pizza

Megastar Chiranjeevi Leaks His Character Name As Kadiri Kalidas In Most Successful Director Bobby Kolli, Leading Production House KVN Productions’ Kaaka
మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, కేవీఎన్ ప్రొడక్షన్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కాకా'- కదిరి కాళిదాసుగా తన పాత్ర పేరును లీక్ చేసిన మెగాస్టార్

You are at idlebrain.com > news today >

20 September 2026
Hyderabad

Megastar Chiranjeevi and director Bobby Kolli reunited after the blockbuster success of Waltair Veerayya, and their much-awaited action entertainer Kaaka continues to build hype with every new update. Produced by Venkat K Narayana under the KVN Productions banner, the film is being mounted on a lavish scale with a strong mix of action, emotion and family elements. The film’s title glimpse released on Chiranjeevi’s birthday occasion got thumping response, setting high expectations for the movie.

The latest update has further heightened interest around the project, as Chiranjeevi revealed the name of his character at a recent event. The Megastar will be seen as Kadiri Kalidas in Kaaka, a powerful and striking name that itself hints at the commanding presence of his character in the film.
 
While Kaaka is designed as a high-intensity action entertainer, the film will also feature a strong emotional and family-oriented narrative, making the protagonist’s character arc one of the key attractions.
 
Anaswara Rajan is part of the cast in a pivotal role. The movie features music by S Thaman, cinematography by Vijay Karthik Kannan, production design by Avinash Kolla and editing by Antony L Ruben. Kona Venkat and K Chakravarthy Reddy have penned the screenplay, with additional writing by Hari Mohana Krishna and Vineeth Potluri. Bhanu-Nandu are handling the dialogues.
 
Kaaka is gearing up for a grand theatrical release on January 13, 2027, targeting the Sankranthi festive season.
 
Cast: Megastar Chiranjeevi, Anaswara Rajan
 
Technical Crew:
Writer, Director: Bobby Kolli
Producer: Venkat K Narayana
Banner: KVN Productions
Music: Thaman S
Screenplay Writers: Kona Venkat, K Chakravarthy Reddy
Additional Screenplay Writers: Hari Mohana Krishna, Vineeth Potluri
DOP: Vijay Kartik Kannan
Editor: Antony Ruben
Production Design: Avinash Kolla
VFX Supervisor: Yugandhar T
Dialogues: Bhanu-Nandu
Chief Co-Directors: Bellamkonda Sathyam, Poosala Radhakrishna
Co-Director: V Kranthi Chakravarthi
Executive Producer: Saranya Potla

మెగాస్టార్ చిరంజీవి, బాబీ కొల్లి, కేవీఎన్ ప్రొడక్షన్స్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ 'కాకా'- కదిరి కాళిదాసుగా తన పాత్ర పేరును లీక్ చేసిన మెగాస్టార్

బ్లాక్‌బస్టర్ ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత మెగాస్టార్ చిరంజీవి, సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ బాబీ కొల్లి మరోసారి కలిసి చేస్తున్న యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కే నారాయణ నిర్మిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలను నెలకొల్పుతోంది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన టైటిల్ గ్లింప్స్‌కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.

తాజాగా ఈ సినిమాపై మరింత ఆసక్తిని పెంచే అప్‌డేట్ వచ్చింది. ఓ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి స్వయంగా తన క్యారెక్టర్ పేరును రివీల్ చేశారు. ‘కాకా’లో చిరంజీవి ‘కదిరి కాళిదాస్’గా కనిపించబోతున్నారు. ఈ పవర్‌ఫుల్ పేరు వినగానే సినిమాలో ఆయన క్యారెక్టర్ ఎలా ఉండబోతుందనే ఆసక్తి మరింత పెరుగుతోంది.

‘కాకా’ హై-ఇంటెన్సిటీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో బలమైన ఎమోషన్, ఫ్యామిలీ ఎలిమెంట్స్‌కు కూడా ప్రాధాన్యత ఉంది. దీంతో సినిమాలో కదిరి కాళిదాస్ క్యారెక్టర్ జర్నీ, ఎమోషనల్ ఆర్క్ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనుంది.

ఈ చిత్రంలో అనస్వర రాజన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఎస్. థమన్ సంగీతం అందిస్తుండగా, విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫీ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అవినాష్ కొల్లా ప్రొడక్షన్ డిజైన్ చేస్తున్నారు. ఆంటోనీ ఎల్ రూబెన్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. కోన వెంకట్, కే చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందించగా, హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి రైటర్స్ గా చేస్తున్నారు. భాను-నందు డైలాగ్స్ రాస్తున్నారు.

‘కాకా’ 2027 జనవరి 13న సంక్రాంతి పండుగ సందర్భంగా గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కానుంది.

తారాగణం: మెగాస్టార్ చిరంజీవి, అనశ్వర రాజన్

సాంకేతిక సిబ్బంది:
రచన, దర్శకత్వం: బాబీ కొల్లి
నిర్మాత: వెంకట్ కె నారాయణ
బ్యానర్: కెవిఎన్ ప్రొడక్షన్స్
సంగీతం: థమన్ ఎస్
స్క్రీన్ ప్లే రైటర్స్: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి
అడిషినల్ స్క్రీన్ ప్లే రైటర్స్: హరి మోహన కృష్ణ, వినీత్ పొట్లూరి
DOP: విజయ్ కార్తీక్ కన్నన్
ఎడిటర్: ఆంటోనీ రూబెన్
ప్రొడక్షన్ డిజైన్: అవినాష్ కొల్లా
VFX సూపర్‌వైజర్: యుగంధర్ టి
డైలాగ్స్: భాను-నందు
ముఖ్య కో-డైరెక్టర్లు: బెల్లంకొండ సత్యం, పూసల రాధాకృష్ణ
కో-డైరెక్టర్: వి క్రాంతి చక్రవర్తి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శరణ్య పోట్ల



Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved