'కన్నప్ప' విజయం సాధించడంతో మంచు విష్ణుకి శుభాకాంక్షలు చెబుతూ పూల బొకే పంపించారు హీరో సూర్య. ఈ ఆనందాన్ని ట్విట్టర్ వేదికగా మంచు విష్ణు పంచుకున్నారు. ఆ బొకేతో పాటూ హీరో సూర్య తనకు పంపిన గ్రీటింగ్ మెసేజ్ కూడా షేర్ చేశారు విష్ణు. ఆ మెసేజ్ లో 'కన్నప్ప' ఇంతటి ఘన విజయం సాధించినందుకు చాలా సంతోషమని చెపుతూ, ఈ సినిమా కోసం విష్ణు పడ్డ శ్రమను, ఈ సినిమాపై అతను పెట్టుకున్న నమ్మకాన్ని, ఈ సినిమా పట్ల అతని అభిరుచిని హీరో సూర్య కొనియాడారు. సూర్య లాంటి గొప్ప వ్యక్తులు అభిమానించడం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని, సూర్య తనకెంతో స్ఫూర్తిదాయకమని తన ఆనందాన్ని తెలిపారు మంచు విష్ణు.