pizza

Vennela Kishore 1st look from Jet Lee
సత్య, రితేష్ రానా, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, మైత్రి మూవీ మేకర్స్ 'జెట్లీ' నుంచి వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ రిలీజ్

You are at idlebrain.com > news today >

25 December 2025
Hyderabad

టాలీవుడ్ ఫేవరేట్ ద్వయం సత్య, దర్శకుడు రితేష్ రానా 'జెట్లీ'తో అలరించబోతున్నారు. మేకర్స్ ముందుగా రిలీజ్ చేసిన పోస్టర్స్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. క్లాప్ ఎంటర్టైన్మెంట్ చిరంజీవి (చెర్రీ), హేమలత పెద్దమల్లు నిర్మిస్తున్న జెట్లీని మైత్రి మూవీ మేకర్స్ సమర్పిస్తున్నారు.

మేకర్స్ క్రిస్మస్ విషెస్ అందిస్తూ ఈ సినిమా నుంచి వెన్నెల కిషోర్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. విమానం విండో సీట్ దగ్గర వెన్నెల కిషోర్ కూర్చుని స్టైలిష్ హెయిర్‌స్టైల్‌తో కాన్ఫిడెంట్‌గా చూస్తున్న లుక్ ఆకట్టుకుంది. వెన్నెల కిషోర్ చేతిలో వున్న సినిమా సుదోకు బుక్ రితేష్ రానా మార్క్ ఫన్ తో అలరించింది.

రితేష్ రానా అద్భుతమైన నేరేషన్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ విజన్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యాకింగ్… అన్నీ కలిసి ‘జెట్లీ’ అద్భుతమైన ఎంటర్‌టైనర్‌ కానుంది.

జెట్లీ తో మిస్ యూనివర్స్ ఇండియా రియా సింఘా హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి అడుగుపెడుతోంది. అజయ్ ఈ ప్రాజెక్ట్‌లో కీలక పాత్ర పోషిస్తున్నారు.

రితేష్ రానా గత హిట్లకు పని చేసిన కోర్ టెక్నికల్ టీం ఈ సినిమాకి వర్క్ చేస్తుంది. సంగీతం కాల భైరవ, సినిమాటోగ్రఫీ సురేష్ సరంగం, ఎడిటింగ్ కార్తిక శ్రీనివాస్, ప్రొడక్షన్ డిజైన్ నార్ని శ్రీనివాస్.

రితేష్ రానా సిగ్నేచర్ ఎంటర్టైన్మెంట్. క్లెవర్ రైటింగ్, యూనిక్ క్యారెక్టర్స్ తో జెట్లీ అలరించబోతుంది.

తారాగణం: సత్య, రియా సింఘా, వెన్నెల కిషోర్, అజయ్ తదితరులు

టెక్నికల్ టీం :
దర్శకత్వం: రితేష్ రానా
నిర్మాతలు: క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్, చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు
సమర్పణ: మైత్రి మూవీ మేకర్స్ (నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి)
కథ - స్క్రీన్‌ప్లే: రితేష్ రానా & జయేంద్ర ఎరోలా
డైలాగ్స్: రితేష్ రానా
సంగీతం: కాల భైరవ
D.O.P: సురేష్ సారంగం
ఎడిటింగ్: కార్తీక శ్రీనివాస్
కాస్ట్యూమ్ డిజైనర్, స్టైలిస్ట్: తేజ ఆర్
ప్రొడక్షన్ డిజైనర్: నార్ని శ్రీనివాస్
యాక్షన్ కొరియోగ్రఫీ: వింగ్ చున్ అంజి
కో-డైరెక్టర్: చుక్కా విజయ్ కుమార్
డైరెక్షన్ గ్యాంగ్: ప్రభావ్ కర్రి, పి.వి.సాయి సోమయాజులు, విక్రమ్ రామిరెడ్డి, కౌశిక్ రాజు
పోస్టర్స్: శ్యామ్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved