pizza

Itlu Mee Yedhava title glimpse out
"ఎదవలు ప్రేమించకూడదా" అంటూ 'ఇట్లు మీ ఎదవ' గ్లింప్స్!

You are at idlebrain.com > news today >

20 September 2025
Hyderabad

A new title glimpse was unveiled today, and the title itself sounds quite unusual. The intro hints that the story too might take a fresh route. The protagonist is introduced with a striking line — “Do idiots like me even deserve to be loved or not?”

The film is titled "Itlu Mee Yedhava" (Yours truly, Idiot).

The dialogues from the hero — “Do you need a job, money, status, and all such qualifications even to love someone? Can’t we love without any of these?” — give the impression of an average youngster’s love story. But to know where this common man's love story eventually leads, we’ll have to wait for the film’s release, which comes with the intriguing tagline: “May righteousness flourish for a thousand years.”

In this film, Trinath Katari plays the lead role and also directs the film. Sahithi Avancha is cast opposite him as the female lead. The cast also includes Tanikella Bharani, Deviprasad, Goparaju Ramana, Madhumani, and Surabhi Prabhavathi in supporting roles.

Produced by Ballari Shankar under the Sanjeevani Productions banner, the film marks the comeback of music director RP Patnaik after a long time. Jagadeesh Chikati is serving as the cinematographer (DOP) for the project.

"ఎదవలు ప్రేమించకూడదా" అంటూ 'ఇట్లు మీ ఎదవ' గ్లింప్స్!

మరో కొత్త టైటిల్ గ్లింప్స్ ఒకటి ఈరోజు బయటకు వచ్చింది. పేరు కూడా కొత్తగానే ఉంది. కథ కూడా కొత్తరకంగానే ఉంటుందేమో అన్నట్టే "నాలాంటి ఎదవలకు ప్రేమించే అర్హత ఉందా లేదా" అంటూ కథానాయకుడి పరిచయం సాగింది. ఆ సినిమా పేరే 'ఇట్లు మీ ఎదవ'. "ప్రేమించడానికి కూడా ఉద్యోగం డబ్బు హోదా ఇలాంటి అర్హతలన్నీ ఉండాలా, ఇవేవీ లేకపోతే ప్రేమించకూడదా" అంటూ హీరో చెప్తున్న డైలాగ్స్ చూస్తుంటే ఇదేదో సగటు కుర్రాడి ప్రేమ కథలాగే కనిపించినా, ఆ సగటు కుర్రాడి ప్రేమ కథ ఎటువైపు మలుపులు తిరిగిందో చూడాలంటే 'ఇట్లు మీ ఎదవ' క్రింద క్యాప్షన్ "వెయ్యేళ్ళు ధర్మంగా వర్ధిల్లు" రిలీజ్ వరకూ ఎదురుచూడాల్సిందే.

ఈ సినిమాలో హీరోగా త్రినాథ్ కటారి నటిస్తుండగా, ఆయన సరసన సాహితి ఆవంచ కథానాయికగా కనిపించబోతున్నారు. హీరో త్రినాథ్ కటారే ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహిస్తున్నారు. తనికెళ్ళ భరణి, దేవిప్రసాద్, గోపరాజు రమణ, మధుమణి మరియు సురభి ప్రభావతి ఇతర పాత్రల్లో కనిపించబోతున్నారు. 'సంజీవని ప్రొడక్షన్స్' నిర్మాణంలో బళ్లారి శంకర్ ఈ సినిమాను నిర్మించగా, చాలాకాలం తరువాత సంగీత దర్శకుడు RP పట్నాయక్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించడం గమనార్హం. DOP గా జగదీశ్ చీకటి ఈ సినిమాకు తన సేవలను అందిస్తున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved