pizza

Kaaka Diwali Poster: Megastar Chiranjeevi’s Fierce New Avatar Raises Expectations; Worldwide Release On January 13, 2027
మెగాస్టార్ చిరంజీవి ఇంటెన్స్ అవతార్‌తో ‘కాకా’ దీపావళి పోస్టర్ రిలీజ్- ‘కాకా’ 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

08 Novembar 2026
Hyderabad


The highly-anticipated film Kaaka brings together Megastar Chiranjeevi and successful director Bobby Kolli following their blockbuster collaboration Waltair Veerayya. Produced by Venkat K Narayana under the prestigious KVN Productions banner, the film is being mounted on a lavish scale. The title glimpse, released on Chiranjeevi’s birthday, had already generated significant excitement by introducing the actor in intriguing shades. Meanwhile, the makers have extended Diwali wishes with a brand-new poster.

Set against a rain-soaked backdrop, Chiranjeevi is seen standing amid lush green fields, holding a sickle and sporting an uncompromising expression. The poster perfectly reflects the film’s raw and intense world. The poster indeed raised expectations for the movie. The team also confirmed that Kaaka will have a grand worldwide theatrical release on January 13, 2027, making it one of the major Sankranthi attractions.

The film also features an interesting ensemble cast, including Anaswara Rajan, Nivetha Thomas and Bollywood filmmaker-actor Anurag Kashyap in prominent roles. Anaswara was previously introduced as the Heart Of Kaaka, with her character named Ammulu Paapa. Anurag Kashyap’s addition to the cast has also strengthened the film's anticipation.

Adding considerable strength to the project is its technical team. S Thaman is composing the music, while Vijay Karthik Kannan handles cinematography. Avinash Kolla is the production designer, and Antony L Ruben is in charge of editing. Kona Venkat and K Chakravarthy Reddy have penned the screenplay, with additional writing by Hari Mohana Krishna and Vineeth Potluri. Bhanu-Nandu are providing the dialogues.

Cast: Megastar Chiranjeevi, Anaswara Rajan, Anurag Kashyap

Technical Crew:
Writer, Director: Bobby Kolli
Producer: Venkat K Narayana
Banner: KVN Productions
Music: Thaman S
Screenplay Writers: Kona Venkat, K Chakravarthy Reddy
Additional Screenplay Writers: Hari Mohana Krishna, Vineeth Potluri
DOP: Vijay Kartik Kannan
Editor: Antony Ruben
Production Design: Avinash Kolla
VFX Supervisor: Yugandhar T
Dialogues: Bhanu-Nandu
Chief Co-Directors: Bellamkonda Sathyam, Poosala Radhakrishna
Co-Director: V Kranthi Chakravarthi
Executive Producer: Saranya Potla

మెగాస్టార్ చిరంజీవి ఇంటెన్స్ అవతార్‌తో ‘కాకా’ దీపావళి పోస్టర్ రిలీజ్- ‘కాకా’ 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్

మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి కాంబినేషన్‌లో వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘కాకా’. వీరిద్దరి కలయికలో వచ్చిన బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత తెరకెక్కుతున్న సినిమా కావడంతో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రముఖ నిర్మాణ సంస్థ KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె. నారాయణ ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదలైన టైటిల్ గ్లింప్స్‌లో ఆయనను ఆసక్తికరమైన షేడ్స్‌లో పరిచయం చేయడంతో సినిమాపై ఒక్కసారిగా అంచనాలు పెరిగాయి. తాజాగా దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ మేకర్స్ సరికొత్త పోస్టర్‌ను విడుదల చేశారు.

వర్షంతో తడిసిన వాతావరణంలో, పచ్చని పొలాల మధ్య చేతిలో కొడవలి పట్టుకుని ఇంటెన్స్ గా నిలబడిన చిరంజీవి లుక్ ఆకట్టుకుంటోంది. ఈ పోస్టర్ సినిమా రా అండ్ ఇంటెన్స్ ప్రజెంట్ చేస్తోంది. చిరంజీవి ఫియర్స్ అవతార్ సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సందర్భంగా ‘కాకా’ చిత్రాన్ని 2027 జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల చేయనున్నట్లు చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది. దీంతో వచ్చే సంక్రాంతి బరిలో ‘కాకా’ మేజర్ ఎట్రాక్షన్ గా నిలవనుంది.

ఈ చిత్రంలో అనస్వర రాజన్, నివేదా థామస్‌తో పాటు బాలీవుడ్ ఫిల్మ్‌మేకర్, నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే అనస్వర రాజన్‌ను ‘హార్ట్ ఆఫ్ కాకా’గా ఆమె పాత్ర పేరు ‘అమ్ములు పాప’గా పరిచయం చేశారు. అనురాగ్ కశ్యప్ ఈ సినిమాలో భాగం కావడంతో సినిమాపై మరింత ఆసక్తి నెలకొంది.

ఈ ప్రాజెక్ట్‌కు టాప్ టెక్నికల్ టీం పనిచేస్తోంది. ఎస్. తమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైనర్‌గా, ఆంటోనీ ఎల్. రూబెన్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి అడిషినల్ రైటర్స్ గా పనిచేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ అందిస్తున్నారు.

నటీనటులు: మెగాస్టార్ చిరంజీవి, అనస్వర రాజన్, అనురాగ్ కశ్యప్

సాంకేతిక బృందం:
రచన, దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాత: వెంకట్ కె. నారాయణ
బ్యానర్: KVN ప్రొడక్షన్స్
సంగీతం: తమన్ ఎస్
స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె. చక్రవర్తి రెడ్డి
అడిషినల్ స్క్రీన్‌ప్లే: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
సినిమాటోగ్రఫీ: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: ఆంటోనీ రూబెన్
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
వీఎఫ్ఎక్స్ సూపర్‌వైజర్: యుగంధర్ టి
సంభాషణలు: భాను-నందు
చీఫ్ కో-డైరెక్టర్స్: బెల్లంకొండ సత్యం, పూసల రాధాకృష్ణ
కో-డైరెక్టర్: వి. క్రాంతి చక్రవర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య పొట్ల


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved