pizza

Baby Nakshathra about Irumudi
‘ఇరుముడి’లో రవితేజ గారి కూతురు పాత్రలో నటించడం చాలా హ్యాపీగా ఉంది. ప్రేక్షకులు సినిమాను తప్పకుండా ఇష్టపడతారు: బేబీ నక్షత్ర

You are at idlebrain.com > news today >

20 August 2026
Hyderabad

మాస్ మహారాజా రవితేజ మోస్ట్ అవైటెడ్ మూవీ 'ఇరుముడి'. ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం గ్లింప్స్, ట్రైలర్, పాటలతో ఇప్పటికే భారీ అంచనాలు రేకెత్తించింది. ఆగస్టు 21న థియేటర్లలోకి రాబోతున్న ఈ సినిమా ప్రేక్షకులకు ఎమోషన్స్, యాక్షన్‌తో కూడిన డిఫరెంట్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషించిన బేబీ నక్షత్ర విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.

-నా పేరు నక్షత్ర. మాది కేరళ. నేను ఏడో క్లాస్ చదువుకుంటున్నాను. ఇప్పటివరకు కన్నడ, మలయాళం, తమిళ్ భాషల్లో కలిపి ఆరు సినిమాలు చేశాను.

‘ఇరుముడి’ అవకాశం ఎలా వచ్చింది?
-దర్శకుడు శివ నిర్వాణ గారు ఇన్‌స్టాగ్రామ్‌లో నా రీల్స్ చూసి ముందుగా మా అమ్మగారిని సంప్రదించారు. ‘ఇరుముడి’ నా తొలి తెలుగు సినిమా కావడం చాలా ఆనందంగా ఉంది.

‘ఇరుముడి’ అయ్యప్ప స్వామి నేపథ్యంలో ఉన్న కథ కదా? మీది కేరళ. మీరు ఎప్పుడైనా శబరిమల వెళ్లారా?
-కసారి శబరిమల వెళ్లాను.

రవితేజ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన నాతో చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఆయన అంటే నాకు చాలా ఇష్టం. రవితేజ గారి సినిమాల్లో నాకు ‘విక్రమార్కుడు’ చాలా ఇష్టం.

‘ఇరుముడి’లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది?
-ఇందులో నా పాత్ర పేరు మణికంఠ. నేను రవితేజ గారి కూతురిగా కనిపించబోతున్నాను. ప్రియా మేడమ్ నా తల్లి పాత్రలో నటిస్తున్నారు. రవితేజ గారు, ప్రియా మేడమ్ ఇద్దరూ నాతో ఎంతో ఫ్రెండ్లీగా ఉన్నారు. ఈ సినిమాకి స్వయంగా డబ్బింగ్ చెప్పాను.

మీరు చిన్న వయసులోనే పృథ్వీరాజ్ గారు, శివరాజ్ కుమార్ గారు, రవితేజ గారు లాంటి పెద్ద హీరోలతో పనిచేశారు కదా? ఎలా అనిపిస్తుంది?
-చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా మా అమ్మగారికి థాంక్స్ చెప్తున్నాను. తనే నాకు చాలా సపోర్ట్ చేస్తుంది.

సినిమాలను, చదువును ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు?
-ముఖ్యంగా మా టీచర్స్ నాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు. మా పేరెంట్స్, టీచర్స్ సపోర్ట్‌తోనే నేను సినిమాలు చేయగలుగుతున్నాను.

‘ఇరుముడి’లో మీకు ఇష్టమైన పాట ఏమిటి?
-‘ఇరుముడి’లో పాటలన్నీ నాకు ఇష్టం. కాకపోతే ‘యాలో యాలో’ పాట నా ఫేవరెట్.

శివ నిర్వాణ గారి దర్శకత్వంలో పనిచేయడం ఎలా అనిపించింది?
- శివ నిర్వాణ గారి సపోర్ట్‌తోనే ఈ సినిమాను చాలా కాన్ఫిడెంట్‌గా చేయగలిగాను.

షూటింగ్ ఎక్స్‌పీరియన్స్ గురించి?
సీలేరులో ఈ సినిమాను షూట్ చేశాం. అక్కడి ప్రదేశాలు నాకు కేరళలాగే అనిపించాయి. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో పనిచేయడం చాలా హ్యాపీగా ఉంది. వారి నిర్మాణంలో పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నాను.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved