Vamsi Nandipati Entertainments and ETV Win next "Inka Em Anukoledhu" first single Meghaalu Sandhramlo out now. Film Releasing on Dec 11
'ఇంకా ఏం అనుకోలేదు' నుంచి ఫస్ట్ సింగిల్ 'మేఘాలు సంద్రంలో' విడుదల.. డిసెంబర్ 11న సినిమా థియేట్రికల్ రిలీజ్
Producer Vamsi Nandipati, who previously delivered multiple successful projects in collaboration with ETV Win, once again joined forces with the platform for "Inka Em Anukoledhu." Their earlier collaborations proved that content-driven entertainers with a unique comedic flavor can resonate strongly with audiences.
The makers of “Inka Em Anukoledhu” have sparked major buzz online with a wildly entertaining title announcement video and friendship day video that instantly caught everyone's attention. Instead of following the usual promotional formula, the team using quirky ideas, meme-packed video that blends satire and unapologetic humor.
Today, the film’s first single, “Meghaalu Sandhramlo,” was unveiled at a grand launch event. Composed by Sinjith Yerramilli, this beautiful melody carries his distinctive musical touch, making it instantly catchy and addictive. Kittu Vissapragada’s lyrics beautifully express the love of Abhi, played by protagonist Akshay Lagusani, through a refreshing Gen Z perspective, making the song a potential chartbuster.
The soulful vocals of Adithya RK and Gomathi Iyer add warmth and charm to this heartwarming melody. This song marks a promising start to the lively and quirky album of Inka Em Anukoledhu. Akshay and Keyuri’s fresh chemistry, complemented by the charming college setting and vibrant visuals, makes the song even more appealing. Jai Krishna’s signature fun-filled style towards the end adds a wholesome vibe to the overall experience.
The film is directed by the writer-director duo Pranai Valluripalli and Giri Pemmasani, with Sinjith Yerramilli composing the music and Rehan Shaik handling cinematography. Produced by Vamsi Nandipati with co-producers Sameer Kannu and Vennapusa Sreekar Reddy, the bromantic comedy is gearing up for a theatrical release on December 11th, 2026.
'ఇంకా ఏం అనుకోలేదు' నుంచి ఫస్ట్ సింగిల్ 'మేఘాలు సంద్రంలో' విడుదల.. డిసెంబర్ 11న సినిమా థియేట్రికల్ రిలీజ్
వంశీ నందిపాటి ఎంటర్టైన్మెంట్స్, ఈటీవీ విన్ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం 'ఇంకా ఏం అనుకోలేదు'. గతంలో ఈటీవీ విన్‌తో కలిసి పలు విజయవంతమైన ప్రాజెక్టులను అందించిన నిర్మాత వంశీ నందిపాటి మరోసారి ఈ సంస్థతో చేతులు కలిపారు. విభిన్నమైన కథాంశాలు, వినోదాత్మక అంశాలతో రూపొందిన వీరి గత చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
ఇప్పటికే 'ఇంకా ఏం అనుకోలేదు' చిత్రానికి సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ వీడియో, ఫ్రెండ్షిప్ డే వీడియో సోషల్ మీడియాలో మంచి స్పందనను సొంతం చేసుకున్నాయి. సాధారణ ప్రచార పద్ధతులకు భిన్నంగా వ్యంగ్యం, హాస్యం, మీమ్స్‌తో కూడిన వినూత్న వీడియోలను చిత్రబృందం విడుదల చేసింది.
తాజాగా ఈ చిత్రం నుంచి తొలి పాట 'మేఘాలు సంద్రంలో'ను గ్రాండ్ లాంచ్ ఈవెంట్లో విడుదల చేశారు. సంగీత దర్శకుడు సింజిత్ యెర్రమిల్లి స్వరపరిచిన ఈ మెలోడీ ఆకట్టుకునేలా ఉంది. కథానాయకుడు అక్షయ్ లగుసాని పోషిస్తున్న అభి పాత్ర ప్రేమ భావాలను నేటి యువత ఆలోచనలకు అనుగుణంగా గీత రచయిత కిట్టు విస్సాప్రగడ తన సాహిత్యంలో వ్యక్తీకరించారు.
ఆదిత్య ఆర్కే, గోమతి అయ్యర్ ఆలపించిన ఈ పాటకు వారి గాత్రాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అక్షయ్, కేయూరి మధ్య కెమిస్ట్రీ, అందమైన కాలేజీ నేపథ్యం, ఆకర్షణీయమైన విజువల్స్ పాటకు మరింత అందాన్ని తీసుకొచ్చాయి. పాట చివర్లో జైకృష్ణ తనదైన వినోదంతో అలరించారు.
ఈ చిత్రానికి ప్రణయ్ వల్లూరిపల్లి, గిరి పెమ్మసాని రచన, దర్శకత్వ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సింజిత్ యెర్రమిల్లి సంగీతం అందిస్తుండగా, రెహాన్ షేక్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు చేపట్టారు. వంశీ నందిపాటి నిర్మిస్తున్న ఈ చిత్రానికి సమీర్ కన్ను, వెన్నపూస శ్రీకర్ రెడ్డి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు.
స్నేహం, వినోదం ప్రధానాంశాలుగా రూపొందుతున్న ఈ బ్రోమాంటిక్ కామెడీ చిత్రం 2026 డిసెంబర్ 11న థియేటర్లలో విడుదల కానుంది.
అక్షయ్ లగుసాని, కేయూరి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో , జయకృష్ణ, రావు రమేష్, హర్షవర్థన్, అనిత చౌదరి, సుబ్బరాజు తదితరులు ముఖ్య పాత్రలో నటిస్తున్నారు.