pizza

KD - The Devil Teaser Launch
“‘KD The Devil’ will captivate everyone” – Dhruva Sarja
‘కేడీ ది డెవిల్’ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ధృవ సర్జా

You are at idlebrain.com > news today >

10 July 2025
Hyderabad

Speaking at the event, Sanjay Dutt said, “I share a special bond with Hyderabad. I’ve worked with many people here, and I absolutely love the food in this city. I’m currently working on a film with Prabhas sir, and I’m trying to learn Telugu there. I’m a huge fan of Chiranjeevi garu. Producer Venky sir and Suprith are extremely passionate about cinema, which is why they were able to bring such a grand film to life. Director Prem is a wonderful person, very humble. Reeshma has done a fantastic job, and Dhruva is like a younger brother to me. I wish him great success. It’s always full of energy working with Shilpa Shetty. I hope everyone watches and supports our film.”

Dhruva Sarja said, “Thanks to everyone who worked on KD – our cinematographer William, producer Venkat, Suprith, music director Arjun – thank you all. I admire Sanjay Dutt sir a lot, and it was a joy working with him. It’s always a pleasure working with talented actors like Shilpa Shetty, who even helps correct our performances on set. Reeshma is a very good actress. Our movie is releasing soon, and I believe everyone will enjoy it.”

Director Prem said, “I’m speechless seeing the response to the ‘KD The Devil’ teaser. I only speak Kannada, though I understand Telugu but can’t speak it fluently. I had made ‘Jogi’ in Kannada, which was remade here as ‘Yogi’. I was once asked to direct the Telugu version, but I declined due to the language barrier. I watch a lot of Telugu films and often visit Chiranjeevi garu’s home. Now, I’m coming to the Telugu audience with ‘KD’. The teaser is already receiving an overwhelming response. My friend and family-like Dhruva Sarja has stood by me throughout this journey. The character ‘Kalidasa’ carries a lot of emotion, and Dhruva portrayed it beautifully. I thank Sanju Baba for taking it on - I’ve always been a big fan of his. Shilpa Shetty was very cooperative during the shoot, and Reeshma is a talented artist. The film has already created records in audience rights. I believe everyone will love it.”

Shilpa Shetty said, “My debut film wasn’t in Hindi - it was in Telugu. I did ‘Sahasaveerudu Sagara Kanya’. Ever since then, the Telugu audience has always showered me with love. I thank director Prem for giving me the role of Satyavati. Producer Venkat has great passion for cinema. Working with Dhruva and Reeshma was a joy. Every film I’ve done with Sanjay Dutt has been a hit - I hope this trend continues. This film has all the commercial elements, and Prem has directed it with a lot of heart.”

Reeshma Nanaiah said, “I first came here for the ‘UI’ promotion, and now I’m back for ‘KD’. I hope everyone liked the teaser. This movie is very special to me. All the characters are unique and different. It’s a new concept. I’m grateful to director Prem for giving me a chance to be part of such a massive project with such a stellar cast. Akshita madam and Prem sir introduced me to the industry - they are my mentors. Sanjay Dutt sir is a wonderful person and patiently listens to everything. Shilpa Shetty ma’am brought such positive energy to the sets—I’ve learned a lot from her. Working with Dhruva sir was amazing. He’s very encouraging to his fellow actors. I’m happy to work with a prestigious banner like KVN. I believe this film will appeal to everyone.”

KVN Productions Business Head Suprith added, “The teaser received an excellent response in Mumbai and is currently trending on YouTube. Huge thanks to director Prem for delivering such a powerful mass teaser. We have events lined up in Kochi, Bengaluru, and Chennai. Special thanks to Sanjay Dutt sir for joining us despite his busy schedule. What you saw of Dhruva sir in the teaser is just a glimpse - he’ll be phenomenal on screen. I thank our producer Venkat sir for making this possible.”

Cast:
Dhruva Sarja, Reeshma Nanaiah, V. Ravichandran, Ramesh Aravind, Sanjay Dutt, Shilpa Shetty, Nora Fatehi, Yash Shetty, and others.

Technical Team:
Banner: KVN Productions
Producer: KVN
Director: Prem
Head of Business & Operations: Suprith
DOP: William David
Music Director: Arjun Janya
Art Director: Mohan B Kere
Dialogues: Kranti Kumar

‘కేడీ ది డెవిల్’ చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది.. టీజర్ లాంచ్ ఈవెంట్‌లో ధృవ సర్జా

కన్నడ యాక్షన్ ప్రిన్స్ ధృవ సర్జా హీరోగా కేవీఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ మీద నిర్మాత వెంకట్ కె. నారాయణ అత్యంత భారీ ఎత్తున నిర్మించిన చిత్రం ‘కేడీ ది డెవిల్’. ఈ సినిమాను ప్రేమ్ తెరకెక్కించారు. ఈ మూవీలో ధృవ సర్జాకు జోడిగా రీష్మా నానయ్య నటించారు. ఇక ఈ ప్రాజెక్ట్‌లో సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి వంటి వారంతా ముఖ్య పాత్రల్ని పోషించారు. గురువారం నాడు ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రిలీజ్ చేశారు. ఈ మేరకు నిర్వహించిన టీజర్ లాంచ్ ఈవెంట్‌లో..

సంజయ్ దత్ మాట్లాడుతూ .. ‘హైదరాబాద్‌తో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఇక్కడ ఎంతో మందితో కలిసి పని చేశాను. మరీ ముఖ్యంగా నాకు హైదరాబాద్ ఫుడ్ అంటే చాలా ఇష్టం. నేను ప్రభాస్ రాజా సాబ్‌ సినిమాకు పని చేస్తున్నాను. అక్కడే తెలుగు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాను. నాకు తెలుగులో చిరంజీవి గారంటే చాలా ఇష్టం. కేవీఎన్ ప్రొడక్షన్స్ వెంకీ సర్, సుప్రిత్‌లకు సినిమా పట్ల ఎంతో ప్యాషన్ ఉంది. అందుకే ఇలాంటి మూవీని ఇంత గొప్పగా నిర్మించగలిగారు. డైరెక్టర్ ప్రేమ్ చాలా మంచి వ్యక్తి. ఆయన ఎంతో ఒదిగి ఉంటారు. రీష్మా చాలా చక్కగా నటించారు. ధృవ్ నా తమ్ముడులాంటివారు. ధృవ చాలా ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్నాను. శిల్పా శెట్టితో ఎప్పుడు పని చేసినా అదే ఎనర్జీ ఉంటుంది. మా సినిమాను అందరూ చూసి సక్సెస్ చేయండి’ అని అన్నారు.

ధృవ సర్జా మాట్లాడుతూ .. ‘‘కేడీ’ కోసం పని చేసిన ప్రతీ ఒక్కరికీ థాంక్స్. మా కెమెరామెన్ విలియం, మా నిర్మాత వెంకట్, సుప్రిత్, మ్యూజిక్ డైరెక్టర్ అర్జున్ అందరికీ ధన్యవాదాలు. నాకు సంజయ్ దత్ గారు అంటే ఎంతో ఇష్టం. ఆయనతో పని చేయడం ఆనందంగా ఉంది. శిల్పా శెట్టి వంటి యాక్టర్లతో పని చేయడం ఎప్పుడూ సంతోషంగానే ఉంటుంది. సెట్స్ మీద ఆమె మా యాక్టింగ్‌ను కరెక్ట్ చేస్తుంటారు. రీష్మా మంచి నటి. మా మూవీ త్వరలోనే రాబోతోంది. అందరూ చూడండి. అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు.

దర్శకుడు ప్రేమ్ మాట్లాడుతూ .. ‘‘కేడీ ది డెవిల్’ టీజర్‌కు వస్తున్న రెస్పాన్స్ చూస్తే నాకు మాటలు రావడం లేదు. నాకు కన్నడ మాత్రమే వచ్చు. తెలుగు అర్థం అవుతుంది. కానీ మాట్లాడటానికి రాదు. జోగి అని నేను కన్నడలో తీస్తే తెలుగులో ఇక్కడ యోగి అంటూ చేశారు. కానీ అప్పుడు రీమేక్ చేయమని అడిగారు. కానీ నాకు భాష తెలీదు కదా అని చేయలేను అని చెప్పాను. నేను తెలుగులో ఎక్కువగా చిత్రాలు చూస్తుంటాను. చిరంజీవి గారి ఇంటికి తరుచుగా వెళ్తుంటాం. ఇప్పుడు నేను ‘కేడీ’ చిత్రంతో రాబోతోన్నాను. టీజర్ ఆల్రెడీ అందరినీ ఆకట్టుకుంటోంది. నా ఫ్రెండ్, ఫ్యామిలీ పర్సన్ ధృవ సర్జా నాకు ఈ ప్రయాణంలో అండగా నిలిచారు. కాళిదాసు పాత్రలో ఎంతో ఎమోషన్ ఉంటుంది. ధృవ ఈ కారెక్టర్‌ను అద్భుతంగా పోషించారు. ఈ పాత్రను ఒప్పుకున్న సంజూ బాబాకి థాంక్స్. నేను ఆయనకు చాలా పెద్ద అభిమానిని. చిత్రీకరణ సమయంలో శిల్పా శెట్టి గారు ఎంతో సహకరించారు. రీష్మా టాలెంటెడ్ వ్యక్తి. ఈ మూవీ ఆడియెన్స్ రైట్స్‌లో రికార్డులు క్రియేట్ చేసింది. అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని భావిస్తున్నా’ అని అన్నారు.

శిల్పా శెట్టి మాట్లాడుతూ .. ‘హిందీలో కాకుండా నేను మొదటగా తెలుగులో సినిమాను చేశాను. సాహసవీరుడు సాగర కన్య అని సినిమాను చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు తెలుగు వారు నాపై అదే ప్రేమను చూపిస్తున్నారు. సత్యవతి పాత్రను నాకు ఇచ్చిన డైరెక్టర్ ప్రేమ్ గారికి థాంక్స్. కేవీఎన్ వెంకట్ గారికి సినిమా పట్ల చాలా ప్యాషన్ ఉంది. ధృవ, రీష్మాలతో పని చేయడం సంతోషంగా ఉంది. సంజయ్ దత్ గారితో నేను చేసిన ప్రతీ సినిమా హిట్ అయింది. అదే ట్రెండ్ ఇప్పుడు కంటిన్యూ అవుతుందని భావిస్తున్నాను. ఈ చిత్రం అందరినీ ఆకట్టుకుంటుందని భావిస్తున్నాను. ఈ చిత్రంలో అన్ని కమర్షియల్ అంశాలున్నాయి. ఈ మూవీని ప్రేమ్.. ఎంతో ప్రేమతో తెరకెక్కించారు’ అని అన్నారు.

రీష్మా నానయ్య మాట్లాడుతూ .. ‘నేను మొదటి సారిగా యూఐ ప్రమోషన్‌కు ఇక్కడకు వచ్చాను. మళ్లీ ఇప్పుడు కేడీ మూవీ కోసం వచ్చాను. మీ అందరికీ టీజర్ నచ్చిందని భావిస్తున్నాను. ఈ మూవీ నాకెంతో ప్రత్యేకం. ఈ చిత్రంలో అన్ని పాత్రలు డిఫరెంట్‌గా, యూనిక్‌గా ఉంటుంది. చాలా కొత్త సబ్జెక్ట్‌తో ఈ చిత్రం రాబోతోంది. ఇంత భారీ క్యాస్టింగ్‌తో వచ్చిన చిత్రంలో నాకు అవకాశం ఇచ్చిన ప్రేమ్ గారికి థాంక్స్. అక్షిత మేడం, ప్రేమ్ సర్‌లు నన్ను ఇండస్ట్రీకి పరిచయం చేశారు. వాళ్లే నా గురువులు. సంజయ్ దత్ గారు చాలా మంచి వ్యక్తి. మనం చెప్పేవన్నీ ఆయన ఓపికతో వింటారు. శిల్పా శెట్టి మేడం సెట్స్ మీదకు ఓ ఎనర్జీని తీసుకు వచ్చేవారు. ఆమెను చూసి నేను ఎంతో నేర్చుకున్నాను. ధృవ సర్‌తో కలిసి పని చేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఆయన తోటి ఆర్టిస్టుల్ని ఎంతో ఎంకరేజ్ చేస్తుంటారు. కేవీఎన్ లాంటి భారీ సంస్థలో పని చేయడం ఆనందంగా ఉంది. మా చిత్రం అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది’ అని అన్నారు.

కేవీఎన్ ప్రొడక్షన్ బిజినెస్ హెడ్ సుప్రిత్ మాట్లాడుతూ .. ‘ముంబైలో టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రస్తుతం యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతోంది. ఇంత మంచి మాస్ టీజర్‌ను ఇచ్చిన ప్రేమ్ గారికి థాంక్స్. రేపు కొచ్చి, బెంగళూరు, చెన్నైలో ఈవెంట్లు ప్లాన్ చేశాం. ఎంతో బిజీగా ఉన్నా కూడా మాతో పాటుగా వస్తున్న సంజయ్ దత్ గారికి థాంక్స్. టీజర్‌లో ధృవ సర్‌ చేసింది చాలా తక్కువ. తెరపై ఆయన అదరగొట్టేస్తారు. మాకు ఈ అవకాశం ఇచ్చిన మా నిర్మాత వెంకట్ గారికి థాంక్స్’ అని అన్నారు.

నటీనటులు : ధృవ సర్జా, రీష్మా నానయ్య, వి రవిచంద్రన్, రమేష్ అరవింద్, సంజయ్ దత్, శిల్పా శెట్టి, నోరా ఫతేహి, యష్ శెట్టి తదితరులు

టెక్నికల్ టీం
బ్యానర్: కెవిఎన్ ప్రొడక్షన్స్
నిర్మాత: కెవిఎన్
దర్శకుడు: ప్రేమ్
హెడ్-బిజినెస్ & కార్యకలాపాలు: సుప్రిత్
DOP: విలియం డేవిడ్
సంగీత దర్శకుడు: అర్జున్ జన్య
ఆర్ట్ డైరెక్టర్: మోహన్ బి కేరె
డైలాగ్స్: క్రాంతి కుమార్


Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved