pizza

“Didn’t Expect Anna Vishnu to Perform So Well in Kannappa” – Manchu Manoj
అన్న విష్ణు కన్నప్పలో ఇంత బాగా చేస్తాడని ఊహించలేదు - మంచు మనోజ్!

You are at idlebrain.com > news today >

27 June 2025
Hyderabad

Manchu Manoj’s reaction after watching Kannappa came as a relief to fans of the Manchu family. While his tweet yesterday mentioned everyone from Prabhas to Akshay Kumar and Prabhu Deva, he notably did not mention his brother Manchu Vishnu. He praised their father Mohan Babu, saying he had worked hard for years on Kannappa and expressed his hope for the film’s grand success.

In return, during the Kannappa press meet yesterday, when a journalist brought up Manoj’s tweet, Vishnu dodged the question and did not offer a response.

However, with today’s developments, Manchu family fans feel there might be a chance for the strained relations within the family to ease. Manoj praised Kannappa, saying the film was very well made, and that Prabhas’s entry took the film to the next level. He called the climax outstanding and admitted, “I didn’t expect my brother Vishnu to act so well.”

Speaking about their father Mohan Babu, he said, “Do I even need to speak about his performance? He was phenomenal.” Manoj added that he’s praying for the film to do well and recover its investment. “I missed the first five minutes of the film today,” he said, “and I’m going again tomorrow just to watch those five minutes.”

అన్న విష్ణు కన్నప్పలో ఇంత బాగా చేస్తాడని ఊహించలేదు - మంచు మనోజ్!

మంచు మనోజ్ కన్నప్ప సినిమా చూసిన తరువాత స్పందించిన విధానం మంచు కుటుంబ అభిమానులకు కాస్త ఊరటనిచ్చే అంశం. నిన్నటి తన ట్వీట్లో అందరినీ ప్రస్తావించినా, తన అన్నయ్య మంచు విష్ణు గురించి మాత్రం ప్రస్తావనే చేయలేదు. ప్రభాస్. అక్షయ్ కుమార్, ప్రభుదేవా పేర్లను ప్రస్తావిస్తూ తమ తండ్రి మంచు మోహన్ బాబు గారు కన్నప్ప సినిమా కోసం ఎన్నో ఏళ్లుగా కష్టపడుతున్నారని, కన్నప్ప పెద్ద విజయం సాధించాలని కోరారు. అందుకు ప్రతిగా నిన్న కన్నప్ప మీడియా సమావేశంలో తమ్ముడి ట్వీట్ ప్రస్తావనను మీడియా ప్రతినిధి ఒకరు తెచ్చినా, ఆ ప్రశ్నకు సమాధానం దాటవేశారు మంచు విష్ణు.

కానీ ఈరోజు జరిగిన పరిణామంతో కుటుంబ సభ్యుల మధ్య కలహాలు తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయనుకుంటున్నారు మంచు కుటుంబ అభిమానులు. కన్నప్ప సినిమా చాలా బాగుందని, ప్రభాస్ వచ్చిన తరువాత సినిమా నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిందని, క్లైమాక్స్ అద్భుతంగా ఉందని, అన్నయ్య కూడా ఇంత బాగా నటిస్తాడని అనుకోలేదని, తండ్రి మోహన్ బాబు గారి నటన గురించి ప్రత్యేకంగా తను చెప్పాలా, అదరగొట్టేశారన్నారు. ఈ సినిమా కోసం డబ్బు వేయింతలు తిరిగిరావాలని దేవుణ్ణి కోరుకుంటున్నానని, ఈ సినిమా ముందు అయిదు నిమిషాలు మిస్ అయ్యానని, మళ్ళీ ఆ అయిదు నిముషాల కోసం రేపు కూడా సినిమాకు వస్తానని తెలిపారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved