On Twitter, producer Naga Vamsi shared an intriguing post about Kingdom. He mentioned that no matter what he posts, the comments always demand the release date of Kingdom. He emphasized that the film’s team is working tirelessly to deliver a spectacular theater experience for the audience. He said he only shares details with the audience when he is fully confident, as he knows how creatively they would react if there’s even a slight discrepancy in what he promises. He described Kingdom as a “full meal,” assuring it will be a solid commercial entertainer with strong drama. He also announced that the release date, teaser, and song announcements will be revealed soon.
ప్రేక్షకుల ఊహకు మించి కింగ్ డమ్ ఉంటుందన్న నాగ వంశీ..
నిర్మాత నాగ వంశీ ట్విట్టర్ వేదికగా కింగ్ డమ్ గురించి ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ లో తనేం పోస్ట్ చేసినా క్రింద కామెంట్స్ లో కింగ్ డమ్ రిలీజ్ డేట్ గురించే తనను గట్టిగా అడుగుతారని ముందే తెలుసన్నారు నాగ వంశీ. ఈ సినిమాను ప్రేక్షకులకు ఒక అద్భుతమైన థియేటర్ అనుభవం ఇవ్వడం కోసం ఈ చిత్ర బృందం రోజంతా కష్టపడుతున్నారన్నారు. ముందు తనకు ఎంతో నమ్మకం కలిగితేనే తప్ప దానిని ప్రేక్షకులకు చెప్పనని, ఒకవేళ తను చెప్పేదాంట్లో ఏదైనా చిన్న తేడా వచ్చినా, తన మీద ఎంత క్రియేటివిటీ ఉపయోగిస్తారో తనకు తెలుసునన్నారు. కింగ్ డమ్ సినిమా ఫుల్ మీల్స్ లా ఉంటుందని, సాలిడ్ డ్రామాతో తప్పకుండా మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ అవుతుందన్నారు. అతి త్వరలోనే రిలీజ్ డేట్ టీజర్, సాంగ్ అనౌన్స్ మెంట్ రాబోతుందన్నారు.