pizza

Karunakaran to direct Ganesh Bellamkonda
పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' దర్శకుడితో రాబోతున్న బెల్లంకొండ గణేష్....!!

You are at idlebrain.com > news today >

9 September 2025
Hyderabad

Back then, Tholi Prema was a sensational film. It played a pivotal role in skyrocketing Pawan Kalyan’s craze among the youth. Director Karunakaran made a strong mark in the industry right from his debut with his unique style of portraying tender love stories. Impressed by his work, Pawan Kalyan later entrusted him with Balu as well. Karunakaran also delivered a hit with Darling starring Prabhas.

Now, Bellamkonda Sreenivas recently revealed in an interview that a new combination is in the works with the same director. His younger brother, Bellamkonda Ganesh Babu, is set to do a film under Karunakaran’s direction.

Sreenivas expressed happiness, saying that though he couldn’t be launched by Karunakaran back then as he had wished, he’s now glad that his brother is getting that opportunity.

పవన్ కళ్యాణ్ 'తొలిప్రేమ' దర్శకుడితో రాబోతున్న బెల్లంకొండ గణేష్....!!

అప్పట్లో 'తొలిప్రేమ' సినిమా ఓ సంచలనం. యువతలో పవన్ కళ్యాణ్ క్రేజ్ పెరగడంలో అప్పట్లో 'తొలిప్రేమ' సినిమా కీలక పాత్రనే పోషించింది. సున్నితమైన ప్రేమ కథలను తెరకెక్కించడంలో తనకంటూ ఓ విభిన్న శైలిని సంపాదించుకోవడంలో కరుణాకరన్ కు తన మొదట సినిమాతోనే పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. దాంతో పవన్ కళ్యాణ్ తన 'బాలు' సినిమా అవకాశం కూడా అదే దర్శకుడికి ఇవ్వడం జరిగింది. ప్రభాస్ తో కూడా 'డార్లింగ్' సినిమా తీసి హిట్టు కొట్టారు కరుణాకరన్.

ఇప్పుడు అదే దర్శకుడితో ఓ కొత్త కాంబో రాబోతుందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్ ప్రకటించారు. తన తమ్ముడు బెల్లంకొండ గణేష్ బాబు, దర్శకుడు కరుణాకరన్ తో సినిమా చేయబోతున్నట్టు ఆయన తెలిపారు. తనకు కరుణాకరన్ దర్శకత్వంలో లాంచ్ అవ్వాలన్న కోరిక అప్పట్లో కుదరకపోయినా, ఇప్పుడు తన తమ్ముడితో అదే దర్శకుడు సినిమా చేయడం పట్ల ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved