pizza
Kajal Aggarwal interview (Telugu) about Sita
`సీత‌` సినిమాను ఎప్పుడో చేయాల్సింది.. కానీ కుద‌ర‌లేదు - కాజ‌ల్ అగ‌ర్వాల్‌
You are at idlebrain.com > news today >
Follow Us

19 May 2019
Hyderabad

బెల్లంకొండ శ్రీనివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరో హీరోయిన్లుగా న‌టించిన చిత్రం `సీత‌`. సోనూసూద్‌, మ‌న్నారా చోప్రా కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. ఈ సినిమా మే 24న విడుద‌ల‌వుతుంది. ఈ సంద‌ర్భంగా హీరోయిన్ కాజ‌ల్ అగ‌ర్వాల్ మాట్లాడుతూ ``

పాత్ర గురించి...
- మాన‌సికంగా బ‌ల‌మైన అమ్మాయి పాత్ర నాది. తేజ సార్‌గారు నా పాత్ర‌ను బాగా డిజైన్ చేశారు. ఆయ‌న ద‌ర్శ‌క‌త్వంలో న‌టించిన ప్ర‌తిసారి నాకు న‌ట‌న‌కు స్కోప్ ఉండే పాత్ర ద‌క్కింది. నేటి త‌రం అమ్మాయిల‌ను రెప్రెజంట్ చేసే పాత్ర నాది. నా పాత్ర‌లో స్వార్ధం కూడా ఉంటుంది. త‌న క‌ల‌ల‌ను సాధించాల‌ని త‌ప‌న ప‌డే పాత్ర‌. చాలా పుస్త‌కాల‌ను చ‌ద‌వ‌డ‌మే కాదు.. చాలా మందిని ప‌రిశీలించాను కూడా.

బాగా క‌ష్ట‌ప‌డ్డాను..
- సీత పాత్ర కోసం హార్డ్ వ‌ర్క్ చేశాను. ఓ ర‌కంగా చెప్పాలంటే సాహ‌సాలు చేశాన‌నే చెప్పాలి. శారీర‌కంగా చాలా క‌ష్ట‌ప‌డ్డాను. గాయాల‌య్యాయి కూడా. 200 కిలోల ఐస్ ముక్క‌ల‌ను నాపై వేసుకున్నాను. ఎప్పుడూ సెట్స్‌లో ఓ వైద్యుడు ఉండేలా చూసుకున్నాను.

బెల్లంకొండ శ్రీనివాస్ గురించి...
- శ్రీనివాస్‌తో ఇది వ‌ర‌కే `క‌వ‌చం` సినిమాలో చేయ‌డం వ‌ల్ల ఈ సినిమాలో న‌టించ‌డం ఇంకా ఈజీ అయ్యింది. నా పాత్ర ఎంత బాగా ఉంటుందో త‌న పాత్ర కూడా అంతే బావుంటుంది.

interview gallery



ఎప్పుడో చేయాల్సింది...
- తేజగారు ఎప్పుడో ఈ క‌థ‌ను చెప్పారు. కానీ కాల్షీట్స్ నిండిపోవ‌డంతో సినిమా చేయలేక‌పోయాను. `నేనే రాజు నేనే మంత్రి` సినిమా స‌మ‌యంలో నాతోనే ఈ సినిమా తీయాల‌ని తేజ‌గారికి గ‌ట్టిగానే అడిగాను. కొన్ని కొన్ని మార్పులు చేర్పులు చేసి సినిమాను సెట్స్‌కు తీసుకెళ్లాం.

నాకు న‌చ్చాలి
- క‌థానాయికా ప్రాధాన్య‌మున్న చిత్రాలు చేయాల‌ని అడుగుతున్నారు. అయితే క‌థ ముందు నాకు బాగా న‌చ్చాలి. అప్పుడే చేస్తాను. అగ్ర క‌థానాయ‌కుల‌తో, యువ క‌థానాయ‌కుల‌తో న‌టిస్తున్నానంటే కార‌ణం ఈ రంగంపై నాకున్న ఇష్ట‌మే కార‌ణం.

త‌దుప‌రి చిత్రాలు..
- జూన్‌లో `భార‌తీయుడు 2`లో న‌టించ‌బోతున్నాను. శ‌ర్వానంద్ సినిమాతో పాటు జ‌యం ర‌వి సినిమాలో న‌టిస్తున్నాను. అలాగే మ‌రో సినిమా చ‌ర్చ‌ల ద‌శ‌లో ఉంది. త్వ‌ర‌లోనే ఆ సినిమాను కూడా అనౌన్స్ చేస్తాను.


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2019 Idlebrain.com. All rights reserved