pizza

Gurthukosthunnayi Success Meet
‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు - సక్సెస్ మీట్‌లో నిర్మాత శరత్ చంద్ర నాయుడు

You are at idlebrain.com > news today >

04 July 2026
Hyderabad

విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు జంటగా శరత్ చంద్ర నాయుడు నిర్మించిన సిరీస్ ‘గుర్తుకొస్తున్నాయి’. ఈ సిరీస్‌ను వినోద్ గాలి తెరకెక్కించారు. రోహిణి హట్టంగడి, శివ నారాయణ నరిపెద్ది, ప్రియదర్శిని రామ్, గోపరాజు రమణ, వివా రాఘవ, పవన్ సిద్దు, గోదావరి గోపి, అనీష్ కురువిల్లా, మేఘన సునీల్, గఫూర్, మధు స్టీవ్, రామ్ చరణ్, చక్రి, సైమన్ తదితరులు ఈ సిరీస్‌లో ముఖ్య పాత్రలను పోషించారు. ఈ సిరీస్ ప్రస్తుతం ఈటీవీ విన్‌లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోంది. ఈ క్రమంలో విజయోత్సవ వేడుకను నిర్వహించారు. ఈ మేరకు నిర్వహించిన సక్సెస్ మీట్‌‌లో..

విరాజ్ అశ్విన్ మాట్లాడుతూ .. ‘‘నేను కొత్తగా ప్రయత్నించిన ప్రతీ సారి తెలుగు ఆడియెన్స్ నన్ను సపోర్ట్ చేస్తూనే ఉన్నారు. ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్‌కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో అని చాలా భయపడ్డాను. కానీ సిరీస్ బయటకు వచ్చాక.. అందరూ ఫోన్స్ చేసి ప్రశంసిస్తున్నారు. నవ్వాం, ఏడ్చాం.. ఇలాంటి పాత్రను చేసినందుకు థాంక్స్ అని నాతో చెప్పి పొగుడుతున్నారు. మాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మాకు అండగా నిలిచిన బాపినీడు గారికి థాంక్స్. శరత్ గారు ఈ ప్రాజెక్ట్‌ని ఇష్టపడి కాదు, ప్రేమించి చేశారు. ఆయనకు ఇదొక గొప్ప ఆరంభం. వినోద్ గారు ఈ సిరీస్ కోసం దాదాపు రెండేళ్లు కష్టపడ్డారు. సాయి గారు, భరణ్ గారు మాకు ఎంతో సపోర్ట్ చేశారు. రాజశేఖర్ మంచి కథను మాకు ఇచ్చారు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన సిద్దు, గోపీ, రాఘవ్‌లకు థాంక్స్. యశశ్రీ మాకు చాలా సపోర్ట్ చేశారు. చైల్డ్ ఆర్టిస్ట్స్ అందరూ అద్భుతంగా నటించారు. ఎడిటర్ శ్రీధర్ గారు మా సిరీస్‌ను ఇష్టపడ్డారు కాబట్టే ఇంత గొప్పగా ఎడిట్ చేశారు. అజయ్ గారు ఉంటే మ్యూజిక్ పరంగా నేను కాన్ఫిడెంట్‌గా ఉంటాను. మంచి పాటను ఇచ్చిన సుహాస్ గారికి థాంక్స్. మా సిరీస్ ఫ్యామిలీ అందరికీ నచ్చేస్తోంది. మా సిరీస్‌ను సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.

నిర్మాత శరత్ చంద్ర నాయుడు మాట్లాడుతూ .. ‘‘ఏడాదిన్నర పాటుగా ఈ ‘గుర్తుకొస్తున్నాయి’ మా నిద్రలేని రాత్రుల్లో, మా చర్చల్లో ఉంది. కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరి గుండెల్లో ఉంది. చూసిన ప్రతీ ఒక్కరూ ప్రశంసిస్తున్నారు. చాలా ఏళ్ల తరువాత ఓ మంచి సిరీస్ చూశామని అంటున్నారు. వినోద్ నాకు సొంత బ్రదర్‌లాంటి వాడు. రాజశేఖర్ ఈ కథను అద్భుతంగా రాశారు. మాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన కాస్ట్ అండ్ క్రూ అందరికీ థాంక్స్. విరాజ్ పర్ఫామెన్స్ సిరీస్‌ను నిలబెట్టేసింది. చివరి రెండు ఎపిసోడ్స్ గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటున్నారు. యశశ్రీ మాకెంతో సపోర్ట్ చేశారు. ఎడిటర్ శ్రీధర్ సిరీస్‌కి మంచి షేప్ తీసుకు వచ్చారు. అజయ్ గారు పన్నెండేళ్ల క్రితం చేసిన ఓ పాటను లూప్‌లో వినేవాడ్ని. ఆయన అద్భుతమైన సంగీత దర్శకుడు. సుహాస్ మంచి లవ్ సాంగ్ ఇచ్చాడు. నేను ఈ ఇండస్ట్రీలోకి వచ్చి 13 ఏళ్లు అయింది. ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. అల్లు అర్జున్ గారు సిరీస్ చూసి ట్వీట్ వేశారు. ఈనాడు పేపర్‌లోనే నా ఫస్ట్ ఇంటర్వ్యూ వచ్చింది. అదే ఇండస్ట్రీలోకి రావడానికి కారణమైంది. ఇప్పుడు ఈటీవి విన్‌లోనే నా మొదటి ప్రాజెక్ట్ చేయడం ఆనందంగా ఉంది. బాపినీడు గారు ఈ సిరీస్ హిట్ అవుతుందని ముందే నమ్మారు. మాకు సపోర్ట్ చేస్తున్న ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.

ఈటీవీ వైస్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ మాట్లాడుతూ .. ‘‘90స్’ సిరీస్‌తో మా ఈటీవీ విన్‌ గతిని తెలుగు ప్రేక్షకులు మార్చేశారు. ‘గుర్తుకొస్తున్నాయి’.. గుర్తు చేస్తుంది, గుర్తుండిపోతుంది. ఇంతలా ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్. తక్కువ టైంలో మ్యాజిక్ చేసిన శ్రీధర్, అజయ్ గారికి థాంక్స్. మా ‘లిటిల్ హార్ట్స్’కి, ‘గుర్తుకొస్తున్నాయి’కి అల్లు అర్జున్ గారు సపోర్ట్ చేశారు. మా ఈటీవీ విన్‌కి ఈ ‘గుర్తుకొస్తున్నాయి’ ఓ తలమానికం’ అని అన్నారు.

ఈటీవి విన్ కంటెంట్ హెడ్ భరణ్ మాట్లాడుతూ .. ‘మా ఈటీవీ విన్‌ను సపోర్ట్ చేస్తున్న తెలుగు ప్రేక్షకులకు థాంక్స్. మంచి సిరీస్ చేసిన ప్రతీ సారి అభినందిస్తూనే ఉన్నారు. మా ‘గుర్తుకొస్తున్నాయి’ అలా అందరికీ ఎప్పుడూ గుర్తుండిపోతుంది’ అని అన్నారు.

దర్శకుడు వినోద్ గాలి మాట్లాడుతూ .. ‘‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్‌ని నాకు ఇచ్చిన శరత్ గారికి, నితిన్ గారికి, భరణ్ గారికి, సాయి గారికి థాంక్స్. శరత్ అన్న నాకు సొంత బ్రదర్ లాంటివారు. నా టెక్నికల్ టీం అయిన రెహాన్, వెంకీ, అజయ్, శ్రీధర్‌లకు థాంక్స్. లవ్ సాంగ్ ఇచ్చిన సుహాస్ గారికి థాంక్స్. అజయ్ గారు తన మ్యూజిక్‌తో సిరీస్‌ను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లారు. నాకు ఈ జర్నీలో సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. విరాజ్ గారి డెడికేషన్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటుంది. యశశ్రీ చాలా బాగా కష్టపడ్డారు. మిక్సింగ్‌లో సంతోష్ తన టాలెంట్ చూపించారు. ప్రమదేష్‌కి ఇది మొదటి ప్రాజెక్ట్. మాకు సపోర్ట్ చేసిన బాపినీడు గారికి థాంక్స్. మా సిరీస్‌ను ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

యశశ్రీ మాట్లాడుతూ .. ‘‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్‌ను ఇంత పెద్ద హిట్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్. నాకు ఈ సిరీస్‌లో అవకాశం ఇచ్చిన శరత్ గారికి, వినోద్ గారికి థాంక్స్. పిల్లలంతా అద్భుతంగా నటించారు. విరాజ్‌తో నటించడం ఆనందంగా ఉంది’ అని అన్నారు.

క్రియేటివ్ ప్రొడ్యూసర్ ప్రమదేష్ మాట్లాడుతూ ..‘నాకు ఈ అవకావం ఇచ్చిన సాయి గారికి థాంక్స్. వినోద్ గారు, శరత్ గారు, రాజ శేఖర్ రావడంతో మా ప్రాజెక్ట్ హిట్ అని భావించాను. ఇది బ్లాక్ బస్టర్ అవుతుందని నేను ముందే నమ్మాను. ఎడిటర్ శ్రీధర్ కూడా ఈ సిరీస్ బిగ్గెస్ట్ హిట్ అవుతుందని ముందే అన్నారు. ఈ సిరీస్‌ను సక్సెస్ చేసిన అందరికీ థాంక్స్’ అని అన్నారు.

రైటర్ రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ .. ‘‘గుర్తుకొస్తున్నాయి’ జర్నీ 18 నెలల క్రితం ప్రారంభమైంది. సాయి గారు నాకు ఓ దారి చూపించారు. నితిన్ అన్న, వినోద్, శరత్ చంద్ర గారు ఈ జర్నీలో సపోర్ట్ చేశారు. కోర్ టీం నెరేషన్ జరిగినప్పుడే బాపీనాడు గారు ఈ సిరీస్ బ్లాక్ బస్టర్ అని చెప్పేశారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ మాట్లాడుతూ .. ‘‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్‌కి మంచి సక్సెస్ వచ్చింది. వినోద్ గారి పర్సనల్ ఎక్స్‌పీరియెన్స్‌ను ఈ సిరీస్‌లో వాడారు (నవ్వుతూ). శరత్ చంద్ర గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. ‘శ్రీరంగనీతులు’ తర్వాత మళ్లీ విరాజ్‌తో కలిసి పని చేశాను. ఈ సిరీస్‌ను సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

ఈ వయసే సాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ సుహాస్ మాట్లాడుతూ .. ‘ఏడాది క్రితమే ఈ పాటను చేశాను. ఈ పాట హిట్ అవుతుందని ఏడాది పాటుగా కాపాడుతూ వచ్చారు. నాకు ఈ అవకాశం ఇచ్చిన నితిన్ గారికి, మిగిలిన టీం అందరికీ థాంక్స్’ అని అన్నారు.

నటుడు వైవా రాఘవ్ మాట్లాడుతూ .. ‘రాజశేఖర్ గారు ‘గుర్తుకొస్తున్నాయి’ కథను నాకు చెప్పారు. అప్పుడే ఈ సక్సెస్‌ను ఊహించాను. షూటింగ్ టైంలోనూ పండుగలా అనిపించింది. నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన శరత్ చంద్ర గారికి, వినోద్ గారికి, నాకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

నటుడు పవన్ సిద్దు మాట్లాడుతూ .. ‘మా సిరీస్ సక్సెస్ మీట్‌కు వచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ‘శశి మథనం’ తర్వాత వినోద్ ఈ కథను రాస్తున్నాడని నాకు తెలుసు. ఇది ఇంత పెద్ద విజయం సాధిస్తుందని అప్పుడే నాకు తెలుసు. మాకు ఇంతలా సపోర్ట్ చేస్తున్న ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

కెమెరామెన్ రెహాన్ షేక్ మాట్లాడుతూ .. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. ఆర్టిస్టులంతా నాకు సపోర్ట్ చేశారు. వినోద్‌తో నాకు ఐదారేళ్ల నుంచి అనుబంధం ఉంది. మా సిరీస్‌ను ఇంత సక్సెస్ చేసిన ఆడియెన్స్‌కి థాంక్స్’ అని అన్నారు.

ఎడిటర్ శ్రీధర్ మాట్లాడుతూ .. ‘‘మా ‘గుర్తుకొస్తున్నాయి’ సిరీస్‌కి ఒక్క నెగెటివ్ కామెంట్, నెగెటివ్ రివ్యూ కనిపించడం లేదు. మా సిరీస్‌ను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్’ అని అన్నారు.

తారాగణం:
విరాజ్ అశ్విన్, యశశ్రీ రావు, రోహిణి హట్టంగడి, శివ నారాయణ నరిపెద్ది, ప్రియదర్శిని రామ్, గోపరాజు రమణ, వివా రాఘవ, పవన్ సిద్దు, గోదావరి గోపి, అనీష్ కురువిల్లా, మేఘన సునీల్, గఫూర్, మధు స్టీవ్, రామ్ చరణ్, చక్రి, సైమన్ తదితరులు

సాంకేతిక సిబ్బంది
కథ & దర్శకత్వం : వినోద్ గాలి
నిర్మాత: శరత్ చంద్ర నాయుడు
రచయిత: రాజశేఖర్ రెడ్డి బద్దం
క్రియేటివ్ ప్రొడ్యూసర్: ప్రమదేష్ వి
DOP: రెహాన్ షేక్
సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్: అజయ్ అరసాడ
సంగీతం: సుహాస్
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మనీష్ పల్లె
ఎడిటర్స్ : శ్రీధర్ సోంపల్లి & వెంకటేష్ చుండూరు
ప్రొడక్షన్ డిజైనర్: శివ కుమార్ మచ్చ
కాస్ట్యూమ్ డిజైనర్: రక్షిత మణివన్నన్
కొరియోగ్రాఫర్: ఈశ్వర్ పెంటి
అడిషనల్ రైటర్ : వికాస్ తిప్పని
ప్రోమోలు, టీజర్ & ట్రైలర్: సుధన్
పబ్లిసిటీ డిజైనర్: నన్నం సాయి తేజ

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved