెరీర్ ఉంటుంది. చరణ్ గారి సపోర్ట్‌కు థాంక్యూ. ఆయన ఈ సినిమాకు ఒక పిల్లర్. సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లారు. ఆనందికి హ్యాట్సాఫ్. తన 100 శాతం ప్యాషన్‌తో వర్క్ చేసింది. ఈ పాత్రలో తను మనకు ఎప్పటికీ గుర్తుండిపోతుంది. తన జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. మయూర్ గారికి శంకర్ గారికి, కిషోర్ గారికి థాంక్యూ. గరివిడి లక్ష్మి టీమ్ అందరికీ థాంక్యూ. అందరూ చాలా హార్డ్ వర్క్ చేశారు. బెస్ట్ వర్క్ ఇచ్చారు. మీ అందరి ప్రేమ, సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. నాపై ఇంత నమ్మకం పెట్టినందుకు మా నాన్నగారికి థాంక్యూ. ఈ ప్రయాణంలో నా వెన్నంటే నిలబడ్డారు.”
నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. మా ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ నుంచి ఈ రోజు వరకు సినిమా ప్రజల్లోకి వెళ్లడానికి, రిలీజ్ తర్వాత అద్భుతమైన రెస్పాన్స్ రావడానికి మీడియా ఎంతగానో సపోర్ట్ చేశారు. ఆడియన్స్ సినిమాను ఎంతో అద్భుతంగా ఆదరించారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికీ పేరుపేరునా థాంక్స్.
హీరోయిన్ ఆనంది మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఇది నా జీవితంలో ఎంతో ప్రత్యేకమైన రోజు. రెండేళ్లుగా ఈ మూమెంట్ కోసం ఎదురుచూస్తున్నాను. విశ్వప్రసాద్ గారిని చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ఆయన ప్రౌడ్ ఫాదర్. కృతి ప్రసాద్ గారు గెలిచారు. అందరం ఒక మంచి ఉద్దేశం కోసం పనిచేశాం. ఈ సినిమాను అందరూ సెలబ్రేట్ చేసుకోవడం మాటల్లో చెప్పలేనంత ఆనందాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు. డైరెక్టర్ గారు అద్భుతంగా ఈ సినిమాను తీశారు. నా ఎమోషన్స్ అన్నింటికీ ప్రాణం పోశారు. ఇందులో నటీనటులందరూ కూడా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశారు. అలాగే కిషోర్ గారు, శంకర్ గారు అందరూ అద్భుతంగా నటించారు. ఈ రోజు చాలా ఆనందంగా ఉంది. సెలబ్రేషన్స్ వీడియోలు, ఫోన్ కాల్స్ చూస్తున్నప్పుడు మేము పడిన కష్టమంతా మర్చిపోయాం. ఈ సినిమాకు పని చేసిన ప్రతి ఒక్కరికీ పేరుపేరునా ధన్యవాదాలు.”
రాగ్ మయూర్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. గరివిడి లక్ష్మి గారి సమక్షంలో ఈ వేదికను పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఆమె స్టేజ్‌పై ఏకధాటిగా మూడు మూడు గంటల పాటు ప్రదర్శన ఇచ్చి ప్రేక్షకులను అలరించేవారు. అంత క్రియేటివిటీ, ఎనర్జీ ఉండడం అంటే మామూలు విషయం కాదు. గరివిడి లక్ష్మి గారిని కలవడం అదృష్టంగా భావిస్తున్నాను. ఆమె వల్లే మాకు గుర్తింపు వచ్చింది, గౌరవం వచ్చింది. ఈ సినిమాలో నా పాత్రకు చాలా మంచి ప్రాముఖ్యత ఉంది. నాలుగైదు లుక్స్ ఉన్నాయి. అలాంటి పాత్రలు చాలా అరుదుగా వస్తాయి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ హై బడ్జెట్ సినిమాలు చేస్తుంటుంది. కొత్త కంటెంట్‌కు కూడా ప్రాధాన్యతనిస్తూ ఇలాంటి అద్భుతమైన కంటెంట్ ఉన్న సినిమాలు, గొప్ప బయోపిక్ తీయడం మాకు చాలా ప్రోత్సాహాన్ని ఇచ్చింది. కృతి ప్రసాద్ గారు తొలి సినిమా నిర్మాణంతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్నారు. ఈ విజయం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది.”
అంకిత్ కొయ్య మాట్లాడుతూ.. “ముందుగా గరివిడి లక్ష్మి గారికి కృతజ్ఞతలు. ఆవిడ మరో ప్రోగ్రామ్ చేస్తే చూడాలని ఉంది. డైరెక్టర్ గారు ఈ కథ చెప్పిన వెంటనే నాకు చాలా నచ్చింది. నాకు ఈ అవకాశం ఇచ్చిన డైరెక్టర్ గౌరీకి థాంక్యూ. ఆనంది గరివిడి లక్ష్మి గారి పాత్రలో లీనమైపోయింది. స్క్రీన్‌పై గరివిడి లక్ష్మి గారే కనిపిస్తున్నారు. అలాగే కిషోర్, మయూర్ అందరూ అద్భుతంగా చేశారు. ఇంత గొప్ప సినిమా నిర్మించిన విశ్వప్రసాద్ గారికి, కృతి ప్రసాద్ గారికి ధన్యవాదాలు. ప్రేక్షకులు ఈ సినిమాను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది. ఈ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది.”
దర్శకుడు గౌరీ నాయుడు మాట్లాడుతూ.. “సినిమాను ఇంత గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు, మీడియా మిత్రులకు అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. నాకు చాలా ఎమోషనల్‌గా ఉంది. ప్రేక్షకులకు ఈ జన్మంతా రుణపడి ఉంటాను. విశ్వప్రసాద్ గారు, కృతి ప్రసాద్ గారు గరివిడి లక్ష్మి గారికే కాదు, నాకు, మా టీమ్ అందరికీ ఒక గుర్తింపు ఇచ్చారు. వారికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నాలాంటి టెక్నీషియన్లు బతికారు అంటే దానికి కృతి ప్రసాద్ గారి దయే కారణం. గొప్ప మనసు ఉంది కాబట్టే ఈ కథను సెలెక్ట్ చేశారు. గరివిడి లక్ష్మి గారు నాకు గుర్తింపును తీసుకొచ్చారు. అందరికీ గుర్తింపును ఇచ్చారు. వారికి మేము రుణపడి ఉంటాము. ఆవిడ కథ ఎంత గొప్పదో ఈ ప్రపంచమే చెబుతోంది. ఆనంది గారి పెర్ఫార్మెన్స్ గురించి ఆడియన్స్ గొప్పగా మాట్లాడుకుంటుంటే నిజంగా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నాను. అలాగే నటీనటులందరూ అద్భుతంగా చేశారు. అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. కష్టమొస్తే ఎలా నిలబడాలి, పడిపోయిన తర్వాత ఎలా గెలవాలి అనేది ఈ సినిమా మీకు చెబుతుంది. గరివిడి లక్ష్మి’ సినిమా చూడండి. నచ్చితే మీ ఇంట్లో వాళ్లకు, పక్కింటి వాళ్లకు అందరికీ చెప్పండి. ఇంత అద్భుతమైన విజయం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు.”
మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ మాట్లాడుతూ.. “గరివిడి లక్ష్మి సినిమాను ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. సినిమా చూసిన అందరూ చాలా ఎమోషనల్ అవుతున్నారు. ఈ సినిమాకు మ్యూజిక్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నాకు గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. కృతి ప్రసాద్ గారికి, విశ్వప్రసాద్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఈ సినిమాను ఆదరిస్తున్న అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు చేసుకుంటున్నాను. ఈ వేడుకలో చిత్ర బృందం సభ్యులందరూ పాల్గొన్నారు.