pizza

Gayatri Bhardwaj Joins Sundeep Kishan’s Pan-Indian Film Karikaala, Directed by Shambhala Fame Ugandhar Muni
సందీప్ కిషన్‌ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ‘కరికాల’ చిత్రంలో నటించనున్న గాయత్రి భరద్వాజ్

You are at idlebrain.com > news today >

14 October 2026
Hyderabad

Sundeep Kishan is playing the lead in Karikaala, an ambitious cinematic venture directed by Shambhala fame Ugandhar Muni and produced by Mahidhar Reddy and Rajasekhar Annabhimoju under the Shining Pictures banner. Following the success of Shambhala, the director and producers are gearing up to create another visual spectacle with this ambitious project.

The makers have planned Karikaala as a two-part film, with the first chapter scheduled for release on July 2, 2027, and the second chapter arriving in theatres on October 28, 2027. The posters unveiled so far have generated considerable buzz and heightened curiosity about the film.

Recently, the makers announced that Catherine Tresa and Sakshi Mhadolkar would be part of the project. Now, Gayatri Bhardwaj has joined the cast in a pivotal role. Welcoming her on board, the Karikaala team unveiled a special poster announcing her inclusion in the film.

Mounted on a grand scale, Karikaala is envisioned as a pan-Indian spectacle featuring world-class technology, cutting-edge visual effects, spectacular production design, and compelling storytelling. The team is striving to deliver a distinctive socio-fantasy experience for audiences across India.

The film’s music is being composed by Sricharan Pakala. The grand pooja ceremony for Karikaala is scheduled to take place on October 15, with several prominent personalities expected to attend the auspicious occasion.

సందీప్ కిషన్‌ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్ మీద ‘శంబాల’ ఫేమ్ యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న ‘కరికాల’ చిత్రంలో నటించనున్న గాయత్రి భరద్వాజ్

సందీప్ కిషన్ హీరోగా షైనింగ్ పిక్చర్స్ బ్యానర్‌పై మహిధర్ రెడ్డి, రాజశేఖర్ అన్నభీమోజు నిర్మాణంలో యుగంధర్ ముని తెరకెక్కిస్తున్న చిత్రం ‘కరికాల’. ‘శంబాల’ తర్వాత దర్శక, నిర్మాతలు మళ్లీ ఓ విజువల్ వండర్‌ను క్రియేట్ చేసేందుకు రెడీ అయ్యారు. ఈ క్రమంలోనే ‘కరికాల’ మూవీని రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు. ‘కరికాల’ మొదటి చాప్టర్‌ 2027 జూలై 2న , రెండో చాప్టర్ 2027 అక్టోబర్ 28న విడుదల కాబోతోన్నట్టుగా మేకర్స్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన పోస్టర్లు సినిమాపై బజ్‌ను క్రియేట్ చేశాయి.

రీసెంటుగా ఈ చిత్రం నుంచి కేథరిన్ థ్రెసా, సాక్షి మడోల్కర్‌ నటించనున్నట్టుగా ప్రకటించారు. తాజాగా ఈ సినిమాలో గాయత్రి భరద్వాజ్ కూడా ముఖ్య పాత్రను పోషించబోతోన్నారని మేకర్స్ ప్రకటించారు. ఈ మేరకు వెల్కమ్ ఆన్ బోర్డ్ అంటూ ‘కరికాల’ టీం స్పెషల్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది.

వరల్డ్ క్లాస్ టెక్నాలజీ, అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, అద్భుతమైన ప్రొడక్షన్ డిజైన్, అత్యద్భుతమైన కథనంతో 'కరికాల' పాన్ ఇండియన్ సినిమాగా రాబోతోంది. భారతీయ ప్రేక్షకులకు ఒక ప్రత్యేకమైన సోషియో-ఫాంటసీ అనుభవాన్ని అందించాలని లక్ష్యంగా ‘కరికాల’ టీం పని చేస్తోంది. ఈ సినిమాకి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. అక్టోబర్ 15న ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఘనంగా జరగబోతోన్నాయి. ఈ కార్యక్రమంలో అతిరథ మహారథులంతా పాల్గొని సందడి చేయనున్నారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2026 Idlebrain.com. All rights reserved