The trailer of 'Idli Kottu' says, "There is more satisfaction in passion than in profession"
"వ్యాపారంలో దొరకని తృప్తి వ్యాపకంలో దొరుకుతుంది" అంటూ చెప్తున్న 'ఇడ్లీ కొట్టు' ట్రైలర్..
When you hear the name Dhanush, the actor who has become the go-to for unique roles comes to mind. He has exceptional acting talent. Looking at his entire filmography, there are many different characters and equally diverse stories. With his recently released film 'Kuber', he once again captured the nation's attention. Watching the trailer of his new film 'Idli Kottu' today, it is clear he has chosen another emotional and distinct story. He has also written and directed this movie. The film is jointly produced by Akash Bhaskaran and Dhanush.
The trailer suggests a heartfelt story woven around the theme of selling idlis in a middle-class family. Nithya Menen appears as the heroine, and Arun Vijay, Shalini Pandey, Sathyaraj, and Raj Kiran play key roles. Sathyaraj’s dialogue, "He is ready to die for his father's useless idli stall," indicates a story showcasing the bond between father and son. To find out what struggles the son endures for that "idli seller" and why, we have to wait until October 1. 'Sri Vedakshara Movies' will be releasing this film in Telugu.
"వ్యాపారంలో దొరకని తృప్తి వ్యాపకంలో దొరుకుతుంది" అంటూ చెప్తున్న 'ఇడ్లీ కొట్టు' ట్రైలర్..
ధనుష్ అంటేనే విలక్షణ పాత్రలకు కేరాఫ్ అడ్రస్ గా మారిన నటుడే గుర్తుకొస్తారు. అంతలా అద్భుతమైన నటనను కనబరిచే సామర్ధ్యం అతనిది. అతని సినీ గ్రాఫ్ మొత్తం చూస్తే ఎన్నో విభిన్న పాత్రలు, అంతే విభిన్న కథలు. ఇటీవలే విడుదలైన 'కుబేర' సినిమాతో దేశం మొత్తం మరోసారి ఆయనవైపు చూసేలా చేసుకున్న నటుడు ధనుష్. మరోసారి మనసులను తాకే మరో విభిన్న కథనే ఎంచుకున్నట్టు ఈరోజు అతని 'ఇడ్లీ కొట్టు' ట్రైలర్ చూస్తుంటేనే అర్థమవుతుంది. ఈ సినిమాకు కథ మరియు దర్శకత్వం కూడా ఆయనే అందించడం జరిగింది. ఈ సినిమాను ఆకాష్ భాస్కరన్ మరియు ధనుష్ సంయుక్తంగా నిర్మించడం జరిగింది.
ఓ మధ్య తరగతి కుటుంబంలో ఇడ్లీ కొట్టు నేపథ్యంలో అల్లుకున్న భావోద్వేగాలు నిండిన కథలా అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. నిత్యామీనన్ కథానాయికగా కనిపిస్తున్న ఈ సినిమాలో అరుణ్ విజయ్, షాలినీ పాండే, సత్యరాజ్ మరియు రాజ్ కిరణ్ కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. "దమ్మిడీకి పనికి రాని వాళ్ల నాన్న ఇడ్లీ కొట్టు కోసం వాడు చావడానికి సిద్ధంగా ఉన్నాడు" అన్న సత్యరాజ్ చెప్తున్న డైలాగ్ చూస్తుంటే తండ్రీ కొడుకుల మధ్య అనుబంధాలను చూపించే కథలాగే కనిపిస్తుంది. ఆ 'ఇడ్లీ కొట్టు' కోసం కొడుకు పడే ఆరాటం ఏంటో, ఎందుకో మనకు తెలియాలంటే అక్టోబర్ 1 వరకూ మనం ఎదురుచూడాల్సిందే. 'శ్రీ వేదాక్షర మూవీస్' వారు ఈ సినిమాను తెలుగులో విడుదల చేయబోతున్నారు.