pizza

Bellamkonda Sai Sreenivas, Ludheer Byreddy, Mahesh Chandu, Shiven Ramakrishna, Moonshine Pictures Pan India Film Haindava Power-Packed Mystically Thrilling Teaser Unveiled, Theatrical Release On November 27
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, లుధీర్ బైరెడ్డి, మహేష్ చందు, శివన్ రామకృష్ణ, మూన్‌షైన్ పిక్చర్స్ పాన్ ఇండియా ఫిల్మ్ హైందవ పవర్ ప్యాక్డ్ డివైన్ థ్రిల్లింగ్ టీజర్ లాంచ్- నవంబర్ 27న థియేట్రికల్ రిలీజ్

You are at idlebrain.com > news today >

13 October 2026
Hyderabad

Following the blockbuster success of Kishkindhapuri, Action-Hulk Bellamkonda Sai Sreenivas is all set to enthral audiences with an intriguing thriller, Haindava. Directed by debutant Ludheer Byreddy and produced by Mahesh Chandu under the Moonshine Pictures banner, the occult thriller is nearing completion with its production, while the post-production work progressing simultaneously. The makers have kick-started the film’s promotional activities by unveiling its teaser today.

Set in the village of Rangapuram, the story takes a mysterious turn when all the idols from an ancient temple go missing and a villager is found murdered. Adding another fascinating layer to the mystery, the temple priest believes that all the idols will return within a stipulated timeframe. An atheist police officer is assigned to investigate the unusual case, setting the stage for a compelling clash between faith, reason, and the unexplained.

Director Ludheer Byreddy appears to have crafted an engaging narrative that seamlessly blends mystical, devotional, and action-driven elements. The teaser maintains an intriguing atmosphere throughout, gradually building suspense and leaving audiences curious about the secrets hidden behind the mysterious events in Rangapuram.

Bellamkonda Sai Sreenivas makes a powerful impression as an atheist police officer who places his faith in humanity rather than God. His commanding screen presence and authoritative portrayal add intensity to the character, while his action-packed performance promises to be one of the film’s major attractions. Samyuktha plays the female lead, while Mahesh Manjrekar appears in a pivotal role as the temple priest. Saurabh Sachdeva, JD Chakravarthy, Shivaji Raja, and Getup Srinu feature in other significant roles.

The technical departments further strengthen the film’s atmospheric appeal. Production designer Siva Kamesh D creates a mystical world that complements the film’s occult backdrop, while cinematographer Harish Kannan enhances the narrative with striking visuals. Music director Sam CS elevates the tension and mystery with his intense background score. Karthika Srinivas R handles the editing, and the production values appear rich and impressive.

With its captivating premise, atmospheric visuals, powerful performances, and suspense-laden presentation, Haindava teaser raises expectations for the film. The makers have also announced that the movie will arrive in theatres on November 27th.

Cast: Bellamkonda Sai Sreenivas, Samyuktha, Mahesh Manjrekar, Saurabh Sachdeva, JD Chakravarthy, Shivaji Raja, and Getup Srinu

Technical Crew:
Writer, Director: Ludheer Byreddy
Producer: Mahesh Chandu
Banner: Moonshine Pictures
Presents: Shiven Ramakrishna
DOP: Harish Kannan
Music: Sam CS
Editor: Karthika Srinivas R
Production Designer: Siva Kamesh D
Publicity Designer: Ananth Kancherla

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, లుధీర్ బైరెడ్డి, మహేష్ చందు, శివన్ రామకృష్ణ, మూన్‌షైన్ పిక్చర్స్ పాన్ ఇండియా ఫిల్మ్ హైందవ పవర్ ప్యాక్డ్ డివైన్ థ్రిల్లింగ్ టీజర్ లాంచ్- నవంబర్ 27న థియేట్రికల్ రిలీజ్

‘కిష్కింధపురి’ బ్లాక్‌బస్టర్ విజయంతో జోరు మీదున్న యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆకల్ట్ థ్రిల్లర్ ‘హైందవ’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు చిత్రీకరణ ముగింపు దశకు చేరుకోగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిత్ర ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిన మేకర్స్, ఈరోజు పవర్‌ఫుల్ టీజర్‌ను లాంచ్ చేశారు.

రంగాపురం అనే గ్రామం నేపథ్యంలో ఈ కథ సాగుతుంది. అక్కడి పురాతన ఆలయంలోని విగ్రహాలన్నీ ఒక్కసారిగా మాయమవడం, అదే సమయంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి హత్యకు గురవడంతో కథలో మిస్టరీ మొదలవుతుంది. ఈ రహస్యానికి మరో ఆసక్తికరమైన కోణాన్ని జోడిస్తూ, నిర్ణీత గడువులోగా ఆలయంలోని విగ్రహాలన్నీ తిరిగి వస్తాయని ఆలయ పూజారి నమ్ముతాడు. ఈ వింత ఘటనపై దర్యాప్తు చేసేందుకు దేవుడిపై నమ్మకం లేని ఓ పోలీస్ అధికారిని నియమిస్తారు. దీంతో విశ్వాసం, హేతుబద్ధమైన ఆలోచన, అంతుచిక్కని రహస్యాల మధ్య ఆసక్తికరమైన సంఘర్షణకు తెరలేస్తుంది.

మిస్టికల్, భక్తి, యాక్షన్ అంశాలను సమన్వయం చేస్తూ దర్శకుడు లుధీర్ బైరెడ్డి ఆసక్తికరమైన కథనాన్ని రూపొందించారు. ఆద్యంతం ఉత్కంఠభరితమైన వాతావరణాన్ని కొనసాగిస్తూ, రంగాపురంలో చోటుచేసుకుంటున్న రహస్య ఘటనల వెనుక ఉన్న అసలు నిజాలేమిటనే ఆసక్తిని ప్రేక్షకుల్లో పెంచేలా టీజర్‌ను కట్ చేశారు.

దేవుడికంటే మానవత్వంపై నమ్మకం ఉంచే పోలీస్ అధికారిగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ పవర్‌ఫుల్‌గా కనిపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, పాత్రను ఆవిష్కరించిన తీరు కథకు మరింత ఇంటెన్స్ తీసుకొచ్చాయి. యాక్షన్‌తో కూడిన ఆయన నటన ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణల్లో ఒకటిగా నిలవనుంది. సంయుక్త కథానాయికగా నటిస్తుండగా, ఆలయ పూజారి పాత్రలో మహేష్ మంజ్రేకర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సౌరభ్ సచ్‌దేవా, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా, గెటప్ శ్రీను ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించారు.

ప్రొడక్షన్ డిజైనర్ శివ కామేష్ డి, ఆకల్ట్ నేపథ్యానికి తగిన మిస్టికల్ ప్రపంచాన్ని సృష్టించారు. సినిమాటోగ్రాఫర్ హరీష్ కన్నన్ తన అద్భుతమైన విజువల్స్‌తో కథనానికి ప్రత్యేక ఆకర్షణను తీసుకొచ్చారు. సంగీత దర్శకుడు సామ్ సీఎస్ తన ఇంటెన్స్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో ఉత్కంఠను, మిస్టరీని మరింత ఎలివేట్ చేశారు. కార్తిక శ్రీనివాస్ ఆర్ ఎడిటింగ్ షార్ఫ్ గా వుంది. నిర్మాణ విలువలు టాప్ క్లాస్ లో ఉన్నాయి.

ఆసక్తికరమైన కథాంశం, మిస్టరీని పెంచే విజువల్స్, పవర్ ఫుల్ నటన, కథనంతో ‘హైందవ’ టీజర్ సినిమాపై అంచనాలను పెంచింది. ఈ చిత్రాన్ని నవంబర్ 27న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు.

టీజర్ లాంచ్ ఈవెంట్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ... అందరికీ నమస్కారం. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్. ఇది చాలా అద్భుతమైన కథ. డైరెక్టర్ లుదీర్ కథ చెప్పగానే మాకు చాలా నచ్చింది. మహేష్ నా బెస్ట్ ఫ్రెండ్. సెవెన్త్ క్లాస్ నుంచి మేమిద్దరం క్లాస్‌మేట్స్. మహేష్‌కి సినిమా చేయాలని ఉందని నాకు నిజంగా తెలియదు. మహేష్ ఎవరో కాదు, కీర్తిశేషులు డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి అల్లుడు. కోడి రామకృష్ణ గారు మనకు ఎన్ని అద్భుతమైన సినిమాలు చేశారో మనకు తెలుసు. శ్యాంప్రసాద్ రెడ్డి గారి లాంటి ప్రొడ్యూసర్లు మళ్లీ ఇండస్ట్రీకి రావాలని నేను, మహేష్ మాట్లాడుకుంటూ ఉంటాం. ఇప్పుడున్న సమయంలో థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలు చాలా ఇంపార్టెంట్. శ్యాంప్రసాద్ రెడ్డి గారిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చాలా అద్భుతమైన సినిమా తీశాం. ఇది మీకు ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇంత అద్భుతమైన కథ ఇచ్చినందుకు లుదీర్ కి థాంక్యూ. సంయుక్త ఒక సినిమాలో వుందంటే అది బ్లాక్ బస్టర్ (నవ్వుతూ) మా టీమ్ అందరికీ ధన్యవాదాలు. అందరం బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా తీశాం. నవంబర్‌ 27న తప్పకుండా మీరందరూ సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను.

హీరోయిన్ సంయుక్త మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. డైరెక్టర్ లుదీర్ గారు చాలా మంచి నరేటర్. ఆయన కథ చెప్పినప్పుడు నాకు చాలా నచ్చింది. ప్రతి డీటైల్‌ను చాలా అద్భుతంగా చెబుతారు. కథ వినగానే వెంటనే ఓకే చేశాను. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుంది. లుదీర్ చాలా క్లారిటీ ఉన్న డైరెక్టర్. ఆయనతో వర్క్ చేయడం చాలా హ్యాపీగా ఉంది. డీఓపీ హరీష్ గారు చాలా అద్భుతమైన విజువల్స్ అందించారు. నిర్మాత, మా హీరోగారు చాలా మంచి ఫ్రెండ్స్. దానివల్ల సెట్‌లో చాలా పాజిటివ్ ఎనర్జీ ఉండేది. చాలా బ్యూటిఫుల్ లొకేషన్స్‌లో తీసిన సినిమా ఇది. టీజర్ నాకు చాలా నచ్చింది. సినిమా కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను.

ప్రొడ్యూసర్ మహేష్ చందు మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. సాయి ఈ కథను చాలా ఎగ్జైట్ అయ్యారు. మాకు చాలా సపోర్ట్ చేశారు. టీజర్ ఎంతగా ఆకట్టుకుందో, సినిమా అంతకంటే ఎక్కువగా ఆకట్టుకుంటుంది. తప్పకుండా మీ అందరికీ సినిమా నచ్చుతుంది.

డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్‌లాగే సినిమా కూడా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ‘హైందవ’ కథ గురించి చెప్పాలంటే, దశావతారాల గుడి నేపథ్యంలో జరిగే కథ ఇది. నడవలేని విగ్రహాలు కథను నడిపిస్తాయి. విగ్రహాలకు, ఒక పోలీస్ ఆఫీసర్‌కు మధ్య ఎలాంటి కథ జరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో ఇంకా చాలా అద్భుతమైన కంటెంట్ ఉంది. దశావతారాల మీద సినిమా డైరెక్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో సపోర్ట్ ఇచ్చిన బెల్లంకొండ సురేష్ గారికి, హీరో సాయి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇది పెద్ద సినిమా, పెద్ద స్కేల్‌లో ఉన్న సినిమా అని అంటున్నారు. దానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు. ఆయన సంతూర్లో ఒక గుడి కట్టి, ఈ గుడి సినిమా తీశారు. ఈ సినిమాలో ఇంకా అద్భుతమైన కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడే రివిల్ చేయకూడదు. ఆడియన్స్ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ఒక మాట చెప్పాలి.. సేవ్ ది టెంపుల్స్, లెట్స్ ప్రొటెక్ట్ అవర్ కల్చర్. హైందవ!

ప్రొడక్షన్ డిజైనర్ డి. కామేష్ మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. మా నిర్మాత మహేష్ గారు మాకు చాలా సపోర్ట్ చేశారు. చాలా మంచి బడ్జెట్ ఇచ్చారు. దాంతో చాలా హ్యాపీగా, కంఫర్ట్‌గా పని చేశాను. ఇది చాలా ఇంటెన్స్ వర్క్ ఉన్న సినిమా. ఇలాంటి డివైన్ సినిమా చేయడం ఒక థ్రిల్ ఇస్తుంది. విజువల్స్ కోసం చాలా కష్టపడ్డాం. అవుట్‌డోర్‌కు వెళ్లి రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది.

నటీనటులు: బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సంయుక్త, మహేష్ మంజ్రేకర్, సౌరభ్ సచ్‌దేవా, జేడీ చక్రవర్తి, శివాజీ రాజా, గెటప్ శ్రీను.

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: లుధీర్ బైరెడ్డి
నిర్మాత: మహేష్ చందు
బ్యానర్: మూన్‌షైన్ పిక్చర్స్
సమర్పణ: శివెన్ రామకృష్ణ
డీవోపీ: హరీష్ కన్నన్
సంగీతం: సామ్ సీఎస్
ఎడిటర్: కార్తిక శ్రీనివాస్ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: శివ కామేష్ డి
పబ్లిసిటీ డిజైనర్: అనంత్ కంచర్ల


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved