ప్రముఖ రాజకీయ నాయకుడు, వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి, రాధా కృష్ణ దర్శకత్వం వహించిన యూత్ ఎంటర్‌టైనర్ 'జూనియర్'తో హీరోగా అరంగేట్రం చేస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. జెనీలియా కీలక పాత్ర పోషిస్తున్నారు. వారాహి చలన చిత్రం బ్యానర్‌పై రజని కొర్రపాటి నిర్మిస్తున్నారు. ఈ సినిమా పాటలు చార్ట్‌బస్టర్ హిట్ అయ్యాయి. టీజర్, ట్రైలర్ కి ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రానికి స్టార్ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ డివోపీగా పని చేస్తున్నారు. సినిమా జూలై 18న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలని పంచుకున్నారు.
దాదాపు 13 ఏళ్ల తర్వాత సౌత్ సినిమా సినిమా చేస్తున్నారు. జూనియర్ లో మిమ్మల్ని అంతగా ఎట్రాక్ట్ చేసిన ఎలిమెంట్ ఏమిటి?
- ఈ ప్రాజెక్టు మూడేళ్ల క్రితం నా దగ్గరికి వచ్చింది. అయితే చేయాలా వద్దా అనేది ఇంకా డిసైడ్ చేసుకోలేదు. రితేష్ ఈ కథ గురించి నాకు చాలా పాజిటివ్ గా చెప్పారు. ఒకసారి విన్న తర్వాత నిర్ణయం తీసుకో అన్నారు. దర్శకుడు ఆ కథ, అందులో నా పాత్రను చెప్పిన విధానం నాకు ఎంతగానో నచ్చాయి.
నేను బిగినింగ్ నుంచి ఎప్పుడూ చేయని కొత్త క్యారెక్టర్స్ చేయాలనే ఉద్దేశంతోనే సినిమాలు చేస్తూ వచ్చాను. ఇందులో నా పాత్ర చాలా స్పెషల్. ఇప్పటి వరకు ఇలాంటి క్యారెక్టర్ చేయలేదు. అందుకే తప్పకుండా సినిమా చేయాలి అనిపించి చేశాను.
ఈ సినిమా ఒక అద్భుతమైన ప్యాకేజ్. దేవి శ్రీ ప్రసాద్, సెంథిల్ కుమార్ వీళ్ళ అందరితో పనిచేయడం రీయునియన్ లా అనిపించింది.
ట్రైలర్ లో చూసినప్పుడు మీ క్యారెక్టర్ చాలా సీరియస్ గా ఉంటుందని అనిపించింది?
-సీరియస్ అనడం కంటే ఒక మంచి బాస్ క్యారెక్టర్. సినిమా ముందుకెళ్తున్న కొద్ది ఆ క్యారెక్టర్ లో చాలా మార్పులు వస్తాయి. అవన్నీ కూడా చాలా కొత్తగా ట్రీట్ చేశారు డైరెక్టర్.
కిరీటి గురించి?
-నేను ఇప్పటివరకు చాలామంది కొత్త నటులతో పనిచేశాను. అయితే కిరీటి మాత్రం చాలా కాన్ఫిడెంట్ యాక్టర్. అద్భుతమైన డాన్సర్, పెర్ఫార్మెన్స్ అన్ని వండర్ఫుల్ గా చేశాడు. చాలా హార్డ్ వర్కింగ్ చేసి కంప్లీట్ ఎఫర్ట్ పెట్టాడు.
సెంథిల్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది?
-మేము కలిసి సై సినిమా చేశాం. ఆయన బాహుబలి ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన సినిమాలు చేసి వచ్చారు. చాలా రోజుల తర్వాత ఆయనతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా అనిపించింది.
మీరు కెరీర్ చాలా పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు సినిమాలకి బ్రేక్ ఇచ్చారు కదా..ఆ రిగ్రేట్ ఏమైనా ఉందా?
-లేదండి. జీవితమన్నప్పుడు అన్ని ఉంటాయి. అయితే ఎన్నో అద్భుతమైన సినిమాలు చేశాను. బొమ్మరిల్లు హాసిని వెరీ మెమొరబుల్ క్యారెక్టర్. అలాగే హ్యాపీలో మధుమతి, కథ సినిమా.. ఇప్పటికీ ఆడియన్స్ నా క్యారెక్టర్స్ పేరుతోనే నన్ను పిలుస్తుంటారు. అది ఒక నటిగా చాలా గొప్ప ఆనందాన్ని ఇస్తుంది.
యాక్టింగ్ ని ఇకపై కొనసాగిస్తారా?
-కచ్చితంగా. మంచి క్యారెక్టర్స్ వస్తే నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను. చిన్న క్యారెక్టర్ అయినా గుర్తుండిపోయే క్యారెక్టర్ చేయడం నాకు ఇష్టం.
జూనియర్ సినిమా లో ఆడియన్స్ మిమ్మల్ని ఎలా చూడబోతున్నారు?
-నిజానికి ఇప్పుడు ఇప్పటివరకు చేయని క్యారెక్టర్ ఈ సినిమాలో చేశాను. ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారనే ఎక్సయిట్మెంట్ నాకూ ఉంది. జూలై 18 కోసం ఎదురుచూస్తున్నాను.
మీకు డ్రీమ్ రోల్స్ ఏమైనా ఉన్నాయా?
-ఇండస్ట్రీలోకి రావడం, ఇన్ని పాత్రలు చేయడం, ప్రేక్షకుల నుంచి విశేషమైనటువంటి అభిమానాలు పొందడం ఇదంతా కూడా నాకు ఒక డ్రీమ్ లాగా అనిపిస్తుంది. ఇంతకుమించిన డ్రీమ్ ఏమీ లేదు.
శ్రీలీల గురించి?
-శ్రీలీల అమేజింగ్ డాన్సర్. అద్భుతమైన పెర్ఫార్మర్. చాలా ఎనర్జిటిక్ గా ఉంటుంది.
దేవిశ్రీప్రసాద్ మ్యూజిక్ గురించి?
-దేవిశ్రీప్రసాద్ అద్భుతమైన కంపోజర్. ఆయన ఒక సినిమాలో ఉండడం బ్లెస్సింగ్. ఆయన చాలా పాజిటివ్ గా ఉంటారు. ప్రతి సినిమాకి ఒక అద్భుతమైన ఎనర్జీ తీసుకొస్తారు. ఇందులో వైరల్ వయ్యారి పాట సూపర్ హిట్ అయింది. రితేష్ కి కూడా ఆ పాత చాలా ఇష్టం.
నిర్మాత సాయి గారి గురించి?
-ఈ ప్రాజెక్ట్ గురించి సాయిగారే చెప్పారు. చాలా సపోర్ట్ చేశారు. చాలా కేర్ తీసుకున్నారు. సినిమాని ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా గ్రాండ్ గా నిర్మించారు.
బొమ్మరిల్లులో కోట శ్రీనివాసరావు గారు లాంటి గొప్ప నటుడుతో నటించారు కదా.. ఆ ఎక్స్పీరియన్స్ గురించి?
-కోట శ్రీనివాసరావు గారు లాంటి గొప్ప నటుడితో నటించడం నా అదృష్టం. ఆయన నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. ఆయన లేకపోవడం సినిమా పరిశ్రమకు తీరని లోటు.
రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్ గారు, బన్నీ గారు.. ఇప్పుడు పెద్ద పాన్ ఇండియా సినిమాలు చేస్తున్నారు కదా.. మీ కోస్టార్స్ గా ఎలా అనిపిస్తుంది?
-వాళ్లందరూ కూడా నా ఫ్రెండ్స్. చాలా అద్భుతమైన ప్రతిభ ఉన్న హీరోస్. ఇప్పుడు వారిని సూపర్ స్టార్స్ గా చూస్తున్నప్పుడు చాలా ఆనందంగా అనిపిస్తుంది.
రితేష్ గారితో సినిమా చేసే ఆలోచన ఉందా ?
-మజిలీ రీమేక్ చేశాం. అది అద్భుతమైన విజయాన్ని ఇచ్చింది. మరో మంచి లవ్ స్టోరీ కుదిరితే సినిమా చేయాలని ఆలోచన అయితే ఉంది.