pizza

Thammudu Sends Best Wishes to Kannappa Without Mentioning His Anna!
అన్నగురించి ప్రస్తావించకుండానే కన్నప్పకు బెస్ట్ విషెస్ చెప్పిన తమ్ముడు!

You are at idlebrain.com > news today >

26 June 2025
Hyderabad

Kannappa is hitting theatres tomorrow, and like everyone else, Manchu Manoj took to Twitter to extend his best wishes for the film’s success. However, what stood out in his tweet was the complete absence of any mention of his elder brother, Manchu Vishnu. Despite examining the tweet closely, Vishnu’s name was nowhere to be found.

Manoj highlighted their father Mohan Babu’s years of dedication to the Kannappa project and wished that his hard work be rewarded with success. Though he avoided mentioning his brother, he did express joy by referring to Vishnu’s children.

He called Kannappa the “dream project” of Tanikella Bharani, and went on to mention names like Akshay Kumar, Prabhas, and Prabhu Deva, hoping that Lord Shiva blesses the film with grand success.

అన్నగురించి ప్రస్తావించకుండానే కన్నప్పకు బెస్ట్ విషెస్ చెప్పిన తమ్ముడు!

కన్నప్ప సినిమా రేపు థియేటర్ల లోకి రాబోతుంది. అందరిలాగే మంచు మనోజ్ కన్నప్ప సినిమా విజయవంతం కావాలని తన ట్విట్టర్ వేదికగా ఒక ఆసక్తికర ట్వీట్ పెట్టారు. కానీ ఆ ట్వీట్ మొత్తాన్ని భూతద్దం పెట్టి వెతికినా అన్న మంచు విష్ణు ప్రస్తావనే లేదు. అతని పేరు కూడా పలకలేదు. తమ తండ్రి మోహన్ బాబు గారు కన్నప్ప సినిమా కోసం ఎన్నో ఏళ్ల శ్రమను వెచ్చించారన్నారు. ఆయన కష్టానికి విజయం రూపంలో ఫలితం రావాలన్నారు. అన్నయ్య పేరుని ప్రస్తావించకపోయినా అతని పిల్లల పేర్లు ప్రస్తావిస్తూ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ కథ తెరకెక్కడం తనికెళ్ళ భరణి గారి జీవితాశయం అన్నారు. అక్షయ్ కుమార్, ప్రభాస్, ప్రభుదేవాల పేర్లను ప్రస్తావన చేస్తూ, ఆ మహా శివుణ్ణి ఈ సినిమా విజయవంతం చేయమని కోరుకుంటున్నట్టు వేడుకున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved