pizza

“Idupu Kayitham” First Single Srilatha Song Is Receiving Appreciation from Everyone – Music Director Suresh Bobbili & Lyricist Alaraju
"ఇడుపు కాయితం" 'శ్రీలత..' సాంగ్ కు ప్రతి ఒక్కరి ప్రశంసలు లభిస్తున్నాయి - మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, గీత రచయిత అలరాజు

You are at idlebrain.com > news today >

12 September 2026
Hyderabad

Producer Bunny Vas and genius director Sukumar are producing Idupu Kayitham with Priyadarshi in the lead under the banners of Bunny Vas Works and Sukumar Writings. Nagadurga, who became popular through folk songs, plays the female lead in the film.

Young director Vamsi Reddy Dondapati is directing Idupu Kayitham as an entertaining family drama set against a family backdrop. The recently released Srilatha song from the film has been winning the hearts of music lovers and receiving a superb response. Speaking at an interview held today, music director Suresh Bobbili and lyric writer Alaraju expressed their happiness over the appreciation the song has been receiving.

Music Director Suresh Bobbili said:

- The Srilatha song has been loved by my family members. They have been calling me to say how much they liked it. We are also getting a great response from the film industry. Everyone says they loved the composition, the sound, the lyrics, and the way both singers performed the song.

- I also acted in this song. It was Bunny Vas garu's idea. He said that after composing music for so many songs, audiences should know who I am, and that's why he made me appear in the song. Even I always wanted audiences to recognize me. I had even thought of performing in a private song myself. Acting in the song gave me a completely new experience, and I really enjoyed it.

- While discussing this song, we wanted it to become a part of the story and also work as a promotional song for the film. We also wanted catchy lyrics. We designed the song in a way that people would own it, and that's why we released it in advance. Lyric writer Alaraju wrote the lyrics while I was humming the tune. Both the tune and the lyrics were finalized on the same day. We didn't compose it entirely in a Telangana folk style because we wanted it to reach everyone. I designed the charanam with a melodious touch.

- Lyric writer Alaraju anna is a friend of director Vamsi Reddy anna, and I also know him well. I know how beautiful his writing is. He used familiar Telangana words that are commonly used in everyday life. Those words not only added beauty to the song but also helped it connect with people very quickly. Even family audiences have connected with the song and have been calling to appreciate it.

- This film has six songs along with a few bit songs. The entire album has come out really well. Personally, I am satisfied with every song. Every film has a few songs that fit the situation perfectly, but in Idupu Kayitham, every song suits the story's situations. The next song we are going to release is also fantastic. This film has tremendous scope for music. There is a wedding episode song, another song when the newly married couple visits the village, and many songs that naturally emerge from the story. Though the film is completely rooted in Telangana, we gave the songs a commercial touch so they could reach everyone.

- My father was a stage artist, and my mother used to sing beautifully. That's how I developed a connection with music from childhood. I worked in music director Chakri garu's troupe. That's where my musical journey began. I studied music at Warangal Music College, worked in an office, became a sound engineer, and with that experience, I grew into a music composer. I'm happy to see Telangana music gaining prominence in Telugu cinema. Earlier, I composed Telangana-based songs for television channels and songs for Telangana Formation Day celebrations.

- I am currently composing music for Crazy Kalyanam, Dethadi, and Idupu Kayitham. Discussions are also happening for a few more films.

Lyric Writer Alaraju said:

- So far, I have written songs for nearly 40 films. The song Teliyadhe Teliyadhe from Miles of Love gave me a lot of recognition. It was sung by Sid Sriram. Another hit song I wrote was Kangare Padakura from Bapu, sung by Anurag Kulkarni.

- As soon as Srilatha was released, Kasarla Shyam garu sent me a message. He said the lyrics were excellent and appreciated a few lines in particular. He especially liked the line, “Ae Panchayithi Mana Nadimitla Vachina... Mana Manchaniki Avi Teliyadde.” He also appreciated me for justifying the title Idupu Kayitham through the lyrics.

- While writing this song, director Vamsi Reddy told me that it should be loved by everyone even without watching the film, and after watching the movie, audiences should connect with it even more. You may like the audio now, but once you watch it in the film, you'll love it four times more. The song comes when the hero and heroine arrive in Hyderabad. It is based on why Srilatha is upset and how Srinivas consoles her. I tried to avoid regular expressions and wrote the lyrics in a fresh way.

- This song was finalized even before the title reveal. I wrote the lyrics with a Telangana flavor without making them completely folk-oriented so that everyone could connect with them. Initially, I felt pressure because I was working on a big film, but the inputs given by the team made me comfortable while writing. Srilatha has brought me great recognition. I believe Idupu Kayitham is the paper that changed my life as a lyric writer.

"ఇడుపు కాయితం" 'శ్రీలత..' సాంగ్ కు ప్రతి ఒక్కరి ప్రశంసలు లభిస్తున్నాయి - మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి, గీత రచయిత అలరాజు

ప్రొడ్యూసర్ బన్నీ వాస్, జీనియస్ డైరెక్టర్ సుకుమార్ తమ బన్నీ వాస్ వర్క్స్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్స్ పై ప్రియదర్శి హీరోగా నిర్మిస్తున్న సినిమా "ఇడుపు కాయితం". ఈ సినిమాలో ఫోక్ సాంగ్స్ ద్వారా పేరు తెచ్చుకున్న నటి నాగదుర్గ హీరోయిన్ గా నటిస్తోంది. ఫ్యామిలీ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎంటర్ టైనింగ్ డ్రామాగా "ఇడుపు కాయితం" సినిమాను యువ దర్శకుడు వంశీరెడ్డి దొండపాటి రూపొందిస్తున్నారు. ఈ సినిమా నుంచి రీసెంట్ గా రిలీజ్ చేసిన 'శ్రీలత..' సాంగ్ మ్యూజిక్ లవర్స్ ను అలరిస్తూ సూపర్బ్ రెస్పాన్స్ తెచ్చుకుంటోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు జరిగిన ఇంటర్వ్యూలో చిత్ర సంగీత దర్శకుడు సురేష్ బొబ్బిలి, లిరిక్ రైటర్ అలరాజు ఈ పాటకు దక్కుతున్న ఆదరణపై సంతోషాన్ని వ్యక్తం చేశారు.

మ్యూజిక్ డైరెక్టర్ సురేష్ బొబ్బిలి మాట్లాడుతూ

- 'శ్రీలత..' పాట మా ఫ్యామిలీ మెంబర్స్ కు బాగా నచ్చింది. వాళ్లు ఫోన్స్ చేసి పాట బాగుందని చెబుతున్నారు. ఇండస్ట్రీ నుంచి కూడా మా సాంగ్ కు రెస్పాన్స్ బాగుంది. పాట కంపోజిషన్, సౌండింగ్, లిరిక్స్ , ఇద్దరు సింగర్స్ పాడిన విధానం తమను ఆకట్టుకుందని చెబుతున్నారు. ఈ పాటలో నేను నటించాను. ఈ ఆలోచన బన్నీ వాస్ గారిది. మీరు ఇన్ని సాంగ్స్ కు మ్యూజిక్ చేశారు. మీరు ఎవరో ప్రేక్షకులకు తెలియాలి కదా అని ఈ సాంగ్ లో నేను కూడా నటించేలా చేశారు. నేను ప్రజలకు తెలియాలి అనే ఆలోచన నాలో కూడా ఉండేది. అందుకే ఒక ప్రైవేట్ సాంగ్ నేనే పర్ ఫార్మ్ చేస్తూ చేయాలని కూడా అనుకున్నాను. పాటలో నటించడం కొత్త ఎక్సిపీరియన్స్ ఇచ్చింది. ఈ పాటలో నటించడాన్ని ఎంజాయ్ చేశాను.

- ఈ పాట కోసం డిస్కషన్స్ జరుగుతున్నప్పుడే సినిమాలోని కథలో భాగమవుతూ, ప్రమోషన్ కు కూడా ఉపయోగపడేలా ఉండాలని అనుకున్నాం. పాటలో క్యాచీ లిరిక్స్ కూడా కుదిరాయి. ప్రజలు ఈ పాటను ఓన్ చేసుకునేలా ఉండాలని డిజైన్ చేసి ముందే రిలీజ్ చేశాం. ట్యూన్ పాడుతుంటే లిరిక్ రాశాడు గీత రచయిత అలరాజు. ఈ పాటకు ట్యూన్, లిరిక్స్ ఒకే రోజులో ఫైనల్ అయ్యాయి. పాట అందరికీ రీచ్ అవ్వాలనే కంప్లీట్ గా తెలంగాణ ఫోక్ స్టైల్ లో కంపోజ్ చేయలేదు. చరణం మెలొడియస్ గా ఉండేలా ట్యూన్ డిజైన్ చేశాను.

- లిరిక్ రైటర్ అలరాజు అన్న డైరెక్టర్ వంశీరెడ్డి అన్నకు ఫ్రెండ్. నాకు కూడా అలరాజు అన్న తెలుసు. ఆయన సాహిత్యం ఎలా ఉంటుందో ఐడియా ఉంది. ఈ పాటలో తెలంగాణ వారికి వాడుకలో ఉన్న, సుపరిచితమైన కొన్ని పదాలతో పాట రాశాడు. అవి పాటకు అందాన్ని తీసుకురావడమే కాదు త్వరగా అందరికీ రీచ్ అయ్యేలా చేశాయి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా పాటకు కనెక్ట్ అయ్యారు. పాట బాగుందని కాల్ చేసిన చెబుతున్నారు.

- ఈ చిత్రంలో ఆరు పాటలతో పాటు కొన్ని బిట్ సాంగ్స్ ఉంటాయి. ఆల్బమ్ మొత్తం బాగా వచ్చింది. నాకు పర్సనల్ గా పాటలన్నీ సంతృప్తినిచ్చాయి. ప్రతి సినిమాకు సంతోషిస్తాం కానీ అందులో సందర్భానికి వచ్చే పాటలు కొన్నే ఉంటాయి. ఈ చిత్రంలో ప్రతి పాట సందర్భానికి తగినట్లు ఉంటుంది. నెక్ట్స్ రిలీజ్ చేయబోయే సాంగ్ కూడా అదిరిపోతుంది. మ్యూజిక్ కు ఎక్కువ స్కోప్ ఉన్న చిత్రమిది. పెళ్లి ఎపిసోడ్ పాట, కొత్త జంట విలేజ్ కు వెళ్లివచ్చేప్పుడు పాట..ఇలా కథలోని సందర్భాలకు మంచి సాంగ్స్ కుదిరాయి. ఇది పూర్తిగా తెలంగాణ నేపథ్య సినిమానే అయితే మ్యూజికల్ గా అందరికీ రీచ్ అయ్యేలా పాటల్లో కమర్షియల్ టచ్ ఇచ్చాం.

- మా నాన్న స్టేజి ఆర్టిస్టు, అమ్మ పాటలు బాగా పాడేది. అలా నాకు పాటతో చిన్నప్పటి నుంచే అనుబంధం ఏర్పడింది. నేను మ్యూజిక్ డైరెక్టర్ చక్రి గారి ట్రూప్ లో ఉండేవాడిని. పాటలతో నా ప్రయాణం అలా మొదలైంది. వరంగల్ మ్యూజిక్ కాలేజ్ లో సంగీతం నేర్చుకున్నా. ఆఫీస్ గా పనిచేశా, సౌండ్ ఇంజినీర్ గా మారాను. ఆ అనుభవంతో మ్యూజిక్ కంపోజర్ గా ఎదిగాను. మన సినిమాల్లో తెలంగాణ బాణీ పెరగడం చూస్తుంటే సంతోషంగా ఉంది. నేను గతంలో కొన్ని ఛానెల్స్ కోసం తెలంగాణ నేపథ్య సాంగ్స్ కంపోజ్ చేశాను. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పాటలు రూపొందించాను.

- ప్రస్తుతం క్రేజీ కల్యాణం, దేత్తడి, తెల్లకాగితం వంటి చిత్రాలను మ్యూజిక్ చేస్తున్నా. వీటితో మరికొన్ని సినిమాలకు సంప్రదింపులు జరుగుతున్నాయి.

లిరిక్ రైటర్ అలరాజు మాట్లాడుతూ

- నేను ఇప్పటిదాకా దాదాపు 40 చిత్రాలకు సాంగ్స్ రాశాను. నేను రాసిన పాటల్ల మైల్స్ ఆఫ్ లవ్ మూవీలోని తెలియదే తెలియదే పాట మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఈ పాటను సిధ్ శ్రీరామ్ పాడారు. బాపు సినిమాలో కంగారే పడకురా అనే పాట కూడా బాగా హిట్ అయ్యింది. ఈ పాటను అనురాగ్ కులకర్ణి పాడారు. శ్రీలత పాట రిలీజ్ కాగానే కాసర్ల శ్యామ్ గారు మెసేజ్ పంపారు. లిరిక్స్ చాలా గొప్పగా ఉన్నాయి. కొన్ని లైన్స్ బాగున్నాయని అభినందించారు. ఏ పంచాయితీ మన నడిమిట్ల వచ్చినా, మన మంచానికి అవి తెలియద్దే...అనే లైన్ ఆయనకు బాగా నచ్చింది. ఇడుపుకాయితం అనే టైటిల్ ను సాహిత్యంతో జస్టిఫై చేసేందుకు బాగా ప్రయత్నించావు అంటూ కాసర్ల శ్యామ్ ప్రశంసించారు.

ఈ పాట రాసేప్పుడు డైరెక్టర్ వంశీ రెడ్డి గారు కథతో సంబంధం లేకుండా ఈ పాట అందరికీ నచ్చేలా ఉండాలి. సినిమా చూశాక ఇంకా శ్రోతలకు కనెక్ట్ కావాలని చెప్పారు. మీరు ఇప్పుడు ఆడియో వింటుంటే నచ్చుతుంది. కానీ సినిమాలో చూసినప్పుడు నాలుగు రెట్లు ఎక్కువగా ఈ పాటను ఇష్టపడతారు. హీరో హీరోయిన్స్ హైదరాబాద్ కు వచ్చిన సందర్భంలో వచ్చే సాంగ్ ఇది. శ్రీలత అలకకు కారణం ఏంటి, శ్రీనివాస్ ఏం చెప్పి ఆమెను బుజ్జగించాడు అనే నేపథ్యంతో ఈ సాంగ్ రూపకల్పన చేశారు. రెగ్యులర్ ఎక్స్ ప్రెషన్స్ కాకుండా ఈ పాట సాహిత్యం కొత్తగా రాసేందుకు ప్రయత్నించాను.

టైటిల్ రివీల్ చేసేందుకు ముందగానే ఈ పాట ఫైనల్ అయ్యింది. ఈ పాటలోని పదాలను పూర్తిగా ఫోక్ స్టైల్ లో కాకుండా అందరికీ కనెక్ట్ అయ్యేలా రాశాను. ఒక పెద్ద మూవీకి వర్క్ చేస్తున్నానే ప్రెషర్ నాపై ఉండేది కానీ వాళ్లు ఇచ్చిన ఇన్ పుట్స్ వల్ల కంఫర్ట్ గా లిరిక్స్ రాశాను. శ్రీలత పాట నాకు మంచి గుర్తింపు తీసుకొచ్చింది. ఇడుపుకాయితం గీత రచయితగా నా బతుకు మార్చిన కాగితం అనుకుంటాను.

 

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved