pizza

“We’ve Passed the First Test with ‘Kingdom’” – Producer Suryadevara Naga Vamsi
‘కింగ్‌డమ్’ చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి: కథానాయకుడు విజయ్ దేవరకొండ

You are at idlebrain.com > news today >

30 July 2025
Hyderabad

The much-awaited film Kingdom is gearing up for release, with Telugu audiences across the globe eagerly looking forward to it. Starring Vijay Deverakonda in the lead role, the film features Bhagyashri Borse and Satya Dev in pivotal roles and is directed by Gautham Tinnanuri. Produced by Suryadevara Naga Vamsi and Sai Soujanya under the banners of Sithara Entertainments and Fortune Four Cinemas, the film is presented by Srikara Studios. Music is composed by rockstar Anirudh Ravichander. The film is set for a grand theatrical release on July 31. With impressive songs and promos already out, expectations skyrocketed after the release of the trailer.

Ahead of the release, the team addressed the media, sharing their thoughts and experiences.

Hero Vijay Deverakonda said:
“We’re very satisfied with the output of the film. The response to bookings has been phenomenal, and it’s comforting to feel the trust the Telugu audience places in us. That’s what gives us peace ahead of the release. Kingdom is directed by Gautham Tinnanuri, who made Jersey. This film is rich in emotion. If you look at history, every war has been fought for either family, land, or love - and this film follows that sentiment. It’s built on strong family emotions. Within the first two minutes, audiences will be transported into the world of Kingdom. Everyone who steps into the theatre will walk out with a memorable experience.”

Producer Suryadevara Naga Vamsi added:
“These days, getting good openings is a major challenge, but we’ve passed that test. Bookings are strong. We’re hoping for a big box office success. This isn’t a full-fledged action film - it's a gangster drama with Gautham’s signature emotional storytelling. The film includes elements that will appeal to all types of audiences. We didn’t build massive sets for this one - most of it was shot on real locations. The hard work of our team will clearly be visible on screen.”

Heroine Bhagyashri Borse said:
“I play the character Madhu, a crucial role in the story. Gautham sir has shaped the role beautifully. It was a pleasure working alongside an actor like Vijay. I hope audiences will connect with and enjoy this film.”

Cast: Vijay Deverakonda, Satya Dev, Bhagyashri Borse
Director: Gautham Tinnanuri
Producers: Suryadevara Naga Vamsi, Sai Soujanya
Music: Anirudh Ravichander
Cinematography: Jomon T. John ISC, Girish Gangadharan ISC
Costume Design: Neeraja Kona
Art Direction: Avinash Kolla
Editing: Naveen Nooli
Production Banners: Sithara Entertainments, Fortune Four Cinemas
Presentation: Srikara Studios

‘కింగ్‌డమ్’ చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి: కథానాయకుడు విజయ్ దేవరకొండ

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులంతా ఎంతగానో ఎదురుచూస్తున్న చిత్రం ‘కింగ్‌డమ్’. విజయ్ దేవరకొండ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే, సత్యదేవ్ ముఖ్య పాత్రలు పోషించారు. గౌతమ్ తిన్ననూరి దర్శకత్వం వహించారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. రాక్ స్టార్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించారు. జూలై 31న ప్రేక్షకుల ముందుకు రానున్న ‘కింగ్‌డమ్’పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలు, పాటలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా ఇటీవల విడుదలైన ట్రైలర్ సినిమాపై అంచనాలను తారాస్థాయికి తీసుకువెళ్ళింది. రేపు(గురువారం) ‘కింగ్‌డమ్’ ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపథ్యంలో తాజాగా చిత్ర బృందం పాత్రికేయుల సమావేశం నిర్వహించింది.

ఈ సందర్భంగా కథానాయకుడు విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. "సినిమా అవుట్ పుట్ పట్ల మేము చాలా సంతృప్తిగా ఉన్నాము. బుకింగ్స్ కి వస్తున్న అద్భుతమైన స్పందన చూసి మాకు సంతోషంగా ఉంది. తెలుగు ప్రేక్షకులు ఇస్తున్న భరోసాతోనే.. మేము సినిమా విడుదల ముందు ఇంత ప్రశాంతంగా ఉండగలుగుతున్నాము. 'జెర్సీ' సినిమా తీసిన గౌతమ్ తిన్ననూరి 'కింగ్‌డమ్' ఇది. ఈ చిత్రంలో భావోద్వేగాలు కట్టిపడేస్తాయి. చరిత్రలో ఏ యుద్ధం చూసుకున్నా.. కుటుంబం కోసమో, పుట్టిన నేల కోసమో, ప్రేమ కోసమో ఉంటుంది. ఈ యుద్ధం కూడా అలాంటిదే. కుటుంబ భావోద్వేగాల నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. సినిమా మొదలైన రెండు నిమిషాలకే ప్రేక్షకులు 'కింగ్‌డమ్' ప్రపంచంలోకి వెళ్తారు. థియేటర్ కి వచ్చిన ప్రతి ఒక్కరికీ ఈ చిత్రం మంచి అనుభూతిని ఇస్తుంది." అన్నారు.

నిర్మాత సూర్యదేవర నాగ వంశీ మాట్లాడుతూ.. "ఈమధ్య కాలంలో సినిమాలకు ఓపెనింగ్స్ రాబట్టడం పెద్ద ఛాలెంజ్ అయిపోయింది. ఆ పరంగా చూస్తే మేము పాస్ అయ్యాము. బుకింగ్స్ బాగున్నాయి. మంచి వసూళ్లతో సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశిస్తున్నాను. ఇది పూర్తిస్థాయి యాక్షన్ చిత్రం కాదు. గౌతమ్ తిన్ననూరి శైలి ఎమోషన్స్ ఉంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులు మెచ్చే అంశాలతో తెరకెక్కిన గ్యాంగ్ స్టర్ డ్రామా ఇది. ఈ సినిమా కోసం సెట్స్ వేయలేదు. ఎక్కువ భాగం రియల్ లొకేషన్స్ లో షూట్ చేశాం. మా టీమ్ పడిన కష్టం మీకు తెర మీద కనిపిస్తుంది." అన్నారు.

కథానాయిక భాగ్యశ్రీ బోర్సే మాట్లాడుతూ.. "కింగ్‌డమ్ లో మధు అనే కథకు కీలకమైన పాత్ర పోషించాను. గౌతమ్ గారు పాత్రను అద్భుతంగా మలిచారు. విజయ్ లాంటి నటుడితో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను." అన్నారు.

తారాగణం: విజయ్ దేవరకొండ, సత్యదేవ్, భాగ్యశ్రీ బోర్సే
దర్శకత్వం: గౌతమ్ తిన్ననూరి
నిర్మాతలు: సూర్యదేవర నాగ వంశీ, సాయి సౌజన్య
సంగీతం: అనిరుధ్ రవిచందర్
ఛాయాగ్రహణం: జోమోన్ టి. జాన్ ISC, గిరీష్ గంగాధరన్ ISC
కాస్ట్యూమ్ డిజైనర్: నీరజ కోన
కళా దర్శకుడు: అవినాష్‌ కొల్లా
కూర్పు: నవీన్ నూలి
నిర్మాణ సంస్థలు: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్
సమర్పణ: శ్రీకర స్టూడియోస్

Privacy Policy | Disclaimer | Copyright 1999 - 2025 Idlebrain.com. All rights reserved