pizza

Itlu Mee Yedhava on 21 Nov
యూత్‌ఫుల్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ 'ఇట్లు మీ ఎదవ' మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ (నిజాం), ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్(ఆంధ్ర, సీడెడ్) ద్వారా నవంబర్ 21న గ్రాండ్ గా రిలీజ్

You are at idlebrain.com > news today >

14 November 2025
Hyderabad

త్రినాధ్ కఠారి హీరోగా ఆయన స్వీయ దర్శకత్వంలో సంజీవని ప్రొడక్షన్స్ బ్యానర్ పై నిర్మాత బళ్లారి శంకర్ నిర్మిస్తున్న యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్‌ ఇట్లు మీ ఎదవ. సాహితీ అవాంచ హీరోయిన్ గా నటిస్తున్నారు. వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమా ట్రైలర్ మంచి రెస్పాన్స్ తో సినిమాపై అంచనాలు పెంచాయి.

నవంబర్ 21న ఈ సినిమా విడుదల కానుంది. నైజాంలో ఈ చిత్రాన్ని మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ LLP విడుదల చేయనుండగా, ఆంధ్ర, సీడెడ్ లో ప్రైమ్ షో ఎంటర్‌టైన్‌మెంట్ రిలీజ్ చేయనుంది. ఈ రెండు ప్రముఖ సంస్థల భాగస్వామ్యంతో సినిమా గ్రాండ్ గా విడుదల కానుంది.

ఈ చిత్రంలో తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్ కీలక పాత్రలు పోషించారు. R P పట్నాయక్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి జగదీష్ చీకటి డీవోపీ, ఎడిటర్ ఉద్ధవ్ SB.

తారాగణం: త్రినాధ్ కఠారి, సాహితీ అవాంచ, తనికెళ్ల భరణి, గోపరాజు రమణ, దేవీ ప్రసాద్, నవీన్ నేని, సురభి ప్రభావతి, మధుమణి, తాగుబోతు రమేష్, చలాకీ చంటి, జబర్దస్త్ నూకరాజు, జెమినీ సురేష్, డీడీ శ్రీనివాస్, రామజగన్

టెక్నికల్ టీం
రచన, దర్శకత్వం: త్రినాధ్ కటారి
నిర్మాత: బళ్లారి శంకర్
బ్యానర్: సంజీవని ప్రొడక్షన్స్
డీవోపీ: జగదీష్ చీకటి
సంగీతం: R P పట్నాయక్
ఎడిటర్: ఉద్ధవ్ SB
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: మల్లికార్జున్
లైన్ ప్రొడ్యూసర్: బృంధావన్ కేతిరెడ్డి
కాస్ట్యూమ్ డిజైనర్: బృందావర్ధని అవ్వారు


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved