pizza

Everyone Who Watched ‘G.O.A.T’ Is Praising the Film as Wonderful: Producer Mogulla Chandrasekhar at Success Meet
గోట్’ మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అద్బుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు - సక్సెస్ మీట్‌లో నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్

You are at idlebrain.com > news today >

14 Novembar 2026
Hyderabad

‘G.O.A.T’, starring Sudigali Sudheer in the lead role, is directed by Vedavyas and produced by Mogulla Chandrasekhar under the banners of Jaishnava Productions and Mahateja Creations, with Ravinder Reddy as co-producer. Nithin Prasanna and Divya Bharathi play pivotal roles in the film.

Released on November 12, the film is heading towards blockbuster success. The team organised a success meet on Saturday to celebrate the positive response. Speaking at the event:

Producer Mogulla Chandrasekhar said, “Our journey has been three years long, and everyone knows about the challenges we faced along the way. The story truly came to life after Vedavyas garu came on board. We made this film with a strong message. Everyone who has watched the movie is praising it as wonderful. Despite facing numerous challenges, I stood firm and brought the film to this stage without giving up. I even plan to make a film about the struggles I faced during this journey. Divya Bharathi garu extended tremendous support throughout this journey. I thank the audience for showering love on our film.”

Divya Bharathi said, “Audiences are thoroughly enjoying ‘G.O.A.T’ in theatres and showering me with immense love. Their reactions have made us realise that all the hard work we put into this film has paid off. We are extremely satisfied with the audience response, and I am very happy with the appreciation the film is receiving. My heartfelt thanks to producer Chandrasekhar garu for standing strong without giving up, and to Vedavyas garu for standing by us and supporting the project.”

Director Vedavyas said, “‘G.O.A.T’ is receiving an extraordinary response in theatres. I thoroughly enjoyed watching the audience reactions. My thanks to the media and audiences for supporting us. I am grateful to everyone who worked on this film. This success belongs to every single person associated with the project. Betting can be fun, but one should never cross the line. I tried to convey this point in an entertaining manner through the film. I would consider it a success if even one person gives up betting after watching this movie.”

Nithin Prasanna said, “‘G.O.A.T’ is receiving a good response, and theatres are witnessing full houses. Audiences are thoroughly enjoying the film. Vedavyas garu narrated the story to us brilliantly and has delivered a strong message through this film.”

Master Murari said, “Our director and producer had already told me that my character would receive such a wonderful response, and exactly that has happened. I will continue striving to entertain audiences in the same way with my upcoming projects.”

గోట్’ మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అద్బుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు - సక్సెస్ మీట్‌లో నిర్మాత మొగుళ్ల చంద్రశేఖర్

 

జైష్ణవ్ ప్రొడక్షన్స్, మహతేజ క్రియేషన్స్ బ్యానర్ల మీద మొగుళ్ల చంద్రశేఖర్ నిర్మాతగా, రవిందర్ రెడ్డి సహ నిర్మాణంలో సుడిగాలి సుధీర్ హీరోగా వేదవ్యాస్ తెరకెక్కించిన చిత్రం ‘గోట్’. ఈ సినిమాలో నితిన్ ప్రసన్న, దివ్య భారతి కీలక పాత్రలను పోషించారు. ఈ సినిమా నవంబర్ 12న విడుదలై బ్లాక్ బస్టర్‌ దిశగా దూసుకుపోతోంది. ఈ క్రమంలో శనివారం నాడు సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో..

నిర్మాత చంద్రశేఖర్ మాట్లాడుతూ .. ‘‘మాది మూడేళ్ల ప్రయాణం. ఈ జర్నీలో మాకు ఎదురైన సవాళ్ల గురించి అందరికీ తెలుసు. వేద వ్యాస్ గారు ఎంట్రీ ఇచ్చాకే ఈ కథకు ప్రాణం వచ్చింది. మంచి మెసెజ్ ఇచ్చేలా సినిమాని రూపొందించాం. మూవీని చూసిన ప్రతీ ఒక్కరూ అద్బుతంగా ఉందని మెచ్చుకుంటున్నారు. ఎన్ని సవాళ్లు ఎదురైనా కూడా పట్టు వీడకుండా చివరి వరకు నిలబడి సినిమాను ఇక్కడి వరకు తీసుకు వచ్చాను. నేను ఈ సినిమా జర్నీలో పడిన కష్టాల్ని ఓ చిత్రంగా తీస్తాను. నాకు ఈ జర్నీలో దివ్య భారతి గారు ఎంతో సహకరించారు. మా సినిమాని ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్’ అని అన్నారు.

దివ్య భారతి మాట్లాడుతూ .. ‘‘గోట్’ మూవీని ఆడియెన్స్ థియేటర్లో చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. నా మీద అంతులేని ప్రేమను కురిపిస్తున్నారు. మేం ఈ చిత్రం కోసం పడిన కష్టం వృథా కాలేదని ఆడియెన్స్ రియాక్షన్స్ చూస్తే అర్థమైంది. ప్రేక్షకుల స్పందన చూసి మాకు సంతృప్తి కలిగింది. ‘గోట్’ చిత్రానికి వస్తున్న స్పందన చూస్తుంటే నాకెంతో సంతోషంగా ఉంది. పట్టు వదలకుండా నిలబడిన మా నిర్మాత చంద్రశేఖర్ గారికి ధన్యవాదాలు. మాకు అండగా నిలబడిన వేద వ్యాస్ గారికి థాంక్స్’ అని అన్నారు.

దర్శకుడు వేద వ్యాస్ మాట్లాడుతూ .. ‘‘గోట్’ సినిమాకి థియేటర్లో అద్భుతమైన స్పందన వస్తోంది. అక్కడ ఆడియెన్స్ రియాక్షన్స్ చూసి నేను ఎంతో ఎంజాయ్ చేశాను. మాకు సపోర్ట్ చేస్తున్న మీడియా, ఆడియెన్స్‌కి థాంక్స్. ఈ మూవీకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఈ సక్సెస్ ప్రతీ ఒక్కరికీ చెందుతుంది. బెట్టింగ్ అనేది ఫన్. కానీ లైన్ క్రాస్ చేయకూడదు. ఆ పాయింట్‌ని నేను కాస్త వినోదాత్మకంగా చెప్పే ప్రయత్నం చేశాను. ఈ సినిమాని చూసి బెట్టింగ్ ఒక్కడు ఆపినా చాలు’ అని అన్నారు.

నితిన్ ప్రసన్న మాట్లాడుతూ .. ‘‘గోట్’ సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తోంది. థియేటర్లు అన్నీ ఫుల్ అవుతున్నాయి. ఆడియెన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. వేదవ్యాస్ గారు కథను మాకు అద్భుతంగా నెరేట్ చేశారు. వేద వ్యాస్ గారు ఈ చిత్రంతో మంచి సందేశాన్ని ఇచ్చారు’ అని అన్నారు.

మాస్టర్ మురారి మాట్లాడుతూ ..‘నా పాత్రకు ఇలాంటి అద్భుతమైన స్పందన వస్తుందని మా దర్శక, నిర్మాతలు ముందే చెప్పారు. వారు చెప్పినట్టుగానే జరిగింది. ఇంకా మున్ముందు ఇలానే అందరినీ ఎంటర్టైన్ చేసేందుకు ప్రయత్నిస్తుంటాను’ అని అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved