pizza

Idupu Kayitham in Dec 1st week
డిసెంబర్ ఫస్ట్ వీక్ లో రిలీజ్ కు రాబోతున్న సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాస్ వర్క్స్, హీరో ప్రియదర్శి కాంబో మూవీ "ఇడుపు కాయితం"

You are at idlebrain.com > news today >

12 July 2026
Hyderabad

ప్రముఖ యంగ్ ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా "ఇడుపు కాయితం". ఈ సినిమాలో తెలంగాణ ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. తెలంగాణ ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా "ఇడుపు కాయితం" సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఇటీవలే ఈ సినిమా లాంఛనంగా పూజా కార్యక్రమాలు జరుపుకుంది.

"ఇడుపు కాయితం" సినిమా టైటిల్ నేపథ్యంగా సాగిన చర్చ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. టైటిల్ తోనే ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. అతి తక్కువ టైమ్ లో మరే చిత్రానికీ లేనంతగా ఈ సినిమా వార్తల్లో నిలిచింది. దీంతో ప్రేక్షకుల దృష్టిని ఈ సినిమా బాగా ఆకర్షిస్తోంది. సినిమా పూజా కార్యక్రమాల సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. "ఇడుపు కాయితం" త్వరలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించుకోనుంది. ఈ సినిమాను డిసెంబర్ ఫస్ట్ వీక్ లో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు తీసుకొచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రేజీ మూవీకి సంబంధించిన మరిన్ని అప్డేట్స్ త్వరలో దర్శక నిర్మాతలు షేర్ చేసుకోనున్నారు.

నటీనటులు - ప్రియదర్శి, నాగదుర్గ, శివజ్యోతి (తీన్మార్ సావిత్రి), సుజాత (జోర్దార్), చంద్రవ్వ, మౌనిక రెడ్డి, రచ్చరవి, బిత్తిరి సత్తి, అభయ్ బేతిగంటి, మైమ్ మధు, తదితరులు

టెక్నికల్ టీమ్

కాస్ట్యూమ్ డిజైనర్ - అశ్వత్ భైరి
ఆర్ట్ డైరెక్టర్ - ఆశిష్ తేజ
ఎడిటర్ - శ్రీధర్ సొంపల్లి
డీవోపీ - ఎంఎన్ బాల్ రెడ్డి
మ్యూజిక్ - సురేష్ బొబ్బిలి
బ్యానర్స్ - సుకుమార్ రైటింగ్స్, బన్నీవాస్ వర్క్స్
ప్రొడ్యూసర్ - బన్నీవాస్
స్క్రిప్ట్, డైరెక్షన్ - వంశీరెడ్డి దొండపాటి


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved