pizza

Krish Jagarlamudi about Ghaati
ఘాటి అనుష్క గారి కెరీర్ లో మరో ఐకానిక్ మూవీ అవుతుంది. లార్జెస్ట్ కాన్వాస్ తో వస్తున్న ఘాటిలో ఆడియన్స్ ఒక కొత్త ప్రపంచాన్ని చూస్తారు: డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి

You are at idlebrain.com > news today >

2 September 2025
Hyderabad

క్వీన్ అనుష్క శెట్టి మోస్ట్ ఎవైటెడ్ యాక్షన్ డ్రామా ఘాటి. విక్రమ్ ప్రభు మేల్ లీడ్ గా నటించిన ఈ చిత్రానికి విజనరీ డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి దర్శకత్వం వహించారు. UV క్రియేషన్స్ సమర్పణలో ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై రాజీవ్ రెడ్డి, సాయి బాబు జాగర్లమూడి నిర్మించారు. ఇప్పటికే అద్భుతమైన ప్రమోషనల్ కంటెంట్ తో సినిమా హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. సెప్టెంబర్ 5న ఈ సినిమా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఈ నేపధ్యంలో డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి విలేకర్ల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

ఘాటి లాంటి అడ్వెంచర్స్ స్క్రిప్టు రాయడానికి మోటివేషన్ ఏమిటి?
-నా ప్రతి సినిమా ఒక అడ్వెంచర్ లాంటిదే. ఘాటి విషయానికొస్తే డాక్టర్ చింతకింద శ్రీనివాసరావు గొప్ప రచయిత. ఆయన రచనలు అద్భుతంగా ఉంటాయి. మా కంపెనీలో 'అరేబియన్ కడలి' వెబ్ సిరీస్ కి కథ మాటలు రాశారు. వేరే కథల గురించి చర్చించుకున్నప్పుడు ఘాటి ఆలోచన చెప్పారు.

-ఆంధ్ర ఒరిస్సా బోర్డర్లో శిలావతి గాంజా రకం పెరుగుతుంది. దానికోసం ఒక వ్యవస్థ పని చేస్తుంటుంది. వాటిని మోయడానికి కొంతమంది కూలీలు ఉంటారు. వారిని ఘాటీలని పిలుస్తారు. వాళ్ళ నేపథ్యం గురించి చెప్పినప్పుడు చాలా ఎక్సైటింగ్ గా అనిపించింది. 30 పేజీల కథగా రాశారు. చాలా నచ్చింది. దాన్ని డెవలప్ చేయడం మొదలు పెట్టాను. లొకేషన్ కోసం తూర్పు కనుమలకు వెళ్లాను. అదంతా ఒక కొత్త ప్రపంచం. జీవన శైలి అంతా కొత్తగా ఉంది. ఒక కొత్త ప్రపంచం, కల్చర్ ని చూపించే ఆస్కారం వుండటంతో ఘాటీ మొదలుపెట్టాం.

ఈ కథ నాయికి ప్రధానంగానే పుట్టిందా?
-నాయికి ప్రధానంగానే గానే పుట్టింది. వేదం తర్వాత స్వీటీ గారితో మరో సినిమా చేయాలని ఆలోచన ఎప్పటినుంచో ఉండేది. సరోజ చాలా గొప్ప పాత్ర. ఆ పాత్రని కొనసాగించాలని ఆలోచన కూడా జరిగింది. అయితే ఆర్గానిక్ గా ఉండే ఒక కథ కోసం ఎదురుచూస్తున్నప్పుడు ఘాటి వచ్చింది. ఇందులో శీలావతి క్యారెక్టర్ అనుష్క గారి గ్రేస్, యాటిట్యూడ్, సూపర్ స్టార్ డమ్ కి పర్ఫెక్ట్ యాప్ట్.

శీలావతి క్యారెక్టర్ ఫిక్షనలా?
అవును. ఘాటి కథ పూర్తిగా ఫిక్షనల్. గంజాయి అనేది ఒక సోషల్ ఇష్యూ. ప్రభుత్వాలు ఉక్కుపాదంతో అణిచివేయాలని ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే అవన్నీ దాటి గంజాయి అనేది సమాజంలోకి వస్తుంది. సర్వైవల్ కోసం చేసినా పర్యవసానాలు చాలా తీవ్రంగా ఉంటాయి. ఐడెంటిటీ, సర్వైవల్ థీమ్స్ తో వస్తున్న సినిమా ఇది.

-సామాజిక సమస్యల మీద ప్రభుత్వాలే కాకుండా పౌరులందరూ పోరాడాలి. ఈ సినిమా కమర్షియల్ యాక్షన్ తో స్వీటీ గారి కోసం చేసిన ఒక బిగ్ స్కేల్ మూవీ. మనందరం ఎదుర్కొంటున్న ఒక సమస్య నిర్మూలనకి ఊతమిస్తుంది కానీ గ్లోరీఫై చేసేలా ఉండదు.

-ఇది చాలా కాంప్లెక్స్ స్టోరీ. చాలా తీవ్రమైన భావోద్వేగాలు ఉంటాయి. ఈ కథని చాలా అందంగా, సినిమాటిక్ గా అన్ని జాగ్రత్తలు తీసుకుని చెప్పడం జరిగింది.

ఈ కథని యాక్షన్ జానర్ లో చెప్పడానికి కారణం?
-ఘాటి కథని యాక్షన్ తో చెబితేనే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితులు అలాంటివి. చాలా తీవ్రమైన పాత్రలు, చాలా తీవ్రమైన భావోద్వేగాలతో ఉంటాయి. యాక్షన్ సీక్వెన్స్ లో ఆ ఎమోషన్ కనిపిస్తుంది. ఎమోషన్స్, పెర్ఫార్మెన్స్, లొకేషన్స్ పరంగా లార్జెస్ట్ కాన్వాస్ ఉన్న సినిమా ఇది.

విక్రమ్ ప్రభు గారిని తీసుకోవడానికి కారణం?
దేశిరాజు క్యారెక్టర్ ని రాస్తున్నప్పుడే విక్రమ్ ప్రభు గారిని ఊహించుకున్నాను. ఆయన ఫిల్మోగ్రఫీ అంతా చూశాను. ఈ క్యారెక్టర్ కి ఆయన పర్ఫెక్ట్ . దేశి రాజు చాలా స్వచ్ఛమైన క్యారెక్టర్. ఒక సమూహానికి నాయకుడు లాంటి పాత్ర. అద్భుతంగా నటించారు.

చైతన్యరావుని విలన్ పాత్రలోకి తీసుకోవడానికి కారణం?
-ఇందులో కుందుల నాయుడు అనే క్యారెక్టర్ ఉంది. తను చేసిన 30 వెడ్స్ 20 వెబ్ సిరీస్ చూశాను. అలాంటి క్యారెక్టర్ ఒక విలన్ రోల్ చేస్తే కొత్తగా వుంటుంది. ఆయనకి కథ చెప్తున్నప్పుడే ఆ క్యారెక్టర్ లో బిహేవ్ చేయడం మొదలుపెట్టారు. నేను కోరుకుంటున్నా క్యారెక్టర్ స్పార్క్ ఆయనలో కనిపించింది. ట్రైలర్ లో మీరు చూసింది జస్ట్ ఓ రెండు మెతుకులు మాత్రమే. పూర్తి విందు భోజనం సినిమాలో ఉంటుంది.

-అలాగే కాష్టాలు నాయుడు క్యారెక్టర్ లో రవీంద్ర విజయ్ కూడా అద్భుతంగా నటించారు. ఆ పాత్ర కూడా చాలా కొత్తగా ఉంటుంది. ఇందులో రాజసుందరం మాస్టర్ కూడా ఒక క్యారెక్టర్ చేశారు. అది చాలా సర్ప్రైజింగ్ గా ఉంటుంది

డిఓపి, మ్యూజిక్ గురించి?
-డీవోపీగా మనోజ్ ని తీసుకోవడం జరిగింది. తూర్పు కనుమల్లోకి వెళ్లి చూసిన తర్వాత ఒక అద్భుతమైన ప్రకృతి సౌందర్యం కనిపించింది. ఆ బ్యూటీని క్యాప్చర్ చేయడం కీలకం. ఆ పర్వత శ్రేణుల మధ్య కథ చెప్తున్నాను కాబట్టి ఆ ఆత్మని స్క్రీన్ పైకి తీసుకురావాలి. ఆయన అద్భుతంగా ఆ పర్వత శ్రేణి ప్రకృతి సౌందర్యాన్ని క్యాప్చర్ చేశారు.

-మ్యూజిక్ డైరెక్టర్ సాగర్ నాకు కీరవాణి గారి దగ్గర పరిచయం. నేను చేసిన చాలా యాడ్స్ కి మ్యూజిక్ చేశారు. ఆయన ప్రతిభ నాకు తెలుసు. ఈ సినిమాకి ఒక కొత్త ఫ్యుజన్ మ్యూజిక్ కావాలి. ఆ కొండలకి నిజంగా ఒక మ్యూజికల్ లాంగ్వేజ్ ఉంటే దాన్ని క్యాప్చర్ చేయగలగాలి. సాగర్ అప్రోచ్ చాలా ఇన్నోవేటివ్ గా ఉంటుంది. ఆడియన్స్ చాలా కొత్త రకమైన సౌండ్ ని ఎక్స్పీరియన్స్ చేస్తారు.

ఈస్ట్రన్ ఘాట్స్ లో షూట్ చేయడం ఎలాంటి అనుభూతిని ఇచ్చింది?
-ఈస్టర్న్ ఘాట్స్ చాలా పొందికగా అందంగా ఉంటాయి. అందులో పిక్ ప్లేస్ కి వెళ్ళాము. చాలా ఎక్స్ట్రార్డినరీ లొకేషన్స్ చూడబోతున్నారు. ఫస్ట్ టైం అక్కడ షూట్ చేయడం జరిగింది. ఒక కొండమీదకి వెళ్లి ఇంకో కొండని షూట్ చేశాం. ఈ విషయంలో అనుష్క గారికి, విక్రమ్ ప్రభు గారికి థాంక్స్ చెప్పాలి. చాలా సపోర్ట్ చేశారు. సూర్యోదయాలు సూర్యాస్తమయాలు అక్కడ చాలా అద్భుతంగా ఉంటాయి. చాలా సహజసిద్ధంగా వాటిని బంధించాం.

సాయి మాధవ్ గారి మాటలు గురించి?
-సాయి మాధవ్ గారు ఒక విస్తృతమైన విషయాన్ని చాలా అందంగా రాసేస్తారు. ఆయన మాట సూటిగా వుంటాయి. ఘాటిలో మాటలు కూడా ప్రేక్షకుల మనసుని సూటిగా తాకుతాయి.

-ఇందులో మూడు పాటలు రాశాను. స్వేచ్ఛ పథకాలన్నీ ఒకప్పటి బందీలే, సందేశాలన్నీ తప్పుల నుంచి నేర్చిన పాఠాలే.. అనే పల్లవి రాశాను. అది సాయి మాధవ్ గారికి నచ్చి దాని డైలాగ్ గా మార్చారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి దగ్గర చేసిన శిష్యరికం వల్ల ఆయన ఆశీర్వాదం వల్ల కలం విదిలించా(నవ్వుతూ)

నిర్మాతల సపోర్ట్ గురించి?
-రాజీవ్ రెడ్డి గారు, సాయిబాబా జాగర్లమూడి గారు, యువీ క్రియేషన్స్ విక్కీ వంశీ ప్రమోద్.. చాలా కొత్త సినిమాలు చెప్పాలని ప్రయత్నం చేస్తుంటారు. ఈ సినిమాని చాలా పాషన్ తో చేశారు.

-అనుష్క గారి బలం ఏంటో మనందరికీ తెలుసు. స్వీటీ సినిమా బాగుంటే ఆ రేంజ్ ఎలా ఉంటుందో చాలా సినిమాలు ప్రూవ్ చేశాయి. అరుంధతి నుంచి భాగమతి వరకు ఎన్నో ఐకానిక్ పెర్ఫార్మెన్స్ లు ఇచ్చారు. ఘాటిలో తనకి చాలా ఎక్సైటింగ్ క్యారెక్టర్ దొరికింది. మేమంతా బిలీవ్ చేసి ఈ ప్రాజెక్టుని ఎక్కడ రాజీ పడకుండా నిర్మించారు. బిజినెస్ చాలా బావుంది. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాం.

కొత్త ప్రాజెక్ట్స్ గురించి?
ఘాటీ రిలీజ్ తర్వాత కొత్త ప్రాజెక్ట్స్ గురించి తెలియజేస్తాం.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved