ర్యాడిక్స్ సినిమాస్ బ్యానర్ తమ సంస్థలో కొత్త చిత్రాన్ని నిర్మిస్తోంది. విజయకృష్ణ లింగమనేని ప్రెజెంట్ చేస్తున్న ఈ సినిమా టైటిల్ ను ఈ రోజు మేకర్స్ అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి "గోల్డ్ స్పాట్" టైటిల్ ఖరారు చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ప్రొడ్యూసర్ రవితేజ పచ్చిపాల నిర్మిస్తున్న ఈ చిత్రంలో అభిషేక్, కాజల్ చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు. "అంబాజీపేట మ్యారేజి బ్యాండు" చిత్రంతో దర్శకుడిగా మంచి గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు దుష్యంత్ కటికనేని ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తున్నారు. శ్రీ చౌదరి ఇనగంటి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
దుష్యంత్ దగ్గర వర్క్ చేసిన వేణు కార్తికేయన్ "గోల్డ్ స్పాట్" సినిమాతో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ లో పిల్లలంతా ఆడుకుంటూ ఒక పెద్ద చెట్టు దగ్గరకి వెళ్లడం, అటువైపు నుంచి పెద్దవాళ్లుగా అంతే సంతోషంగా తిరిగి రావడం చూపించారు. బాల్య స్నేహితులు పెద్దయ్యాక తాము ఆటపాటలతో సంతోషంగా గడిపిన ప్రదేశాలను, ఆ బాల్యాన్ని గుర్తు చేసుకుంటున్నట్లుగా డిజైన్ చేసిన ఈ పోస్టర్ నోస్టాల్జిక్ ఫీల్ కలిగిస్తూ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మేకర్స్ త్వరలో వెల్లడించనున్నారు.
నటీనటులు - అభిషేక్, కాజల్ చౌదరి, తదితరులు
టెక్నీషియన్స్
స్టంట్స్ - ఎం.హరికృష్ణ
కాస్ట్యూమ్ డిజైనర్ - పొలసాని శ్రీ సింధు
సౌండ్ డిజైన్ - సాయి మణీందర్ రెడ్డి
ఎడిటర్ - నరేష్ అడుపా
ప్రొడక్షన్ డిజైనర్ - పవన్ కల్యాణ్ యల్లపు
డీవోపీ - మహీ రెడ్డి
మ్యూజిక్ - నరేన్ రెడ్డి
కో ప్రొడ్యూసర్ - శ్రీ చౌదరి ఇనగంటి
సమర్పణ - విజయ్ కృష్ణ లింగమనేని
ప్రొడ్యూసర్ - రవితేజ పచ్చిపాల
స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ - దుష్యంత్ కటికనేని
డైరెక్షన్ - వేణు కార్తికేయన్