“I believe ‘Hey Balwanth’ will become the biggest commercial blockbuster hit of my career”: Hero Suhas
హే బల్‌వంత్' సినిమాతో నా కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హిట్ రాబోతుందనే నమ్మకం ఉంది: కథానాయకుడు సుహాస్
The successful duo Bunny Vasu and Vamsi Nandipati, who recently delivered blockbuster films like Little Hearts, Raju Weds Rambhai, and Isha, are now bringing a full-length out-and-out entertainer titled “‘Hey Balwanth’” (title changed from Hey Bhagwan) under the banners of Nandipati Entertainments and Bunny Vasu Works.
The film stars Suhas, Shivani Nagaram, senior actor Naresh, and anchor Sravanthi in key roles. Directed by Gopi Achara, the film is produced by B. Narendra Reddy under the Trishul Visionary Studios banner. The movie is set to release on February 20.
Ahead of the release, a “Not A Title” event related to the film was held grandly in Hyderabad. Hero Sundeep Kishan attended the event as the chief guest.
Sundeep Kishan said:
“I am happy to attend this event. Vamsi Nandipati’s name has been heard in the industry for some time now. I like his confidence. I like Suhas a lot. I have watched all his films. He is a hero who believes in stories and works very sincerely. Even after the title change, everyone calls this a Suhas film. With this movie, Suhas will once again win the hearts of the audience. When I watched the teaser, it looked very interesting. The way the film was promoted is good. I strongly believe this movie will definitely be a success.”
Hero Suhas said:
“My thanks to hero Sundeep Kishan who always encourages me. The entire team worked very hard for this film. My co-artists put in a lot of effort. This film will feel like a musical night with music director Vivek Sagar’s music. The producer made this film without compromising anywhere. The entire shoot happened in a very positive atmosphere. I had heard about Vamsi Nandipati earlier, but through this film I understood him better. With good planning, he created strong buzz for the film. Director Gopi fulfilled his dream with this movie and worked very hard to make a good film. Shivani and Sudarshan both acted superbly.
I got a break in my career with the film Majili. Good offers started coming. Around that time, I got an offer to act with a big heroine in a film where my role had close scenes with the heroine. Someone questioned why I was called to the set. But later I acted with Keerthy Suresh in Uppu Kappurambu. That was a great moment for me. If someone talks down about you, just smile and move on. Anyone can achieve anything. I strongly believe ‘Hey Balwant’ will bring me a big hit.”
Shivani Nagaram said:
“When the title changed, we were all tense. But Bhagwan became Balwant. This is a movie everyone will enjoy. People will laugh a lot. It has entertainment, emotion, everything. This film is special for our entire team. There is no doubt this will be a blockbuster. This is a special film for me with Suhas. I told him during Ambajipeta movie that we should do many films together and I should be part of every blockbuster of his. So this film will definitely be a blockbuster.”
Vamsi Nandipati said:
“Even if dates or titles change, the impact our movie creates on February 20 will not change. This film has love, entertainment, and emotion — which everyone will like. It also has a father-son emotional track. This is a wholesome entertainer. When audiences leave the theatre, their hearts will feel heavy with emotion. Such films connect with real life. This movie will be worth the money people spend. It is a paisa-vasool film and will provide 100% entertainment. On this occasion, I am giving an advance for director Gopi’s second film in front of all of you. That shows my confidence in ‘Hey Balwant’.”
Producer B. Narendra Reddy said:
“This is the first film from our banner. After listening to twenty stories, we liked Gopi’s story. We completed shooting quickly. After Vamsi Nandipati joined the project, I felt relaxed. The artists and technicians supported us greatly.”
Director Gopi Achara said:
“We changed ‘Hey Bhagwan’ slightly to ‘Hey Balwant’. Only the title changed — not the content or entertainment. I believe I utilized the opportunity given by Suhas well. Even though he is very busy, he supported this film a lot. Producer Narendra Reddy has great passion for cinema. He was involved in everything and never compromised on budget. This film will definitely become a blockbuster.”
The event was attended by lyric writer K.K., editor Viplav, DOP Mahireddy, writer Mithun, actor Harshavardhan, music director Vivek Sagar, director Sandeep Raj, producer Dheeraj Mogilineni, actors Divya, Vidya, producer and Chai Bisket founder Anurag Reddy, actor Sudarshan, actress Sravanthi Chokkarapu, Lavanya Reddy, and others.
హే బల్‌వంత్' సినిమాతో నా కెరీర్‌లో బిగ్గెస్ట్ కమర్షియల్ బ్లాక్‌బస్టర్ హిట్ రాబోతుందనే నమ్మకం ఉంది: కథానాయకుడు సుహాస్
ఇటీవల లిటిల్‌హార్ట్స్, రాజు వెడ్స్ రాంబాయి, ఈషా వంటి బ్లాక్‌బస్టర్స్ చిత్రాలను అందించిన బన్నీవాస్, వంశీ నందిపాటిల సక్సెస్‌ఫుల్ ద్వయం తాజాగా నందిపాటి ఎంటర్ టైన్ మెంట్స్, బన్నీ వాస్ వర్క్స్ బ్యానర్స్ పై ‘హే బల్‌వంత్' ( హే భగవాన్ చిత్రం టైటిల్ మార్పు) అనే ఫుల్‌లెంగ్త్ అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ చిత్రంలో సుహాస్, శివానీ నాగారం , సీనియర్ నటుడు నరేష్, యాంకర్ స్రవంతి ప్రముఖ పాత్రల్ని పోషించారు. గోపీ అచ్చర దర్శకత్వంలో త్రిశుల్ విజనరీ స్టూడియోస్ పతాకంపై బి.నరేంద్ర రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ మూవీని ఫిబ్రవరి 20న రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ చిత్రంకు సంబంధించి నాట్ ఏ టైటిల్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో సందీప్ కిషన్ విచ్చేశాడు. ఈసందర్భంగా
సందీప్ కిషన్ మాట్లాడుతూ '' ఈ ఈవెంట్‌కు వచ్చినందుకు హ్యపీగా ఉంది. వంశీ నందిపాటి పేరు గత కొన్నాళ్లుగా ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ఆయన కాన్ఫిడెంట్ నచ్చుతుంది. సుహాస్ నాకు చాలా ఇష్టం. ఆయన సినిమాలు అన్నీ చూశాను. కథను నమ్మి సినిమాలు చేసే హీరో. నిజయితీగా కష్టపడతాడు. ఈ సినిమాకు టైటిల్ మారిన అందరూ సుహాస్ సినిమా అంటారు. ఈ సినిమాతో సుహాస్ ఆడియన్స్ మనసులు మరోసారి గెలుచుకుంటాడు. ఈ సినిమా టీజర్ చూడగానే నాకు ఆసక్తికరంగా అనిపించింది. సినిమాను ప్రమోట్ చేసిన విధానం బాగుంది. తప్పకుండా ఈ సినిమా విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అన్నారు.
కథానాయకుడు సుహాస్ మాట్లాడుతూ '' నన్ను ఎప్పుడూ ఎంకరైజ్ చేసే హీరో సందీప్‌కిషన్‌కు నా కృతజ్క్షతలు. టీమ్ అంతా ఎంతో కష్టపడి ఈ సినిమా చేశారు. నా తోటి ఆర్టిస్టులు ఈ సినిమా కోసం ఎంతో హార్డ్ వర్క్ పెట్టారు. ఈ సినిమా సంగీత దర్శకుడు వివేక్ సాగర్ మ్యూజికల్ నైట్‌లా ఉంటుంది. నిర్మాత ఎక్కడా రాజీపడకుండా ఈ సినిమా చేశాడు. సినిమా షూటింగ్ అంతా ఎంతో పాజిటివ్‌గా జరిగింది. వంశీ నందిపాటి గురించి ఇంతకు ముందు విన్నాను. ఈసినిమాతో ఆయనెంటో తెలిసింది. ఆయన మంచి ప్లానింగ్‌తో సినిమా మీద బజ్ తీసుకొచ్చాడు. దర్శకుడు గోపీ ఈ సినిమాతో ఆయన డ్రీమ్ నెరవేర్చుకున్నాడు. ఎంతో కష్టపెట్టి ఓ మంచి సినిమా తీశాడు. శివానీ, సుదర్శన్‌లు ఇద్దరూ సూపర్‌గా యాక్ట్ చేశారు. నా కెరీర్‌లో మజిలీ సినిమాతో బ్రేక్ వచ్చింది. మంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆ సమయంలోనే పెద్ద హీరోయిన్‌తో ఓ సినిమాలో ఆఫర్ వచ్చింది. సినిమాలో హీరోయిన్‌తో క్లోజ్‌గా ఉండే పాత్ర అది. నా ముందే ఒకాయన సెట్‌లో ఇంతనెందుకు పిలిచారు? కానీ కట్ చేస్తే కీర్తిసురేష్‌తో కలిసి ఉప్పు కప్పురంబు అనే సినిమా చేశాను. నేను గ్రేట్‌గా ఫీలయిన మూమెంట్ అది. ఎవరైనా మిమ్మలను తక్కువ చేసి మాట్లాడితే మీరు నవ్వి ఊరుకోండి.. ఎవరైనా ఏదైనా సాధించవచ్చు. ఇక 'హే బల్‌వంత్'తో నాకు పెద్ద హిట్ వస్తుందని నమ్ముతున్నాను' అన్నారు.
శివానీ నాగారం మాట్లాడుతూ '' ఈ సినిమా టైటిల్ మారగానే అందరం టెన్షన్ పడ్డాం. కానీ ఆ భగవాన్ బల్‌వంత్‌గా మార్చాడు. అందరూ చాలా ఎంజాయ్ చేసే సినిమా. అందరూ నవ్వుకుంటారు. వినోదం, ఎమోషన్, అన్నీ ఉన్నాయి. ఈ సినిమా మా టీమ్ అందరికి స్పెషల్. తప్పకుండా ఈసినిమా బ్లాక్‌బస్టర్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదు. సుహాస్‌తో నాకు స్పెషల్ సినిమా. అంబాజీ పేట సినిమాలో మనం చాలా సినిమాలు చేయాలి. నీ ప్రతి బ్లాక్‌బస్టర్‌లో నేనుండాలి అన్నాను. సో.. తప్పకుండా ఈ సినిమా తప్పకుండా బ్లాక్‌బస్టర్ అవుతుంది' అన్నారు.
వంశీ నందిపాటి మాట్లాడుతూ '' డేట్‌లు మారినా, టైటిల్ మారినా, ఫిబ్రవరి 20న మా సినిమా క్రియేట్ చేసే ఇంపాక్ట్ మారదు. ఈసినిమాలో లవ్, ఎంటర్‌టైన్‌మెంట్, ఎమోషన్ ఉన్నాయి. ఇవి అందరికి బాగా నచ్చుతాయి. మన లైఫ్‌లో ఫాదర్ అండ్ సన్ ఎమోషన్ ఈ సినిమా ఉంటుంది. ఇది హోల్‌సమ్ ఎంటర్‌టైనర్. సినిమా చూసి వెళ్లేటప్పుడు అందరి హృదయాలు బరువెక్కుతాయి. ఇటువంటి సినిమాలు చూసినప్పుడు మన రియల్‌లైఫ్‌లో కూడా కనెక్ట్ అవుతాం. ఈ సినిమా చూసిన వాళ్ల డబ్బులకు న్యాయం జరుగుతుంది. ఆడియన్సకు పైసా వసూల్ సినిమా. హాండ్రెడ్ పర్సెంట్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించే సినిమా ఇది. ఈ సందర్బంగా ఈ చిత్ర దర్శకుడు గోపీకి మీ అందరి సమక్షంలో రెండో సినిమా అడ్వాన్స్ ఇస్తున్నాను. ఇది హేబల్‌వంత్ మీద ఉన్నా నా నమ్మకం' అన్నారు.
నిర్మాత బి.నరేంద్ర రెడ్డి మాట్లాడుతూ '' మా బ్యానర్ నుంచి వస్తున్న మొదటి సినిమా ఇది. ఇరవై కథలు విన్న తరువాత గోపీ చెప్పిన కథ నచ్చి. త్వరితగతిన షూటింగ్ పూర్తిచేశాం. వంశీ నందిపాటి ఇన్ అయిన తరువాత ఈ సినిమా విషయంలో నేను రిలాక్స్ అయ్యాను. ఈ సినిమా విషయంలో ఆర్టిస్టులు, సాంకేతిక నిపుణులు ఎంతో సహకరించారు' అన్నారు.
దర్శకుడు గోపీ అచ్చర మాట్లాడుతూ '' హేభగవాన్ కాస్త హే బల్‌వంత్‌గా మార్చాం. మారింది టైటిలే. కంటెంట్, ఎంటర్‌టైన్‌మెంట్ కాదు. సుహాస్ నాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచున్నానని అనుకుంటున్నాను. ఎంతో బిజీగా ఉన్నా ఈ సినిమా విషయంలో సహకారించాడు. ఎంతో సపోర్ట్ చేశాడు. నిర్మాత నరేంద్ర రెడ్డికి సినిమా అంటే ఎంతో పాషన్. అన్నీంట్లో ఇన్‌వాల్వ్ అయ్యేవాడు. ఖర్చు విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. తప్పకుండా బ్లాక్‌బస్టర్ అయ్యే సినిమా ఇది' అన్నారు.
ఈ కార్యక్రమంలో లిరిక్ రైటర్ కె.కె. ఎడిటర్ విప్లవ్, డీవోపీ, మహిరెడ్డి, రైటర్ మిథున్, నటుడు హర్షవర్థన్, సంగీత దర్శకుడు వివేక్ సాగర్, దర్శకుడు సందీప్ రాజ్, నిర్మాత ధీరజ్ మొగలినేని, నటులు దివ్య, విద్య, నిర్మాత, ఛాయ్‌బిస్కట్ ఫాండర్ అనురాగ్ రెడ్డి, నటుడు సుదర్శన్, నటి స్రవంతి చొక్కారాపు, లావణ్య రెడ్డి తదితరులు పాల్గొన్నారు.