pizza

"Emundo Emo" Lyrical Video from Kaamakhya out
అభినయ కృష్ణ, మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ 'కామాఖ్య' నుంచి హార్ట్ ఫుల్ మెలోడీ 'ఏముందో ఏమో' సాంగ్ రిలీజ్

You are at idlebrain.com > news today >

03 July 2026
Hyderabad

సమైరా, సముద్రఖని, అభిరామి ప్రధాన పాత్రల్లో అభినయ కృష్ణ దర్శకత్వంలో రూపొందుతున్న థ్రిల్లింగ్ 'కామాఖ్య'. మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD బ్యానర్ పై వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్, టీజర్, ఫస్ట్ సింగిల్ కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మేకర్స్ ఏముందో ఏమో సాంగ్ ని రిలీజ్ చేశారు.

ఈ హార్ట్ టచింగ్ మెలోడీ ప్రేమ, ఎదురుచూపుల భావాలను ఎంతో అందంగా ఆవిష్కరిస్తుంది. హరి చరణ్ హృదయాన్ని తాకే వాయిస్‌తో పాడిన ఈ పాటకు జ్ఞాని మధురమైన ట్యూన్ అందించారు.

అనంత శ్రీరామ్ రాసిన అర్థవంతమైన లిరిక్స్ ఈ సాంగ్‌కు మరింత అందాన్ని తీసుకొచ్చాయి.

ఈ చిత్రానికి రమేష్ కుశేందర్ రెడ్డి డీవోపీ, వరప్రసాద్ ఎడిటర్.

తారాగణం: సమైరా, సముద్రఖని, అభిరామి, ఆనంద్, శరణ్య ప్రదీప్, వైష్ణవ్, ధనరాజ్, రాఘవ, ఐశ్వర్య

కథ, దర్శకత్వం: అభినయ కృష్ణ
బ్యానర్: మై ఫిల్మ్ ప్రొడక్షన్స్ PVT LTD
నిర్మాతలు: వడ్డేపల్లి శ్రీ వాణీనాథ్, యశ్వంత్ రాజ్
DOP: రమేష్ కుశేందర్ రెడ్డి
క్రియేటివ్ డైరెక్టర్: రిషాన్
సంగీతం: గ్యాని
ఎడిటర్: వరప్రసాద్
ఆర్ట్: భూపతి యాదగిరి
VFX: ఫణి విహారి
ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: శ్రీహరి గౌడ్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved
Energetic Star Ram Pothineni’s Most Ambitious Project #RAPO23, Produced By Krishna Pothineni On Rapo Cinematics, Grand Launch TomorrowEnergetic Star Ram Pothineni’s Most Ambitious Project #RAPO23, Produced By Krishna Pothineni On Rapo Cinematics, Grand Launch Tomorrow