A heartfelt post by director-actor Rishab Shetty is going viral on social media, drawing admiration from fans for his journey. With Kantara Chapter 1 receiving highly positive response and surging ahead at the box office, Rishab took a moment to reflect on his past.
He wrote, “In 2016, at the beginning of my career, I struggled so much just to get one evening show. Today, I’m seeing 5,000 houseful boards for my film Kantara Chapter 1. I’ll never forget the love of the audience and the grace of God that made this journey possible. This success is only because of the audience’s love.”
The film, produced by Hombale Films and directed by Rishab himself, features Rukmini Vasanth as the female lead. Music by B. Ajaneesh Loknath has added great strength to the film’s impact.
ఆరోజు ఒక్క షో కోసం చాలా శ్రమించా- రిషబ్ శెట్టి
దర్శకుడు మరియు నటుడు రిషబ్ శెట్టి పెట్టిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ పోస్ట్ చూసిన అతని అభిమానులు అతని ప్రయాణంపై ప్రశంశలు కురిపిస్తున్నారు. 'కాంతార చాప్టర్ 1' బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ సంపాదించడంతో పాటూ భారీ కలక్షన్ల వైపు దూసుకుపోతుంది. దాంతో ఆ ఆనందాన్ని వ్యక్తం చేసే క్రమంలో రిషబ్ శెట్టి తన గతాన్ని గుర్తుచేసుకుంటూ "నా కెరీర్ ఆరంభంలో 2016 లో ఒక్క ఈవెనింగ్ షో కోసం ఎంతో శ్రమ పడ్డ నేను ఈరోజు నా 'కాంతార చాప్టర్ 1' సినిమాకు 5000 హౌస్ ఫుల్ బోర్డులు చూస్తున్నా. నా ఈ ప్రయాణంలో భగవంతుడి దయతో పాటూ ప్రేక్షకులు చూపిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేను. ప్రేక్షకుల ప్రేమ వల్లనే ఇంతటి విజయం సాధ్యమైంది" అంటూ తన సంతోషాన్ని వ్యక్తం చేశారు రిషబ్ శెట్టి. 'హొంబాలే ఫిలిమ్స్' నిర్మాణంలో, రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రుక్మిణీ వసంత్ కథానాయికగా కనిపించగా, సంగీత దర్శకుడు అజనీష్ లోక్ నాథ్ అందించిన సంగీతం ఈ సినిమాకు అదనపు బలమయిందనే చెప్పుకోవచ్చు.
2016 ರಲ್ಲಿ ಒಂದು ಪ್ರದರ್ಶನಕ್ಕಾಗಿ ಒದ್ದಾಡಿದ ದಿನದಿಂದ, 5000ಕ್ಕೂ ಹೆಚ್ಚು housefull ಶೋಗಳ ಈ ಅದ್ಭುತ ಪಯಣ. ಇದು ಸಾಧ್ಯವಾಗಿದ್ದು ನಿಮ್ಮ ಪ್ರೀತಿ ಮತ್ತು ಬೆಂಬಲದಿಂದ ಮಾತ್ರ. ಇದಕ್ಕಾಗಿ ನಾನು ನಿಮಗೆ ಸದಾ ಋಣಿ.
From struggling to get one evening show in 2016 to 5000+ housefull shows in 2025. This journey is… https://t.co/vuSfaVIAA2