“Every filmmaker in the country should feel ashamed after watching ‘Kantara Chapter 1’” – Ram Gopal Varma
'కాంతార' చూసి దేశంలోని దర్శకులందరూ సిగ్గు పడాలి - రామ్ గోపాల్ వర్మ
Noted for his unconventional takes on any subject, filmmaker Ram Gopal Varma once again sparked conversation with a viral post on social media. Whether it’s praise or criticism, RGV has always had his own distinct style of expression — and his latest comments on Kantara Chapter 1 are no different.
As Kantara Chapter 1 garners widespread positive response and strong box-office collections, praise is pouring in not just from audiences but also from industry insiders. Joining the chorus, Ram Gopal Varma shared his thoughts in his signature bold manner:
“Kantara Chapter 1 is a cinematic marvel. The level of craft Rishab Shetty and his team have shown in background music, sound design, cinematography, production design, and VFX is something that should make every filmmaker in this country feel ashamed. Even setting aside the story (which I consider an added bonus), the sheer effort by the team is enough to make this a blockbuster.”
He further applauded the producers, saying: “Hats off to Hombale Films for backing this film without compromising on any aspect. After watching this, I honestly can’t decide whether Rishab Shetty is a better actor or a better director.”
RGV’s passionate praise has added to the growing wave of admiration for Kantara Chapter 1, solidifying its status as one of the most talked-about cinematic experiences of the year.
'కాంతార' చూసి దేశంలోని దర్శకులందరూ సిగ్గు పడాలి - రామ్ గోపాల్ వర్మ
ఏ విషయంపై అయినా కాస్త భిన్న రీతిలో స్పందించడం ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ కు అలవాటు. అది ప్రశంస అయినా విమర్శ అయినా కాస్త ఆయన స్పందించే తీరే వేరు అన్నట్టుగా ఉంటుంది ఆయన వ్యవహార శైలి. అంతే విభిన్నంగా ఈరోజు ఆయన సోషల్ మీడియాలో పెట్టిన ఓ పోస్టు వైరల్ అవుతోంది.
'కాంతార చాప్టర్ 1' కు అన్ని వర్గాల నుండీ పాజిటివ్ టాక్ రావడంతో బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను రాబట్టుకుంటోంది. ప్రేక్షకులతో పాటూ అటు సినీ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంశల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా రామ్ గోపాల్ వర్మ ఈ సినిమా ఫలితంపై తనదైన శైలిలో స్పందించారు. "' కాంతార చాప్టర్ 1' సినిమా ఓ అద్భుతం. మన దేశంలోని దర్శకులు అందరూ సిగ్గుపడే స్థాయి కృషిని రిషబ్ శెట్టి మరియు అతని బృందం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో, సౌండ్ డిజైన్లో, సినిమాటోగ్రఫీలో, ప్రొడక్షన్ డిజైన్లో మరియు విజువల్ ఎఫెక్టుల్లో చూపించారు. కథా విషయాన్ని పక్కన పెట్టినా కూడా (కథ అన్నది సినిమాకు ఒక అదనపు అంశం మాత్రమే) ఆ బృందం పడ్డ శ్రమ ఒక్కటే 'కాంతార చాప్టర్ 1' ను బ్లాక్‌బస్టర్‌గా నిలబెట్టేలా చేయగలిగింది. ఈ సినిమాను ఎలాంటి రాజీ పడకుండా నిర్మించిన 'హొంబాలే ఫిలిమ్స్' కు నా హ్యాట్స్ ఆఫ్. ఈ సినిమా చూసి రిషబ్ శెట్టి గొప్ప దర్శకుడా లేక గొప్ప నటుడా అని నేను నిర్ణయించలేకపోతున్నాను" అంటూ తనదైన శైలిలో సినిమాపై ప్రశంశలు కురిపించారు రామ్ గోపాల్ వర్మ.