pizza

Kannappa is a Marvel, A Landmark Film, Says Deputy CM Mallu Bhatti Vikramarka after Special Screening
‘కన్నప్ప’ అద్భుతంగా ఉంది.. మైల్ స్టోన్ చిత్రం అవుతుంది.. ప్రత్యేక ప్రదర్శనలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

You are at idlebrain.com > news today >

30 June 2025
Hyderabad

Dynamic Star Vishnu Manchu’s magnum opus Kannappa has been receiving overwhelmingly positive feedback from all quarters. With strong word-of-mouth appreciation, the film's collections have been steadily rising day by day, and theatres are putting up “House Full” boards across the country.

Meanwhile, prominent political figures including Telangana Deputy Chief Minister Mallu Bhatti Vikramarka, Cinematography Minister Komatireddy Venkat Reddy, and Minister Ponnam Prabhakar attended a special screening of Kannappa on Sunday night. They were joined by actor-producer Mohan Babu and lead actor Vishnu Manchu at the event.

After watching the film, Deputy CM Mallu Bhatti Vikramarka said,* “Kannappa has exceeded expectations. It is a marvel. Vishnu has delivered an extraordinary performance as Arjuna, the tribal man, and as Kannappa himself. My congratulations to Mohan Babu garu for producing such a magnificent film. The story, narration, visuals, and acting—everything was impressive. This is truly a milestone film.”

Cinematography Minister Komatireddy Venkat Reddy stated,* “It’s been a long time since I watched such a quality film. My heartfelt thanks to Mohan Babu garu and Vishnu for bringing this to life. The film is crafted in such a way that devotees of Lord Shiva will be deeply moved. We watched it together and thoroughly enjoyed the experience. It’s important to make our stories known to a wider audience. As the Cinematography Minister, I encourage filmmakers to create more films like this, even if only occasionally.”

‘కన్నప్ప’ అద్భుతంగా ఉంది.. మైల్ స్టోన్ చిత్రం అవుతుంది.. ప్రత్యేక ప్రదర్శనలో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క

విష్ణు మంచు ‘కన్నప్ప’ చిత్రానికి అన్ని చోట్లా పాజిటివ్ టాక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక మౌత్ టాక్ పాజిటివ్‌గా ఉండటంతో రోజు రోజుకీ కలెక్షన్స్ పెరుగుతున్నాయి. అన్ని చోట్లా హౌస్ ఫుల్ బోర్డులు పడుతున్నాయి. ఈ క్రమంలో కన్నప్ప సినిమాను రాజకీయ ప్రముఖులు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క, సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ వంటి వారు ఆదివారం రాత్రి ప్రత్యేకంగా వీక్షించారు. వీరితో పాటుగా మోహన్ బాబు, విష్ణు వంటి వారు కూడా ఈ స్పెషల్ స్క్రీనింగ్‌లో సందడి చేశారు.

‘కన్నప్ప’ చిత్రాన్ని వీక్షించిన అనంతరం డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క మాట్లాడుతూ* .. ‘‘కన్నప్ప’ చిత్రం ఊహకు మించి ఉంది. అర్జునుడిగా, తిన్నడిగా, కన్నప్పగా విష్ణు అద్భుతంగా నటించారు. ఇంత గొప్ప చిత్రం నిర్మించిన మోహన్ బాబు గారికి అభినందనలు. కథ, కథనం, విజువల్స్, యాక్టింగ్ అన్ని ఇలా గొప్పగా అనిపించాయి. ఇదొక మైల్ స్టోన్ చిత్రం అవుతుంది’ అని అన్నారు.

సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ* .. ‘చాలా రోజుల తరువాత మంచి చిత్రాన్ని చూశాను. ఇంత గొప్ప చిత్రాన్ని నిర్మించిన మోహన్ బాబు గారికి, విష్ణుకి ధన్యవాదాలు. శివ భక్తులంతా పరవశించి పోయేలా మూవీని తీశారు. మేం అంతా కలిసి ఈ మూవీని చూసి ఎంతో ఆనందించాం. మన కథను అందరికీ తెలిసేలా చేయాలి. ఇలాంటి చిత్రాల్ని అప్పుడప్పుడు అయినా తీయాలని సినిమాటోగ్రఫీ మినిస్టర్‌గా నేను అందరినీ కోరుతున్నాను’ అని అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved