pizza

I Hope Kannappa Has The Blessings Of Lord Shiva: Mohanlal
ఆ శివుడి అనుగ్రహం ఈ ‘కన్నప్ప’ చిత్రంపై ఉండాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మోహన్‌లాల్

You are at idlebrain.com > news today >

15 June 2025
Hyderabad

Dynamic Star Vishnu Manchu’s dream project ‘Kannappa’ produced by M. Mohan Babu under the banners of AVA Entertainment and 24 Frames Factory, and directed by Mukesh Kumar Singh is set for a grand worldwide release on June 27th. The teaser, songs, and posters released so far have increased expectations around the movie. On Saturday, the trailer was launched at a spectacular event held in Kochi.

While speaking at the event, Mohanlal stated, “Right now, pan-India movies are trending. Films are being made without language barriers. ‘Kannappa’ has turned out really well, and I’m happy to be part of it. Actors, and technicians from different languages worked together on this movie.

I thank Mohan Babu and Vishnu for giving me such a powerful role. Kannappa was a great devotee of Lord Shiva, and this story was made beautifully. We shot it amazingly in New Zealand. Mohan Babu’s family is like my own. I pray that Lord Shiva blesses this ‘Kannappa’ movie. It’s releasing on June 27. I hope it becomes a big success.”

Dr Mohan Babu said, “Mohanlal is like a brother to me. Long ago, I remade his Malayalam film ‘Chitram’ into Telugu as ‘Alludu Garu’, and that helped me rise again as a star. Since then, we’ve been close. Mohanlal hasn’t changed one bit over the years, physically or mentally. He’s a simple man with a pure heart. He’s a great actor, and despite his status, he only brings one makeup man with him. He arrives on set before everyone else.

For this film, Mohanlal didn’t take a single rupee. I’m forever thankful for the love he showed. I’m happy that Vishnu got to act with him. I never had that chance, and I’m still asking for it. Our ‘Kannappa’ film is coming on June 27. I request Mohanlal’s fans to make this film collect more than his previous hit, ‘Thudarum’.”

Vishnu Manchu said, “There’s nothing more I need to say about ‘Kannappa’. You’ve already seen the visuals. This film happened with Lord Shiva’s blessings. It’s releasing on June 27. I’m a big fan of Mohanlal. He’s like a father figure to me and part of our family. His influence crosses generations. If you watch the trailer, you’ll understand the power of his character. I can’t reveal the surprise just yet. Sharing the screen with Mohanlal is a blessing from my past life. He is so humble.

Prabhas is my friend, and he has great respect for my father. Thank you to Aashirvad Cinemas for releasing our film.”

Director Mukesh Kumar Singh stated: “This land was walked by great saints like Parashurama and Adi Shankaracharya, who was a true devotee of Lord Shiva. Many people make movies with love and passion, but we made this film as a prayer to Shiva. Just as Krishna is called ‘Mohana’, I had the opportunity to work with two ‘Mohan’s in this film—Mohan Babu garu and Mohanlal garu, both outstanding actors.

I’ve learned so much from Mohan Babu garu about acting, passion, dedication, and his deep knowledge of cinema. Mohanlal’s acting speaks for itself. After seeing him off-screen, I want to be like him. Vishnu worked very hard for this movie. Today, the Ayyappa temple is being opened, and we released our trailer on this auspicious day. I hope Ayyappa Swamy’s blessings are with us.”

Actor Arpit Ranka said: “It was my luck to get a chance in a movie like ‘Kannappa’. With Lord Shiva’s blessings, we made it happen. I’m happy to have worked with Vishnu, Mohan Babu, Akshay Kumar, Mohanlal, and Prabhas. I recently watched Mohanlal’s ‘Thudarum’ and loved it. Please watch our film releasing on June 27.”

Actor Mukesh Rishi stated: “Vishnu worked very hard for this film. I’m happy to have acted in such a great project. Vishnu took very good care of all of us. I believe Lord Shiva will bless this film. I’m happy to have worked with Mohan Babu. All the best to the ‘Kannappa’ team.”

Aashirvad Cinemas Head Anthony Perumbavoor said: “A Mohan Babu film is like our own film. We consider it our home production. I believe everyone will love this movie.”

The trailer received overwhelming response from all corners and is trending top on YouTube. It indeed set the bar high for the movie.

ఆ శివుడి అనుగ్రహం ఈ ‘కన్నప్ప’ చిత్రంపై ఉండాలని కోరుకుంటున్నాను.. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో మోహన్‌లాల్

డైనమిక్ హీరో విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’ మూవీని అవా ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్ల మీద ఎం. మోహన్ బాబు నిర్మించారు. ఈ చిత్రానికి ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. ఈ మూవీ జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున రిలీజ్ కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, పాటలు, పోస్టర్లు సినిమాపై అంచనాల్ని పెంచేశాయి. ఇక శనివారం నాడు కొచ్చిలో ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఇక ఈ మేరకు నిర్వహించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో..

మోహన్‌లాల్ మాట్లాడుతూ .. ‘ప్రస్తుతం అంతా ప్యాన్ ఇండియన్ ట్రెండ్ నడుస్తోంది. భాషా హద్దుల్లేకుండా సినిమాల్ని తీస్తున్నారు. ‘కన్నప్ప’ చిత్రం అద్భుతంగా వచ్చింది. ఇంత మంచి చిత్రంలో నేను కూడా భాగమైనందుకు ఆనందంగా ఉంది. అన్ని భాషల నటీనటులు, ఆర్టిస్టులు, టెక్నీషియన్లు కలిసి ఈ మూవీని చేశారు. ఇంత మంచి పాత్రను నాకు ఇచ్చిన మెహన్ బాబు గారికి, విష్ణుకి థాంక్స్. శివుడుకి కన్నప్ప గొప్ప భక్తుడు. అలాంటి గొప్ప భక్తుడి కథను ఎంతో గొప్పగా నిర్మించారు. న్యూజిలాండ్‌లో ఈ మూవీని అద్భుతంగా తెరకెక్కించారు. మోహన్ బాబు గారి ఫ్యామిలీ అంటే నా ఫ్యామిలీ. ఆ శివుడి అనుగ్రహం ఈ ‘కన్నప్ప’ చిత్రంపై ఉండాలని కోరుకుంటున్నాను. జూన్ 27న ఈ చిత్రం రిలీజ్ కాబోతోంది. ఈ మూవీ పెద్ద విజయం సాధించాలని ఆశిస్తున్నాను’ అని అన్నారు.

డా. మోహన్ బాబు మాట్లాడుతూ .. ‘‘మోహన్‌లాల్ నాకు సోదరుడి వంటి వారు. ఇక్కడ మోహన్‌లాల‌్‌తో ప్రియదర్శిని తీసిన ‘చిత్రం’ మూవీని తెలుగులో నేను ‘అల్లుడు గారు’ అని రీమేక్ చేశాను. అలా జీరో నుంచి మళ్లీ స్టార్ హీరోగా నిలిచాను. అలా మా బంధం మొదలైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు లాల్ ఏమాత్రం మారలేదు. శారీరకంగా, మానసికంగా అలానే ఉన్నారు. స్వచ్చమైన ఆలోచనలు, హృదయం ఉన్నవారే ఇలా ఉండగలుగుతారు. మోహన్‌లాల్ గారు గొప్ప నటులు. ఆయన ఎంత స్థాయిలో ఉన్నా కూడా వెంట ఒక మేకప్ మెన్ మాత్రమే వస్తారు. మా అందరి కంటే సెట్‌లోకి ముందు వస్తుండేవారు. ఈ మూవీ కోసం ఇంత వరకు మోహన్‌లాల్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. ఆయన చూపించిన ప్రేమకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. లాల్ గారితో నటించే అవకాశం విష్ణుకి వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా ఇన్నేళ్ల కెరీర్‌లో ఆయనతో కలిసి ఎప్పుడూ నటించలేకపోయాను. ఇప్పుడైనా నాకు ఛాన్స్ ఇవ్వమని అడుగుతున్నాను. జూన్ 27న మా కన్నప్ప చిత్రం రాబోతోంది. అందరూ చూసి మా చిత్రయూనిట్‌ను ఆశీర్వదించండి. ‘తుడరుమ్’ కంటే ఎక్కువ కలెక్షన్స్ ఇవ్వాలని మోహన్‌లాల్ అభిమానుల్ని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

విష్ణు మంచు మాట్లాడుతూ. . ‘‘కన్నప్ప’ గురించి ఇక నేను చెప్పాల్సిన పని లేదు. మీరు ఆల్రెడీ విజువల్స్ చూశారు. ఈ మూవీ ఆ శివుడి ఆశీస్సులతోనే జరిగింది. మా చిత్రం జూన్ 27న రాబోతోంది. మోహన్‌లాల్ గారికి నేను పెద్ద అభిమానిని. ఆయన నాకు తండ్రి సమానులు. ఆయన మా కుటుంబ సభ్యులు. మోహన్‌లాల్ గారి ప్రభావం అన్ని తరాలపై ఉంటుంది. ట్రైలర్ చూస్తే మోహన్‌లాల్ గారి పాత్ర ఏంటో అర్థం అవుతోంది. ఆ సర్ ప్రైజ్ ఏంటో నేను ఇప్పుడే చెప్పలేను. ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం నా పూర్వ జన్మ సుకృతం. మోహన్‌లాల్ గారు ఎంతో ఒదిగి ఉంటారు. ప్రభాస్ నా స్నేహితులు. మా నాన్న గారంటే ప్రభాస్‌కి ఎనలేని గౌరవం ఉంటుంది. మా మూవీని రిలీజ్ చేస్తున్న ఆశీర్వాద్ సినిమాకు థాంక్స్’ అని అన్నారు.

ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ .. ‘పరుశురాముడు, ఆది శంకరాచార్యులు నడయాడిన నేల ఇది. ఆది శంకరాచార్యులు శివుడికి గొప్ప భక్తుడు. కన్నప్ప కూడా గొప్ప శివ భక్తుడు. సినిమాను అందరూ ప్రేమతో, ఇష్టంతో తీస్తారు. మేం మాత్రం ఈ మూవీని శివుడికి ఓ ప్రార్థనలా తీశాం. శివతత్త్వాన్ని చాటేలా ఈ మూవీని తీశాం. మోహనుడు అని కృష్ణుడ్ని అంటాం. అలా నేను ఈ మూవీలో ఇద్దరు మోహన్‌లతో పని చేశాను. మోహన్ బాబు గారు, మోహన్‌లాల్ గారు అద్భుతమైన నటులు. నటనపై ప్యాషన్, డెడికేషన్, సినిమా పట్ల ఉన్న నాలెడ్జ్ గురించి మోహన్ బాబు గారి నుంచి ఎంతో నేర్చుకున్నాను. లాల్ గారి నటన గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆఫ్ స్క్రీన్‌లో లాల్ గారిని చూసిన తరువాత నేను కూడా ఆయనలానే ఉండాలని అనుకుంటున్నాను. విష్ణు ఈ మూవీ కోసం ఎంతో కష్టపడ్డారు. అయ్యప్వ స్వామి గుడిని ఈ రోజు తెరుస్తున్నారు. ఈ రోజు మా ట్రైలర్‌ను రిలీజ్ చేయడం ఆనందంగా ఉంది. ఆ అయ్యప్ప స్వామి ఆశీస్సులు కూడా మా సినిమాపై ఉండాలని కోరుకుంటున్నాను’ అని అన్నారు.

అర్పిత్ రంకా మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’ లాంటి చిత్రంలో అవకాశం రావడం అదృష్టం. ఆ శివుడి ఆశీస్సులతోనే ఈ మూవీని చేయగలిగాం. విష్ణు గారు, మోహన్ బాబు గారు, అక్షయ్ కుమార్ గారు, మోహన్‌లాల్ గారు, ప్రభాస్ గారు వంటి వారితో పని చేయడం ఆనందంగా ఉంది. రీసెంట్‌గా నేను మోహన్‌లాల్ గారి తుడరం సినిమా చూశాను. అద్భుతంగా అనిపించింది. కన్నప్ప లాంటి చిత్రంలో నటించడం ఆనందంగా ఉంది. మా సినిమాను జూన్ 27న అందరూ చూడండి’ అని అన్నారు.

ముఖేష్ రిషి మాట్లాడుతూ .. ‘‘కన్నప్ప’ కోసం విష్ణు చాలా కష్టపడ్డారు. ఇంత గొప్ప చిత్రంలో నటించినందుకు ఆనందంగా ఉంది. విష్ణు మా అందరినీ ఎంతో అద్భుతంగా చూసుకున్నారు. ఈ మూవీని ఆ శివుడు ఆశీర్వదిస్తారు. మోహన్ బాబు గారితో పని చేయడం ఆనందంగా ఉంది. కన్నప్ప టీంకు ఆల్ ది బెస్ట్’ అని అన్నారు.

ఆశీర్వాద్ అధినేత ఆంటోని పెరంబవూర్ మాట్లాడుతూ .. ‘మోహన్ బాబు గారి సినిమా అంటే మా సినిమా. ఇది మా సొంత చిత్రం. ఈ మూవీని అందరూ ప్రేమిస్తారు’ అని అన్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved