pizza

On The Occasion Of Kiran Abbavaram’s Birthday, Team Behind His Most Ambitious Project #KA13, Produced By Sudhakar Chaganti Of Joy Films, Unveiled BTS Video Packed With Laughs, Emotions & Full-On Fun
కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా 'జాయ్ ఫిల్మ్స్' బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న కిరణ్ అబ్బవరం అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం #KA13 'బిహైండ్-ది-సీన్స్' (BTS) వీడియో రిలీజ్- అందరినీ అలరిస్తోన్న ఎమోషన్ & ఫుల్ ఫన్ వీడియో

You are at idlebrain.com > news today >

15 July 2026
Hyderabad

Riding high on the phenomenal success of Ka and K-Ramp, Promising Hero Kiran Abbavaram is currently busy with his most ambitious venture to date- #KA13. After proving his storytelling prowess with SR Kalyanamandapam, the actor has now taken full creative ownership of his next film by serving as the lead actor, story writer, screenplay writer, and director. The untitled entertainer is being bankrolled by leading overseas distributor Sudhakar Chaganti, who is making his production debut under the Joy Films banner, while Suresh Yerra joins as co-producer. Designed on a lavish canvas, the film boasts the highest budget ever allocated to a Kiran Abbavaram project. The first announcement poster already grabs attention with its quirky tagline, "Ek Dum Bindass Pakaane Waale."

Marking Kiran Abbavaram's birthday, the makers have unveiled an engaging making video from the film's first schedule, which has now been successfully wrapped up. Packed with energetic behind-the-scenes moments, the video captures the warm camaraderie and celebratory spirit shared by the cast and crew on set.

Taking on multiple responsibilities as the film's hero, writer, and director, Kiran Abbavaram emerges as the driving force behind the project. The making video offers a glimpse into his hands-on approach, showcasing him monitoring scenes, guiding fellow actors, discussing shots with the technical team, and seamlessly overseeing the shoot while balancing his on-screen and off-screen duties.

More importantly, the video hints at the film's vibrant entertainment quotient, presenting glimpses of lively moments, and an energetic atmosphere. Going by the footage, the film promises a refreshing and engaging storyline backed by wholesome entertainment, heartfelt emotions, and strong commercial appeal, making it one of Kiran Abbavaram's most exciting ventures to date.

Devika Bhat makes her Telugu cinema debut as the leading lady. Veteran actors Sharat Kumar and Sai Kumar have been roped in for significant roles. The film also features several prominent actors, with each character playing a meaningful role in the narrative.

The film also brings together an accomplished technical team. Cinematography is being handled by Viswas Daniel, while music is scored by Bheems Ceciroleo. Production design is by Sudheer Macharla, and Santhosh Naidu is in charge of editing.

With Kiran Abbavaram enjoying success streak and embracing multiple creative responsibilities for the first time, the project has already generated tremendous curiosity.

Cast: Kiran Abbavaram, Devika Bhat, Sharat Kumar, Sai Kumar, and others

Technical Crew:
Writer, Director: Kiran Abbavaram
Producer: Sudhakar Chaganti
Banner: Joy Films
Co-Producer: Suresh Yerra
Music: Bheems Ceciroleo
DOP: Viswas Daniel
Production Designer: Sudheer Macharla
Editor: Santhosh Naidu
Costume Designer: Rajesh Kamarsu

కిరణ్ అబ్బవరం పుట్టినరోజు సందర్భంగా 'జాయ్ ఫిల్మ్స్' బ్యానర్‌పై సుధాకర్ చాగంటి నిర్మిస్తున్న కిరణ్ అబ్బవరం అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం #KA13 'బిహైండ్-ది-సీన్స్' (BTS) వీడియో రిలీజ్- అందరినీ అలరిస్తోన్న ఎమోషన్ & ఫుల్ ఫన్ వీడియో

'క', 'కె-ర్యాంప్' వరుస విజయాలతో అదరగొడుతున్న యంగ్ హీరో కిరణ్ అబ్బవరం, ప్రస్తుతం తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్ అయిన #KA13తో బిజీగా ఉన్నారు. 'SR కళ్యాణమండపం'తో కథా రచయితగా తన ప్రతిభను నిరూపించుకున్న ఆయన, ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం, హీరోగా అన్ని బాధ్యతలను స్వయంగా స్వీకరించారు. ప్రముఖ ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ చాగంటి 'జాయ్ ఫిల్మ్స్' బ్యానర్‌పై నిర్మాతగా పరిచయమవుతూ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, సురేష్ ఎర్ర సహ-నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ చిత్రం, కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే అత్యధిక బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. దీనికి సంబంధించిన అనౌన్స్మెంట్ పోస్టర్ "Ek Dum Bindass Pakaane Waale" అనే ఆసక్తికరమైన ట్యాగ్‌లైన్‌తో ఇప్పటికే అందరి దృష్టిని ఆకర్షించింది.

కిరణ్ అబ్బవరం పుట్టినరోజును పురస్కరించుకుని, విజయవంతంగా పూర్తయిన ఈ సినిమా మొదటి షెడ్యూల్‌కు సంబంధించిన 'మేకింగ్ వీడియో'ను చిత్ర బృందం విడుదల చేసింది. ఉత్సాహభరితమైన సన్నివేశాలతో కూడిన ఈ వీడియోలో, సెట్‌లో నటీనటులు, సాంకేతిక బృందం మధ్య ఉన్న స్నేహపూర్వక వాతావరణం స్పష్టంగా కనిపిస్తున్నాయి.

హీరోగా, రచయితగా, దర్శకుడిగా మూడు కీలక బాధ్యతలను నిర్వహిస్తున్న కిరణ్ అబ్బవరం ఈ చిత్రానికి ప్రధాన బలంగా నిలుస్తున్నారు. మేకింగ్ వీడియోలో ఆయన సన్నివేశాలను పర్యవేక్షించడం, సహనటులకు సూచనలు ఇవ్వడం, టెక్నికల్ టీమ్‌తో షాట్లపై చర్చించడం, ఒకేసారి కెమెరా ముందు-వెనుక సమర్థంగా బాధ్యతలు నిర్వర్తించడం కనిపిస్తుంది.

అంతేకాదు, ఈ వీడియో సినిమా ఫన్ పై కూడా ఆసక్తిని పెంచుతోంది. ఇందులో కనిపించిన సరదా సన్నివేశాలు, ఉత్సాహభరితమైన వాతావరణం చూస్తుంటే... పూర్తి స్థాయి ఎంటర్‌టైనర్‌గా, బలమైన భావోద్వేగాలు, కమర్షియల్ అంశాలతో కూడిన కొత్త తరహా కథను ఈ చిత్రం అందించబోతోందనే సంకేతాలు కనిపిస్తున్నాయి. కిరణ్ అబ్బవరం కెరీర్‌లోనే మోస్ట్ ఎవైటెడ్ సినిమాగా నిలుస్తోంది.

ఈ చిత్రంలో దేవికా భట్ తెలుగు చిత్రసీమకు హీరోయిన్‌గా పరిచయం అవుతున్నారు. సీనియర్ నటులు శరత్ కుమార్, సాయికుమార్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వీరితో పాటు మరికొందరు ప్రముఖ నటీనటులు కథలో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో కనిపించనున్నారు.

సాంకేతిక విభాగంలో విశ్వాస్ డేనియల్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, భీమ్స్ సిసిరోలియో సంగీతం సమకూరుస్తున్నారు. సుధీర్ మాచర్ల ప్రొడక్షన్ డిజైనర్‌గా, సంతోష్ నాయుడు ఎడిటర్‌గా పనిచేస్తున్నారు.

వరుస విజయాలతో దూసుకెళ్తున్న కిరణ్ అబ్బవరం తొలిసారి రచన, దర్శకత్వ బాధ్యతలు చేపట్టడంతో ఈ చిత్రంపై ఇప్పటికే భారీ ఆసక్తి నెలకొంది.

నటీనటులు: కిరణ్ అబ్బవరం, దేవికా భట్, శరత్ కుమార్, సాయి కుమార్ మరియు ఇతరులు

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: కిరణ్ అబ్బవరం
నిర్మాత: సుధాకర్ చాగంటి
బ్యానర్: జాయ్ ఫిల్మ్స్
సహ నిర్మాత: సురేష్ ఎర్ర
సంగీతం: భీమ్స్ సిసిరోలియో
సినిమాటోగ్రఫీ (DOP): విశ్వాస్ డేనియల్
ప్రొడక్షన్ డిజైనర్: సుధీర్ మాచర్ల
ఎడిటర్: సంతోష్ నాయుడు
కాస్ట్యూమ్ డిజైనర్: రాజేష్ కామర్సు

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved
s