pizza

Irumudi Generational Blockbuster Press Meet
'ఇరుముడి' ఓ మిరాకిల్. మా బ్యానర్‌లో బిగ్గెస్ట్ హిట్స్ ఉన్నాయి. కానీ 'ఇరుముడి' విజయం నెక్స్ట్ లెవల్. ఇలాంటి విజయం దశాబ్దానికి ఒకసారి వస్తుంది: 'ఇరుముడి' జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్‌లో మైత్రి మూవీ మేకర్స్ నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్

You are at idlebrain.com > news today >

2 September 2026
Hyderabad

మాస్ మహారాజా రవితేజ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ ‘ఇరుముడి’. శివ నిర్వాణ దర్శకత్వంలో, మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 21న విడుదలై ప్రేక్షకుల నుంచి అద్భుతమైన రెస్పాన్స్‌, రికార్డ్ బ్రేకింగ్ కలెక్షన్స్‌తో ఘన విజయాన్ని అందుకుని సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ ప్రెస్‌మీట్ నిర్వహించారు.

ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు చిత్ర బృందం సమాధానాలు ఇచ్చారు.

శివ నిర్వాణ గారు.. ఇరుముడి సినిమా చాలా పెద్ద విజయం సాధించింది. అద్భుతమైన కలెక్షన్స్ వస్తున్నాయి. ప్రేక్షకుల్ని ఇంతలా కనెక్ట్ చేసిన అంశం ఏమిటని దర్శకుడుగా మీరు భావిస్తున్నారు?
-ఎమోషన్, అలాగే రియలిస్టిక్ వరల్డ్. నేను తీసుకున్న మూడు లేయర్స్.. వాటి బ్లెండింగ్ సూపర్‌గా వర్కౌట్ అయింది. అలాగే ఎమోషనల్‌గా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ప్రతి ఇంట్లో ఈ సినిమా చూసిన వాళ్లు.. ఇది మన కథ, మన ఇంట్లో ఒక ఆడపిల్ల కథ, మన అమ్మానాన్నల కథ అనే ఫీలింగ్ తీసుకొచ్చింది. అదే ఆడిటోరియంలో ఎక్స్‌ట్రార్డినరీగా వర్కౌట్ అయింది.

-కొన్ని విషయాలు హార్డ్‌గా చెప్పాలి. థియేటర్‌లో కదిలించేలా ఉండాలి. నేను కథ రాస్తున్నప్పుడే అలా ప్రేక్షకుల్ని కుదిపేసి, అంత గట్టిగా రాయాలి అనుకున్నాను.

-ఈ సినిమా కథ అనుకున్నప్పుడే రవితేజ గారిని చాలా కొత్తగా ప్రేక్షకులు చూడబోతున్నారు అనిపించింది. ఈరోజు అదే ఆడియన్స్‌లో అదే ఫీలింగ్ కలిగింది. ప్రేక్షకులు ఆయన్ని త్రినాధ్ పాత్రలోనే చూశారు. అది బ్యూటిఫుల్‌గా వర్కౌట్ అయింది. ఇలాంటి కథతో రవితేజ గారితో సినిమా చేయడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.

రవి గారు.. ఇరుముడి ఇంకా ఎంత పెద్ద రేంజ్‌కి వెళ్తుంది అనేది మీకు ఒక ఐడియా ఉందా?
-మేము ఈ సినిమా రిలీజ్ చేసినప్పుడు మంచి ఫలితం వస్తుందని అనుకున్నాము. కాకపోతే మేము ఊహించిన దాని కంటే అద్భుతమైన ఫలితం వచ్చింది. ఈ సినిమా ఫుట్‌ఫాల్ సెన్సేషనల్‌గా ఉన్నాయి. కేవలం నైజాంలోనే సుమాఋ 42 లక్షల మంది ఇప్పటివరకు చూశారు. ఫైనల్ నెంబర్ ఎంత ఉంటుందో ఐడియా లేదు. సినిమా అంతమందికి రీచ్ అయిందని ఆనందం అందరికీ ఉంది.

నవీన్ గారు.. 200 కోట్ల పోస్టర్ చూసిన తర్వాత హీరో గారి రెస్పాన్స్ ఏమిటి?
- మేము ప్రతిరోజు ఈ సినిమా కలెక్షన్స్ గురించి మాట్లాడుకుంటాం. ఇలాంటి సక్సెస్ కెరీర్‌లో ఎవరికైనా ఒకసారి లేదా రెండుసార్లు మాత్రమే వస్తుంది. ఈ సక్సెస్ విషయంలో రవితేజ గారు, మేము చాలా హ్యాపీగా ఉన్నాం.

-ఈ సినిమా మాకు ప్రతిరోజు సర్ప్రైజ్ ఇస్తుంది. ఈ మధ్యకాలంలో సినిమాలు రెండు వారాలు, మూడు వారాలే ఆడితే ఎక్కువ అనే పరిస్థితి ఉంది. కాకపోతే ఈ సినిమా ట్రెండ్ మార్చేసింది. ఈ సినిమా రోజురోజుకీ టాక్ పెరుగుతోంది.

శివ గారు.. ఈ సినిమా విషయంలో మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి?
-ఈ సినిమాలో ఒక మంచి సందేశం ఉంటుందని నాకు తెలుసు. కాకపోతే అదేదో మేము ఒక మెసేజ్ ఇస్తున్నట్టుగా చెప్పలేదు. అది ఆడియన్స్ అర్థం చేసుకున్నారు.. ఈ సినిమా చూస్తున్నప్పుడు తండ్రి కూతుళ్లు చాలా ఎమోషనల్ అవ్వడం, అలాగే చాలా పెద్దవాళ్లు, అమ్మమ్మలు, బామ్మలు కూడా ఈ సినిమాకి రావడం చూస్తున్నప్పుడు మాకు చాలా సంతృప్తి కలిగింది.

-ఒక ప్రేక్షకుడిగా ఇంతమంది మహిళలు థియేటర్లకు తరలిరావడం నేనెప్పుడూ చూడలేదు. అందుకే ఈ వేడుకకు జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ అని పేరు పెట్టారు. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల ఇలా మూడు జనరేషన్స్ చూసిన సినిమా కాబట్టి దీన్ని మేము జెనరేషనల్ బ్లాక్‌బస్టర్ అని పేరు పెట్టాం.

-ఇంతకుముందు శివ నిర్వాణ సినిమా అంటే ‘నిన్ను కోరి’, మజిలీ, ‘ఖుషి’.. ఇలా ఉండాలని అనుకునేవారు. కాకపోతే ‘ఇరుముడి’ తర్వాత శివ నిర్వాణ సినిమా ఎలా అయినా ఉండొచ్చు అని ప్రేక్షకుల నుంచి కాంప్లిమెంట్స్ వస్తున్నాయి. అది నాకు చాలా కిక్కించింది.

నవీన్ గారు.. ఈ సినిమాకి షీల్డ్ ఫంక్షన్, విజయోత్సవ వేడుక ఎప్పుడు నిర్వహిస్తున్నారు?
-కచ్చితంగా ప్లాన్ చేస్తున్నాము. ఈ నెల 10న వేడుక ఉండవచ్చు. ఆ వేడుక చాలా గ్రాండ్‌గా చేస్తాం.

-‘ఇరుముడి’ సినిమా ఒక మిరాకిల్. బ్యానర్‌లో ఎన్నో బిగ్గెస్ట్ హిట్ సినిమాలు ఉన్నాయి. కాకపోతే ఇది నెక్స్ట్ లెవెల్. అభినందనలు గానీ, కలెక్షన్స్ గానీ ఒక మూమెంట్‌లాగా వస్తున్నాయి. ఇలాంటి విజయాలు దశాబ్దానికి, రెండు దశాబ్దాలకు ఒకసారి జరుగుతాయి. అలాంటి సినిమా డైరెక్టర్ శివ మాకు చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.

-సినిమాకి పూనకం వస్తే అది బ్లాక్‌బస్టర్, ప్రేక్షకుడికి వస్తే అది ‘ఇరుముడి’ అని విజయవాడలో నాకు ఒక స్నేహితుడు చెప్పాడు. ఆ మాట విన్న తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది.

-శివ గారు.. సినిమాలో రామ్ చరణ్ గారు కనిపిస్తారని సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయ్యప్ప స్వామి మాల చరణ్ గారు వేస్తుంటారు. ఆయనతో ఇలాంటి సినిమా చేసే ఆలోచన ఉందా?
-నిజంగా చరణ్ గారు ఈ సినిమాలో కనిపించి ఉంటే అదొక అద్భుతం. కాకపోతే మేము చాలా ఆర్గానిక్‌గా ఈ కథకి ఏం కావాలో అది చేసుకుంటూ వెళ్లాం. కానీ సోషల్ మీడియాలో అభిమానుల నుంచి చరణ్ గారు కనిపిస్తే చాలా బాగుంటుందని ఆలోచన వచ్చింది. నిజంగా అలాంటి కథ ఆర్గానిక్‌గా కుదిరినప్పుడు అది చరణ్ గారు చేస్తే.. అద్భుతం.

రవి గారు.. ఈ సినిమా విజయాన్ని దిల్ రాజు గారు కూడా సెలబ్రేట్ చేసుకుంటామన్నారు. మీ ప్రొడ్యూసర్స్ కమ్యూనిటీలో రెస్పాన్స్ ఎలా ఉంటుంది?
-ఒక సినిమా ఆడిందంటే నెక్స్ట్ సినిమాకి అడ్వాంటేజ్ ఉంటుంది. పరిశ్రమలో అందరూ హెల్తీగా ఉంటారు. ఎవరి సినిమా ఆడినా మిగతా వాళ్లు హ్యాపీగా ఉంటారు. దిల్ రాజు గారు అజాతశత్రువు. అందరూ బాగుండాలని కోరుకునే మనిషి.

నక్షత్ర.. తెలుగులో తొలిసారి చేసిన ఈ సినిమాకి ఘనమైన విజయం అందుకున్నారు కదా. ఎలా అనిపిస్తుంది?
-చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ గారు నాకు చాలా సపోర్ట్ చేశారు. ఈ సినిమా ఇంత పెద్ద విజయం సాధించడం నాకు చాలా హ్యాపీగా ఉంది.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved